80వ స్వాతంత్య్ర వేడుకలు: ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

స్వాతంత్య్ర దినోత్సవం, స్వాతంత్య్ర వేడుకలు, నరేంద్ర మోదీ, దిల్లీ, ఎర్రకోట

ఫొటో సోర్స్, ANI

ప్రచురణ
చదివే సమయం: 1 నిమిషాలు

80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిల్లీలోని ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.

జాతీయ జెండాను ఎగురవేసిన ప్రధాని మోదీ, త్రివర్ణ పతాకానికి వందనం చేశారు. అనంతరం, జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.

ఎర్రకోటకు చేరుకున్న ప్రధాన మంత్రికి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్, ఆ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ స్వాగతం పలికారు.

స్వాతంత్య్ర దినోత్సవం, స్వాతంత్య్ర వేడుకలు, నరేంద్ర మోదీ, దిల్లీ, ఎర్రకోట

ఫొటో సోర్స్, ANI

అంతకుముందు, ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఉదయం రాజ్‌ఘాట్‌కు చేరుకుని జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులర్పించారు.

మహాత్మాగాంధీ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు.

స్వాతంత్య్ర దినోత్సవం, స్వాతంత్య్ర వేడుకలు, నరేంద్ర మోదీ, దిల్లీ, ఎర్రకోట

ఫొటో సోర్స్, ANI

రాజ్‌ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటకు చేరుకున్నారు.

స్వాతంత్య్ర దినోత్సవం, స్వాతంత్య్ర వేడుకలు, నరేంద్ర మోదీ, దిల్లీ, ఎర్రకోట

ఫొటో సోర్స్, ANI

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా, ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఉదయం సోషల్ మీడియా ద్వారా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

"స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఈ జాతీయ పండుగ మాతృభూమి పట్ల సైనికుల అద్భుతమైన ధైర్యాన్ని, అవిశ్రాంత పోరాటాన్ని, సాటిలేని అంకితభావాన్ని గుర్తుచేస్తుంది. వారి ఆదర్శాలను స్వీకరించి, అభివృద్ధి చెందిన భారత దేశమనే సంకల్పాన్ని సాకారం చేసుకుందాం" అని ప్రధాన మంత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో రాశారు.

(ఈ కథనం అప్డేట్ అవుతోంది)