హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం.. 8 ఫోటోలలో

- రచయిత, ఫోటోలు
- హోదా, నవీన్ కందేరి, సుధా పోలా
- ప్రచురణ
- చదివే సమయం: 2 నిమిషాలు
ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం ముగిసింది. శుక్రవారం ఉదయం సుమారు 9.30 గంటల ప్రాంతంలో ఖైరతాబాద్ నుంచి శోభాయాత్ర మొదలైంది.
అయితే, శుక్రవారం వేకువ నుంచే పెద్ద సంఖ్యలో భక్తుల రాక మొదలైంది.
శోభాయాత్ర మొదలయ్యే సమయానికి ఆ ప్రాంతమంతా భక్తులతో నిండిపోయింది.

ఫొటో సోర్స్, I&PRTelangana
నగరానికి చెందినవారే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా పెద్దసంఖ్యలో భక్తులు ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు.
వివిధ వేషధారణలో, డప్పులతో సందడి చేస్తూ కనిపించారు.

ఖైరతాబాద్‌లో మొదలైన ఈ శోభాయాత్ర టెలిఫోన్ భవన్, తెలంగాణ తల్లి చౌరస్తా మీదుగా సాగింది.
మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో భారీ క్రేన్ల సహాయంతో హుస్సేన్‌సాగర్‌లో ఖైరతాబాద్ గణేశుడిని నిమజ్జనం చేశారు.


ఫొటో సోర్స్, I&PRTelangana
నిమజ్జనం నేపథ్యంలో పోలీసులు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు.
ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.



(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



























