హైదరాబాద్: 1000 మందితో సెక్స్ చాటింగ్.. 82 మంది న్యూడ్ వీడియోలు, ఫోటోలు సేకరించిన ‘మహిళ’.. కానీ 'ఆమె' చివరికి 'అతడు' అని ఎలా తెలిసింది?

ఫొటో సోర్స్, Getty Images
డాక్టర్లు, పోలీసులు, వ్యాపారులు, ప్రభుత్వ అధికారులు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, లెక్చరర్లు.. వీరంతా ఏంటని అనుకుంటున్నారా!
అమ్మాయిల ఫొటోలతో నకిలీ సోషల్ మీడియా ఖాతాలు తెరిచి ఇలాంటి వృత్తులలో ఉన్న 1000 మందిని 23 ఏళ్ల పవన్ కుమార్ అనే యువకుడు హనీట్రాప్ చేసినట్లు చెప్పారు హైదరాబాద్ పోలీసులు.
''నాలుగేళ్లుగా కోల్‌కతాకు చెందిన ఓ మోడల్ సహా పలువురు అమ్మాయిల ఫొటోలు వాడుకుంటూ హానీట్రాప్ చేసి డబ్బులు వసూలు చేశాడు. ఆయన చేతిలో మోసపోయిన వారిలో వివిధ రాష్ట్రాలతోపాటు వేరే దేశాలలో ఉంటున్నవారూ ఉన్నారు'' అని చార్మినార్ డీసీపీ కిరణ్ ఖరే చెప్పారు.
పవన్ నుంచి మూడు మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్, 16 జీబీ పెన్ డ్రైవ్ స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

'అమ్మాయిల ఫొటోలతో నకిలీ ఖాతాలు'
కొండాబత్తుల పవన్ కుమార్‌ది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం.
హైదరాబాద్ బాలానగర్‌లోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐటీడీ)లో డిప్లొమో రెండో సంవత్సరంలోనే చదువు మానేసినట్లు పోలీసులు గుర్తించారు.
తర్వాత మల్లారెడ్డి కాలేజీలో బీటెక్ చదువుతున్నట్లు ఇంట్లో చెప్పి హైదరాబాద్‌లో ఉంటూ చిన్నాచితకా ఉద్యోగాలు చేస్తూ వచ్చాడని, ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడని డీసీపీ చెప్పారు.
''అమ్మాయిల ఫొటో వాడుకుని ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో నకిలీ ఖాతాలు తెరుస్తాడు. వాటి ద్వారా ఫ్రెండ్ లేదా ఫాలో రిక్వెస్టులు పెట్టి.. వారితో అమ్మాయిలా చాటింగ్ మొదలు పెడతాడు. క్రమంగా సెక్సువల్ చాట్స్ వైపు మళ్లించి యూజర్ల నుంచి నగ్న ఫొటోలు వీడియోలు సేకరించి సేవ్ చేసుకుంటున్నాడు'' అని వివరించారు.
తనపై అనుమానం రాకుండా కొందరు మోడళ్ల అర్ధ నగ్న ఫొటోలు తీసుకుని పవన్ పెట్టేవాడని పోలీసులు తెలిపారు.

ఫొటో సోర్స్, HyderabadPolice
బాధితుల్లో 22 నుంచి 70 ఏళ్ల వయసు వరకు
నగ్న వీడియోలు, ఫొటోలు సేకరించిన తర్వాత పవన్ డబ్బులు వసూలు చేసే పని మొదలుపెడతాడని చెప్పారు పోలీసులు.
''అప్పటివరకు చాటింగ్ చేసిన అమ్మాయికి అన్నయ్యగా పవన్ తనను పరిచయం చేసుకుంటాడు. నగ్న వీడియోలు, ఫొటోలు పంపిన వారితో కాల్స్, వాట్సాప్, సోషల్ మీడియా ఖాతాల ద్వారా మాట్లాడి తన చెల్లెలు ఆత్మహత్య చేసుకుందనో లేదా పోలీసులకు ఫిర్యాదు చేస్తాననో బెదిరించి డబ్బులు వసూలు చేస్తాడు'' అని డీసీపీ వివరించారు.
పవన్ దీని కోసం కోల్‌కతాకు చెందిన ఓ మోడల్ ఫొటోలు ఎక్కువగా వినియోగించారని, ఆమెను సంప్రదించి దీనిపై అప్రమత్తం చేశామని కిరణ్ ఖరే చెప్పారు.
పోలీసులు, లెక్చరర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, డాక్టర్లు తదితర వృత్తుల్లో ఉన్న సుమారు 1000 మందితో పవన్ సెక్స్ చాట్ చేసి ట్రాప్ చేసినట్లు గుర్తించామని చెప్పారు పోలీసులు.
''వీరిలో 22 నుంచి 70 ఏళ్ల వయసు ఉన్న వారున్నారు. 82 మందికి సంబంధించిన న్యూడ్ ఫొటోలు, వీడియోలు ఉన్నాయి'' అని కిరణ్ ఖరే వివరించారు.
బాధితుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, పంజాబ్‌లతో పాటు సౌదీ అరేబియా, తుర్కియే, పాకిస్తాన్, కెనడాలకు చెందిన వారున్నారన్నారు.
వారి నుంచి పవన్ ఇప్పటివరకు రూ.25.16 లక్షలు కాజేసినట్లు గుర్తించామని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
27 నకిలీ ఐడీలు, పేజీలు
13 నకిలీ ఇన్స్టాగ్రామ్ ఐడీలు, 14 నకిలీ ఫేస్బుక్ పేజీలను పవన్ తెరిచినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆయా ఖాతాల నుంచి మెసేజ్‌లు వచ్చి ఉంటే అప్రమత్తంగా ఉండాలని, డబ్బులు మోసపోయినట్లయితే పోలీసులకు వచ్చి ఫిర్యాదు చేయాలని కిరణ్ ఖరే కోరారు.
''1. Priyanka 11243, 2) Aamer 531, 3) K. Chandanasri, 4) K_Chandana_sri_21, 5) Chandana_Princes_2021, 6) Chandana_sri_445, 7) chinnu223558, 8) deekshitha_princes_2021, 9) moon_baby_5973, 10) Kanna_ya1024, 11) Misalgunjan, 12) Kondabathula_Pavan_2324, 13) Kondabathulasadanandam.. ఇవి నకిలీ ఇన్స్టాగ్రామ్ ఐడీలు అని పోలీసులు తెలిపారు.
1. Chandana Angel, 2) K. Chandana Sri, 3) Chandana Sri, 4) Honey kana potti, 5) Ayisha Potti, 6) Chandana Prince. S, 7) Sri K Chandana, 8) A. Keerthi, 9) Chandana K, 10) Dharawath Swati, 11) Vijay Kumar, 12) K. Pawan Shiva, 13) Bhukya Anil, 14) Divya Sri.. ఇవి నకిలీ ఫేస్బుక్ ఖాతాలు అని డీసీపీ వివరించారు.
ఈ ఖాతాల నుంచి మెసేజ్‌లు ఎవరికైనా వచ్చి ఉంటే అప్రమత్తంగా ఉండాలని, డబ్బులు పోగొట్టుకుంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కిరణ్ ఖరే కోరారు.
ఈ మొత్తం వ్యహారంపై పవన్ కుమార్‌తో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది. ఆయన్ను జ్యుడీషియల్ కస్టడీకి తరలించడంతో సంప్రదించలేకపోయాం. పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టినప్పుడు కూడా ఆయన మాట్లాడేందుకు నిరాకరించారు.
పవన్ కుటుంబ సభ్యులను సంప్రదించగా, వారు మాట్లాడేందుకు నిరాకరించారు.

ఫొటో సోర్స్, Getty Images
అసలు ఎలా బయటపడిందంటే..
పవన్ కుమార్ తన స్నేహితుడిని కూడా మోసం చేసి రూ.4 లక్షలు వసూలు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
తనకు జరిగిన మోసంపై ఆ స్నేహితుడు రమేశ్ (పేరు మార్చాం) పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐటీడీ)లో డిప్లొమా చదువుతున్న సందర్భంలో పవన్ కుమార్‌తో తనకు పరిచయమైందని రమేశ్ తెలిపారు.
తనకు 2021 సెప్టెంబరులో 'మూన్ బేబీ 5973'' ఐడీ తో ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చిందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రమేశ్ పేర్కొన్నారు.
''ఈ ఖాతాపై నాకు అనుమానం వచ్చింది. చూస్తే పవన్ కుమార్ క్రియేట్ చేసినట్లు అనిపించింది. వెంటనే అతన్ని అనుమానించడంతో తానే ఫేక్ అకౌంట్ తెరిచినట్లు ఒప్పుకొన్నాడు. ఇక అతనితో స్నేహాన్ని వద్దనుకున్నాను'' అని రమేశ్ చెప్పారు.
తర్వాత వేరే హాస్టల్ తీసుకుని ఉంటున్నప్పటికీ, అక్కడికి వచ్చి తనతో ఉంటానని పవన్ కోరాడని రమేశ్ చెప్పారు.
ఈ క్రమంలో ఇద్దరి మధ్య లైంగిక సంబంధం ఏర్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తనతో లైంగికంగా కలవాలని తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చేవాడని, బ్లాక్ మెయిల్ కూడా చేసేవాడని రమేశ్ తెలిపారు.
ఈ సందర్భంగా వీడియోలు తీసినట్లుగా బెదిరించి, లైంగికంగా కలవాలని ఒత్తిడి చేయడంతోపాటు ఆన్లైన్లో రూ.1.50 లక్షలు, నేరుగా రూ.2.50 లక్షలు తీసుకున్నాడని పవన్‌పై ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు రమేశ్.
దీనిపై సైదాబాద్ పోలీసులు అక్టోబరు 17న కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడంతో హనీ ట్రాప్ కోణం వెలుగులోకి వచ్చింది.
''సోషల్ మీడియాలో ఖాతాల నుంచి ఫ్రెండ్ రిక్వెస్టులు వస్తే ఖాతాను వెరిఫై చేసుకోవాలి. ముఖ్యంగా... తెలియని ఖాతాల నుంచి మెసేజ్‌లు వస్తుంటే అనుమానించాలి. ముందుగా స్నేహంగా మాట్లాడి, తర్వాత న్యూడ్ ఫొటోలు, వీడియోలు సేకరించి మోసాలకు తెరలేపుతారు. బాధితులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి'' అని డీసీపీ కిరణ్ ఖరే సూచించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)































