మన్యం పల్లెల్లో మెడికల్ డ్రోన్స్ సేవలు..
మన్యం పల్లెల్లో మెడికల్ డ్రోన్స్ సేవలు..
ప్రచురణ
అల్లూరి సీతారామరాజు జిల్లా తడక గ్రామానికి చెందిన నవమి ఐదు నెలల గర్భిణి. ఆమె వైద్య పరీక్షల కోసం తరచూ పీహెచ్సీకి వెళ్లాల్సి వస్తోంది. అయితే ఇప్పుడు నవమికి వైద్య పరీక్షలు కొంత సులభమయ్యాయి.
గతంలో రక్త పరీక్ష కోసం అరకు లేదా పాడేరు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు స్థానిక పీహెచ్సీలో రక్త నమూనా ఇస్తే చాలు... అది డ్రోన్‌లో ఎగురుకుంటూ పాడేరుకు చేరుతోంది. ఏపీ ప్రభుత్వం హెల్త్ కేర్ డ్రోన్ హబ్ ద్వారా ఈ సేలను అందిస్తోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









