స్కూలు బస్సుపై అడవి దున్న దాడి

వీడియో క్యాప్షన్, స్కూల్ బస్సుపై అడవి దున్న దాడి
స్కూలు బస్సుపై అడవి దున్న దాడి
ప్రచురణ

కేరళలోని వయనాడ్ జిల్లా, మానంతవాడి సమీపంలో విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సుపై ఒక అడవి దున్న దాడి చేసింది.

ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి.

వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై అటవీ శాఖ దర్యాప్తు చేపట్టింది.

ఈ ఘటన తర్వాత.. ఆ అడవి దున్నను అటవీ శాఖ అధికారులు తిరిగి అడవిలోకి తరిమేసినట్లు కేరళ మీడియా సంస్థ మాతృభూమి రిపోర్ట్ చేసింది.

అయితే, ఈ ప్రాంతంలో వన్యప్రాణులను నియంత్రించడంలో అటవీ శాఖ అధికారులు విఫలమయ్యారంటూ స్థానికులు జిల్లా కలెక్టర్ ఎదుట నిరసన తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)