బ్రిక్స్ సదస్సు విశేషాలు 7 ఫోటోలలో

బ్రిక్స్ దేశాల సదస్సు

ఫొటో సోర్స్, PIB

ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు

న్యూదిల్లీలోని భారత్ మండపంలో ఆదివారం బ్రిక్స్ మొదటి రోజు సదస్సు ప్రారంభమైంది.

సదస్సు మొదటి రోజున వివిధ దేశాల నేతలంతా కలిసి భారత్ మండపంలో ఏర్పాటు చేసిన 'భారత్ ఇన్నోవేట్స్' డీప్-టెక్ ప్రదర్శనను తిలకించారు.

ఆ తర్వాత ప్రపంచ శాంతి, పర్యావరణ పరిరక్షణకు ప్రతీకగా అగ్రనేతలందరూ కలిసి సంయుక్తంగా మొక్కలు నాటారు.

బ్రిక్స్ సదస్సు

ఫొటో సోర్స్, PIB

బ్రిక్స్ సదస్సు

ఫొటో సోర్స్, PIB

ఫొటో క్యాప్షన్, భారత మండప ప్రాంగణంలో మొక్కలు నాటుతున్న రష్యా అధ్యక్షుడు పుతిన్, ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్
బ్రిక్స్ సదస్సు

ఫొటో సోర్స్, PIB

ఫొటో క్యాప్షన్, సదస్సు మొదటి రోజున వివిధ దేశాల నేతలంతా కలిసి భారత్ మండపంలో ఏర్పాటు చేసిన 'భారత్ ఇన్నోవేట్స్' డీప్-టెక్ ప్రదర్శనను తిలకించారు.

ప్రధాని మోదీ విదేశీ అతిథులకు విలాసవంతమైన విందు (గాలా డిన్నర్) ఇచ్చారు.

ఈ సమావేశానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ లతో పాటు బ్రిక్స్ కూటమిలోని 11 సభ్య దేశాల అగ్రనేతలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధులు దిల్లీకి తరలివచ్చారు.

ముఖ్యంగా ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత్‌కు వచ్చారు, ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.

న్యూదిల్లీ, బ్రిక్స్ సమావేశం, షీ జిన్‌పింగ్, నరేంద్రమోదీ, పుతిన్, పెజెష్కియాన్, భారత మండపం

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, బ్రిక్స్ సమావేశ మందిరం
న్యూదిల్లీ, బ్రిక్స్ సమావేశం, షీ జిన్‌పింగ్, నరేంద్రమోదీ, పుతిన్, పెజెష్కియాన్, భారత మండపం

ఫొటో సోర్స్, X/narendramodi

ఫొటో క్యాప్షన్, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ ప్రధాని నరేంద్ర మోదీ మాటామంతి
న్యూదిల్లీ, బ్రిక్స్ సమావేశం, షీ జిన్‌పింగ్, నరేంద్రమోదీ, పుతిన్, పెజెష్కియాన్, భారత మండపం

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, బ్రిక్స్ సదస్సు సందర్భంగా మలేషియా ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ కార్యక్రమానికి ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కూడా హాజరయ్యారు.

బ్రిక్స్ సభ్య దేశాలన్నీ ఏకగ్రీవంగా న్యూదిల్లీ డిక్లరేషన్‌కు ఆమోదం తెలిపాయి. యుద్ధాల కంటే చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని, అభివృద్ధి చెందుతున్న దేశాలకు అంతర్జాతీయంగా మరింత ప్రాధాన్యత ఇవ్వాలని ఈ డిక్లరేషన్‌లో పేర్కొన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)