సొరచేపల నుంచి రక్షణ కోసం అమర్చిన నెట్‌లో చిక్కిన పిల్ల తిమింగలం.. కాపాడిన సహాయక సిబ్బంది

పిల్ల తిమింగలం

ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ తీరంలో సొరచేపల నుంచి రక్షణ కోసం ఉంచిన నెట్‌లో ఓ పిల్ల తిమింగలం చిక్కుకుపోయింది. సహాయ సిబ్బంది రెండు గంటలపాటు ప్రయత్నించి దీనిని కాపాడారు.

ఒకవైపు సహాయ ప్రయత్నాలు జరుగుతుండగా, దగ్గర్లో రెండు పెద్ద తిమింగలాలు పిల్ల తిమింగలం కోసం వేచిచూస్తూ ఉండిపోయాయి. వీటిలో ఒకటి పిల్ల తిమింగలం తల్లి అయ్యుండొచ్చని భావిస్తున్నారు. ఎట్టకేలకు పిల్ల తిమింగలాన్ని కాపాడగలిగారు. స్వల్ప గాయాలైన పిల్ల తిమింగలం తర్వాత ఈదుకుంటూ వెళ్లిపోయింది.

వీడియో క్యాప్షన్, సొరచేప నుంచి రక్షణకు ఉంచిన నెట్‌లో చిక్కుకున్న పిల్ల తిమింగలం.. కాపాడిన సహాయకులు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)