వెనెజ్వెలా: భూకంపం మిగిల్చిన విషాదం, 11 ఫోటోల్లో..

భూకంపం, వెనెజ్వెలా, కొలంబియా, కారకస్

ఫొటో సోర్స్, Reuters

ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు

సెకన్ల వ్యవధిలోనే రెండు భారీ భూకంపాలు సంభవించడంతో వెనెజ్వెలా వణికిపోయింది. 32 మంది చనిపోయారని, 700 మంది గాయపడ్డారని వెనెజ్వెలా అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ అధికారికంగా ప్రకటించారు.

భూకంపం, వెనెజ్వెలా, కొలంబియా, కారకస్

ఫొటో సోర్స్, Getty Images

భూకంపం తీవ్రతకు కుప్పకూలిన బాంకారిబే బ్యాంక్ భవనం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
భూకంపం, వెనెజ్వెలా, కొలంబియా, కారకస్

ఫొటో సోర్స్, Reuters

వెనెజ్వెలాలో రెండు భూకంపాలు సంభవించిన తర్వాత 20కిపైగా ప్రకంపనలు వచ్చాయని అధ్యక్షుడి కార్యాలయాన్ని ఉటంకిస్తూ న్యూస్ ఏజెన్సీ ఏఎఫ్‌పీ తెలిపింది.

దేశం ఉత్తర తీరప్రాంతాల్లోని లాగ్వైరా, అరాగ్వా, కారాబోబో, ఫాల్కోన్ ప్రాంతాలు అత్యంత తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

భూకంపం, వెనెజ్వెలా, కొలంబియా, కారకస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, శాన్ బెర్నార్డినో ప్రాంతంలో కూలిపోయిన భవనం శిథిలాల దగ్గర సహాయక సిబ్బంది గాలింపు.

కుప్పకూలిన భవనం దగ్గర అత్యవసర బృందాల సహాయక చర్యలు నిర్వహిస్తున్నాయి.

బహుళ అంతస్థుల భవనాలు కూలిపోవడంతో శిథిలాల కింద చిక్కుకుపోయినవారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

మృతుల సంఖ్య పది వేలకు పైగా ఉండే అవకాశం 44 శాతం ఉందని, లక్షమందికిపైగా చనిపోయి ఉండే అవకాశం 30 శాతం ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.

భూకంపం, వెనెజ్వెలా, కొలంబియా, కారకస్

ఫొటో సోర్స్, Reuters

భూకంపం తర్వాత కారకస్‌లో పిల్లలను తీసుకుని నడిచి వెళ్తున్న మహిళ. శిథిలాల కింద అనేక మంది చిక్కుకుపోయారు. సురక్షితంగా బయటపడ్డవారు, తమవారి ఆచూకీ కోసం ఆందోళన చెందుతున్నారు.

భూకంపం, వెనెజ్వెలా, కొలంబియా, కారకస్

ఫొటో సోర్స్, Getty Images

అల్టామిరాలో కూలిపోయిన భవనాన్ని స్థానికులు పరిశీలిస్తున్నారు.

భూకంపాలు తరచుగా సంభవించే ప్రాంతంలో వెనెజ్వెలా ఉంది. కరేబియన్, దక్షిణ అమెరికా టెక్టానిక్ ప్లేట్లు కలిసే చోటు వెనెజ్వెలా.

భూకంపం, వెనెజ్వెలా, కొలంబియా, కారకస్

ఫొటో సోర్స్, EPA/Shutterstock

కారకస్‌లో భవనాలు ఖాళీచేసిన తర్వాత వీధుల్లో నిరీక్షిస్తున్న జనం.

భూకంపం, వెనెజ్వెలా, కొలంబియా, కారకస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భూకంపం శిథిలాల మధ్య ధ్వంసమైన వాహనం.

మొదట భూకంపం తీవ్రత 7.2కాగా రెండో భూకంపం అంతకన్నా ఎక్కువగా 7.5 తీవ్రతతో సంభవించింది.

భూకంపం, వెనెజ్వెలా, కొలంబియా, కారకస్

ఫొటో సోర్స్, EPA

భూకంపం సమయంలో బయటకు వచ్చిన ప్రజలు తిరిగి తమ ఇళ్లలోకి వెళ్లాలంటే భయపడుతున్నారు.

భూకంపం, వెనెజ్వెలా, కొలంబియా, కారకస్

ఫొటో సోర్స్, EPA

భూకంపం తీవ్రతకు ఓ దుకాణంలో చెల్లా చెదురైన సరుకులు. 1967తో పోలిస్తే ఇవి మరింత తీవ్రమైన భూకంపాలని, ఇలాంటి వాటిని గతంలో ఎప్పుడూ చూడలేదని వెనెజ్వెలాలో 60ఏళ్లు పైబడిన వారు చెబుతున్నారు.

భూకంపం, వెనెజ్వెలా, కొలంబియా, కారకస్

ఫొటో సోర్స్, Getty Images

వరుస భూప్రకంపనల తర్వాత వెనెజ్వెలాలో అత్యవసర స్థితి ప్రకటించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)