ప్రభాస్‌ను కలిసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

వీడియో క్యాప్షన్, కిషన్ రెడ్డి, ప్రభాస్
ప్రభాస్‌ను కలిసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ప్రచురణ

'హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్' కార్యక్రమంలో పాల్గొనాలని సినీనటుడు ప్రభాస్‌ను ఆహ్వనించినట్లు కేంద్రమంత్రి కిషన్ ‌రెడ్డి ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

"మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటంలో మనమందరం ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు హైదరాబాద్‌లో ప్రముఖ నటులు శ్రీ ప్రభాస్ గారిని కలిసి, 'హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్' కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఉద్యమానికి ఆయన అందించే మద్దతు లక్షలాది మంది అభిమానులను, ముఖ్యంగా యువతను మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా నిలబడేలా ప్రేరేపిస్తుంది" అని కిషన్ రెడ్డి తన పోస్టు‌లో రాశారు.

ఈ సందర్భంగా ప్రభాస్‌కు వాకథాన్ అధికారిక టీ-షర్టును అందజేశారు.

నరేంద్ర మోదీ 'వికసిత్ భారత్ కోసం నషా ముక్త్ యువ' సంకల్పం నుంచి స్ఫూర్తి పొంది, ఆరోగ్యకరమైన, డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రజలందరినీ ఏకం చేయాలని కిషన్ రెడ్డి కోరారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)