జపాన్‌లో 7.1 తీవ్రతతో భూకంపం, విధ్వంసాన్ని చూపే 9 ఫోటోలు...
ఫొటో సోర్స్, Reuters
ఫొటో క్యాప్షన్, జపాన్ దక్షిణ ప్రాంతమైన కుమామోటో ప్రిఫెక్చర్‌లోని యాత్సుషిరోలో భూకంపం వల్ల దెబ్బతిన్న క్యుషు ఎక్స్‌ప్రెస్‌వే ఏరియల్ వ్యూ చిత్రం.
ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు
దక్షిణ జపాన్‌లో మంగళవారం 7.1 తీవ్రతతో ఏర్పడిన భూకంపం ప్రజలను ఆందోళనలో పడేసింది. అధికారుల సమాచారం ప్రకారం, భూకంపం ధాటికి కుమామోటోలోని ఒక షాపింగ్ మాల్‌లో పలువురు ప్రజలు చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో చాలామంది గాయపడినట్లు రిపోర్టులు చెబుతున్నాయి.
స్థానిక మీడియా కథనాల ప్రకారం.. భూకంపం సంభవించిన తర్వాత కుమామోటోలోని 'అయాన్ మాల్' లో పేలుడు సంభవించింది. అయితే, ఈ పేలుడుకు గల కారణాలు, జరిగిన నష్టానికి సంబంధించిన అధికారిక వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 4:27 గంటలకు జపాన్‌లోని క్యుషు ద్వీపకల్ప అంతర్భాగంలో ఈ భూకంపం సంభవించింది. భూ ప్రకంపనల అనంతరం సునామీ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, దాదాపు గంట వ్యవధిలోనే వాటిని ఉపసంహరించుకున్నారు.
ఫొటో సోర్స్, Reuters
ఫొటో క్యాప్షన్, కుమామోటో ప్రిఫెక్చర్‌లోని యాత్సుషిరోలో భూకంపం ధాటికి తగలబడుతున్న భవనం (ఏరియల్ వ్యూ).
ఫొటో క్యాప్షన్, భూకంపం ధాటికి కుమామోటో ప్రిఫెక్చర్‌లో రైలు పట్టాలు తప్పింది.
ఫొటో సోర్స్, AFP via Getty Images
ఫొటో క్యాప్షన్, కుమామోటో సిటీలో సంభవించిన భూకంపం కారణంగా ఒక దుకాణం వెలుపలి గోడ కూలిపోయిన దృశ్యం.
ఫొటో సోర్స్, Reuters
ఫొటో క్యాప్షన్, జపాన్ దక్షిణ ప్రాంతమైన కుమామోటో ప్రిఫెక్చర్‌లోని యాత్సుషిరోలో భూకంపం కారణంగా కూలిపోయిన ఒక వంతెన (బ్రిడ్జ్) ఏరియల్ వ్యూ .
ఫొటో సోర్స్, AFP via Getty Images
ఫొటో క్యాప్షన్, జపాన్ రక్షణ శాఖ విడుదల చేసిన స్క్రీన్‌గ్రాబ్ ఆధారంగా జిజీ ప్రెస్ వార్తా సంస్థ అందించిన చిత్రం. కుమామోటో ప్రిఫెక్చర్‌లోని ఉకి నగరంలో భూకంపం సంభవించిన తర్వాత ఒక భవనం నుంచి పొగలు వస్తున్న దృశ్యం ఇందులో కనిపిస్తోంది.
ఫొటో సోర్స్, Reuters
ఫొటో క్యాప్షన్, జపాన్‌లో భూకంపం సంభవించిన తర్వాత కుమామోటోలోని 'అయాన్ మాల్' లో పేలుడు సంభవించినట్లు రిపోర్టులు చెబుతున్నాయి.
ఫొటో సోర్స్, Reuters
ఫొటో క్యాప్షన్, కుమామోటో నగరంలో భూకంపం ధాటికి కూలిన కుమామోటో కోట ప్రహరీ రాతి గోడ.