ఒకే కాన్పులో ఒకేలా ఉన్న నలుగురు శిశువుల జననం

ఫొటో సోర్స్, Metro North Health
- రచయిత, అమీ వాకర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
ఆస్ట్రేలియా మహిళ ఒకరు ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చారు. వారంతా ఒకేలా ఉన్నారు.
ఆమె ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు వైద్యులు.. ‘ఎక్స్ట్రీమ్లీ హై రిస్’ అని పేర్కొన్నారు. రాయల్ బ్రిస్బేన్ అండ్ ఉమెన్స్ హాస్పిటల్లో ఆమె ప్రసవించారు.
ఈ నలుగురు శిశువులు జులై 14 జన్మించారు. 28 వారాల 4 రోజుల గర్భం తర్వాత నలుగురు అమ్మాయిలు పుట్టారు.
వీళ్లను మోనోజైగోటిక్ క్వాడ్రప్లెట్స్గా చెబుతున్నారు. అంటే ఫలదీకరణ చెందిన ఒకే అండం నాలుగు పిండాలుగా విడిపోవడం.
కాగా ఈ నలుగురు చిన్నారుల తల్లి 34 ఏళ్ల జెనితార్ నామోనా, ఆమె భర్త జోర్థమ్లకు ఇప్పటికే మరో నలుగురు పిల్లలు ఉన్నారు. ఒకేసారి నలుగురు పుట్టబోతున్నారని ఈ దంపతులకు చెప్పినప్పుడు వాళ్లు "తీవ్ర ఆశ్చర్యానికి" లోనయ్యారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

"ప్రతి కోటిన్నర మందిలో ఒకరికి" ఇలా ఒకేలా ఉండే నలుగురు శిశువులు ఒకేసారి జన్మిస్తారని గర్భం దాల్చినప్పటి నుంచి ఆ తల్లికి సంరక్షణ అందించిన డాక్టర్ అలెక్సా బెండాల్ చెప్పారు
"అయితే ఒకే ప్లసెంటాను పంచుకోవడం గతంలో ఎన్నడూ వినని విషయం" అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Jenitar Na’amoana/Gofundme
నలుగురు నవజాత ఆడపిల్లల్లో ముగ్గురికి ఎమిలీ, హ్యారియెట్, కేథరీన్ అని పేర్లు పెట్టారు. ఒక శిశువుకు మాత్రం డాక్టర్ అలెక్సా బెండాల్కు గుర్తుగా అలెక్సా అని పేరు పెట్టారు. ఇది "అందమైన జ్ఞాపకం" అని అలెక్సా బెండాల్ చెప్పారు.
శిశువులు బాగా ఎదికే వరకు ఆసుపత్రిలోని నియో నేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంటారని, ప్రస్తుతం వాళ్లు చాలా ఆరోగ్యంగా ఉన్నారని బెండాల్ తెలిపారు.
నామోనా, జోర్థామ్ దంపతుల మిగతా నలుగురు పిల్లుల వయసు ఏడాది నుంచి 10 ఏళ్ల లోపు ఉంటుంది.

ఫొటో సోర్స్, Metro North Health
తమ కుటుంబం ప్రయాణించడానికి పది సీట్లున్న వ్యాన్ కొనడంలో సాయం చేయాలని కోరుతూ నామోనా ఆన్లైన్ ద్వారా నిధుల సేకరణ ప్రచారం చేస్తున్నారు.
ఇప్పటికే ఈ జంట దాదాపు రూ. 25 లక్షలు అందుకుంది. "మా నాలుగు అమూల్య రత్నాలు సురక్షితంగా భూమిపైకి వచ్చాయి. మా హృదయాలు కృతజ్ఞతతో పొంగిపోతున్నప్పటికీ, ఒకేసారి నలుగురు నవజాత శిశువులను చూసుకోవాల్సిన వాస్తవం మేం ఎన్నడూ ఊహించని సవాళ్లను తెచ్చిపెట్టింది" అని నామోనా ఒక సందేశంలో రాశారు.
సహజంగా నలుగురు శిశువులు జన్మించడం అత్యంత అరుదు. ప్రతి 7 లక్షల జననాలలో ఒకరికి ఇలా జరిగే అవకాశం ఉందని వైద్యుల అంచనా.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
































