You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘‘సీ జోసెఫ్ విజయ్ అనే నేను’’: తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణం
తమిళగ వెట్రి కళగం అధినేత, సినీ హీరో జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
ఆదివారం (మే 10వ తేదీ) ఉదయం 10 గంటలకు చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆయనతో పాటు తొమ్మిదిమంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.
విజయ్‌తో, మంత్రులతోనూ తమిళనాడు తాత్కాలిక గవర్నర్ అర్లేకర్ ప్రమాణ స్వీకారం చేయించారు.
మే 13లోగా శాసనసభలో బలాన్ని నిరూపించుకోవాల్సిందిగా విజయ్‌ను గవర్నర్ కోరినట్టు లోక్‌భవన్ విడుదల చేసిన ప్రకటనలో ఉంది.
లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. వేదికపై రాహుల్ గాంధీ, విజయ్ పక్కపక్కనే కూర్చున్నారు.
మహిళ సహా 9మంది మంత్రులు
విజయ్ తొలి క్యాబినెట్‌లో ఓ మహిళకు చోటు దక్కింది. విజయ్‌తో పాటు టీవీకే ప్రధాన కార్యదర్శి . ఎన్ ఆనంద్, ఎన్నికల ప్రచార నిర్వహణ ప్రధాన కార్యదర్శి అధవ్ అర్జున, కె.జి.అరుణ్‌రాజ్, కె.ఎ సెంగొట్టయన్, పి. వెంకటరమణన్, ఆర్. నిర్మల్ కుమార్, రాజ్‌మోహన్, టి.కె. ప్రభు, ఎస్. కీర్తన మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
పలువురు ప్రముఖులు హాజరు
విజయ్ ప్రమాణస్వీకారోత్సవానికి కుటుంబ సభ్యులతో పాటు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. సినీ నటి త్రిష, సంగీత, తమిళ హీరో జై , తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ నాయకురాలు తమిళిసైతో పాటు పలువురు హాజరయ్యారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)