‘‘సీ జోసెఫ్ విజయ్ అనే నేను’’: తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణం

విజయ్

ఫొటో సోర్స్, Screenshot

ఫొటో క్యాప్షన్, విజయ్‌తో ప్రమాణస్వీకారం చేయిస్తున్న గవర్నర్
చదివే సమయం: 2 నిమిషాలు

తమిళగ వెట్రి కళగం అధినేత, సినీ హీరో జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

ఆదివారం (మే 10వ తేదీ) ఉదయం 10 గంటలకు చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆయనతో పాటు తొమ్మిదిమంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.

విజయ్‌తో, మంత్రులతోనూ తమిళనాడు తాత్కాలిక గవర్నర్ అర్లేకర్ ప్రమాణ స్వీకారం చేయించారు.

మే 13లోగా శాసనసభలో బలాన్ని నిరూపించుకోవాల్సిందిగా విజయ్‌ను గవర్నర్ కోరినట్టు లోక్‌భవన్ విడుదల చేసిన ప్రకటనలో ఉంది.

లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. వేదికపై రాహుల్ గాంధీ, విజయ్ పక్కపక్కనే కూర్చున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
తమిళనాడు, విజయ్, టీవీకే, గవర్నర్

ఫొటో సోర్స్, LOKBHAVAN

ఫొటో క్యాప్షన్, మంత్రుల జాబితా
కీర్తన

ఫొటో సోర్స్, Screenshot

ఫొటో క్యాప్షన్, విజయ్ మంత్రి మండలిలో మహిళా మంత్రి కీర్తన

మహిళ సహా 9మంది మంత్రులు

విజయ్ తొలి క్యాబినెట్‌లో ఓ మహిళకు చోటు దక్కింది. విజయ్‌తో పాటు టీవీకే ప్రధాన కార్యదర్శి . ఎన్ ఆనంద్, ఎన్నికల ప్రచార నిర్వహణ ప్రధాన కార్యదర్శి అధవ్ అర్జున, కె.జి.అరుణ్‌రాజ్, కె.ఎ సెంగొట్టయన్, పి. వెంకటరమణన్, ఆర్. నిర్మల్ కుమార్, రాజ్‌మోహన్, టి.కె. ప్రభు, ఎస్. కీర్తన మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

తమిళనాడు, విజయ్, టీవీకే, గవర్నర్

ఫొటో సోర్స్, ANI

పలువురు ప్రముఖులు హాజరు

విజయ్ ప్రమాణస్వీకారోత్సవానికి కుటుంబ సభ్యులతో పాటు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. సినీ నటి త్రిష, సంగీత, తమిళ హీరో జై , తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ నాయకురాలు తమిళిసైతో పాటు పలువురు హాజరయ్యారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)