రాహుల్ గాంధీని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ‘అన్నీ గుర్తుంచుకుంటాం’ అంటూ కాంగ్రెస్ సోషల్ మీడియా పోస్ట్

కాంగ్రెస్‌, విపక్ష పార్టీలు దిల్లీలో మార్చ్, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్, రాహుల్ గాంధీ అరెస్ట్
ప్రచురణ
చదివే సమయం: 4 నిమిషాలు

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ దిల్లీలోని ఆకాశవాణి భవన్‌లో నిరసన ప్రదర్శన చేస్తున్న లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీలను పోలీసులు అక్కడి నుంచి తరలించారు.

రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకుని కింగ్స్‌వే క్యాంప్‌కు తరలించారని ఘటనా స్థలంలో ఉన్న బీబీసీ విలేకరి దిల్‌నవాజ్ పాషా తెలిపారు.

రాహుల్ గాంధీని పోలీసులు బలవంతంగా తీసుకువెళ్తున్న వీడియోను కాంగ్రెస్ పార్టీ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది.

ఆ పోస్ట్‌లో ‘ప్రతిదీ గుర్తుంచుకుంటాం’ అని రాసింది.

రాహుల్ గాంధీ అరెస్ట్, దిల్లీ

అదుపులోకి తీసుకోవడానికి ముందు ఏం జరిగింది?

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు మంగళవారం దిల్లీలో మార్చ్ చేశాయి.

పార్లమెంటు నుంచి ఎలక్షన్ కమిషన్ ప్రధాన కార్యాలయం వైపు ఇండియా కూటమి ఎంపీలు మార్చ్ నిర్వహించారు.

ఈ మార్చ్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీతో పాటు పలువురు విపక్ష ఎంపీలు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌, విపక్ష పార్టీలు దిల్లీలో మార్చ్, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్, రాహుల్ గాంధీ
ఫొటో క్యాప్షన్, రాహుల్ గాంధీ
కాంగ్రెస్‌, విపక్ష పార్టీలు దిల్లీలో మార్చ్, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్, రాహుల్ గాంధీ
ఫొటో క్యాప్షన్, అఖిలేశ్ యాదవ్

మార్చ్ నేపథ్యంలో పార్లమెంటు, సంసద్ మార్గ్, ఆకాశవాణి భవన్, ఎలక్షన్ కమిషన్ ప్రధాన కార్యాలయం పరిసరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

కాంగ్రెస్‌, విపక్ష పార్టీలు దిల్లీలో మార్చ్, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్, రాహుల్ గాంధీ

మార్చ్ జరిగే ప్రాంతాలలో పలు చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను కూడా మోహరించారు.

కాంగ్రెస్‌, విపక్ష పార్టీలు దిల్లీలో మార్చ్, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్, మహువా మొయిత్రా
ఫొటో క్యాప్షన్, మహువా మొయిత్ర
విపక్ష పార్టీలు, దిల్లీలో మార్చ్, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్
ఫొటో క్యాప్షన్, సాగరిక ఘోష్

మార్చ్ చేస్తున్న విపక్ష ఎంపీలను పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

అనంతరం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సెప్టెంబర్ 30న 19 విపక్ష పార్టీలు నిర్వహించిన సమావేశం తర్వాత ఈ నిరసన చేపట్టాలని నిర్ణయించారు.

కాంగ్రెస్‌, విపక్ష పార్టీలు దిల్లీలో మార్చ్, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్
ఫొటో క్యాప్షన్, బైఠాయించిన నాయకులు
కాంగ్రెస్‌, విపక్ష పార్టీలు దిల్లీలో మార్చ్, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్.
ఫొటో క్యాప్షన్, పోలీసులు
కాంగ్రెస్‌, విపక్ష పార్టీలు దిల్లీలో మార్చ్, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్.
ఫొటో క్యాప్షన్, మల్లికార్జున ఖర్గే

"కాంగ్రెస్ పార్టీ చేస్తున్న 3 డిమాండ్లపై రాజీ పడే ప్రసక్తే లేదు. అందులో మొదటిది జ్ఞానేష్ కుమార్ రాజీనామా, రెండవది ఎస్ఐఆర్ రద్దు, మూడవది బ్యాలెట్ పేపర్ విధానంలో ఎన్నికల నిర్వహణ" అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే 'ఎక్స్' వేదికగా తెలిపారు.

కాంగ్రెస్‌, విపక్ష పార్టీలు దిల్లీలో మార్చ్, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్, రాహుల్ గాంధీ
ఫొటో క్యాప్షన్, డెరెక్ ఓబ్రియెన్, రాహుల్ గాంధీ, ప్రియాంక
కాంగ్రెస్‌, విపక్ష పార్టీలు దిల్లీలో మార్చ్, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్, సీపీఐ
ఫొటో క్యాప్షన్, ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలుపుతున్న నాయకులు

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)