అమెరికా-ఇరాన్ యుద్ధంలోకి నందమూరి బాలకృష్ణ, ప్రభాస్ ఎలా వచ్చారు?

భగవంత్ కేసరి సినిమాలో సన్నివేశం
ఫొటో క్యాప్షన్, భగవంత్ కేసరి సినిమాలో నందమూరి బాలకృష్ణ
    • రచయిత, కొటేరు శ్రావణి
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

'అమ్మ దాహం తీర్చడానికి మూగ జంతువు ప్రాణం ఎందుకు.. ఉరకలేస్తోన్న నా రక్తం సిద్ధంగా ఉంది.. జై మాహిష్మతి'..,

'శుక్లా జీ మార్కెట్లో మన నుంచి సౌండ్ కాస్త ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తారు..'

‘బ్రో ఐ డోంట్ కేర్!’ అనే డైలాగులు ఎక్కడో విన్నంట్లుంది కదా.. ఇవి మన తెలుగు సినిమాలోనివే.

ఇప్పుడీ డైలాగ్స్ అమెరికా-ఇరాన్ మధ్య వార్‌లో ట్రెండింగ్‌గా మారాయి.

హైదరాబాద్‌లో ఉన్న ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ కాన్సులేట్ జనరల్ తాజాగా సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఒక పోస్టు చేసింది. ఆ పోస్టుకు ఎక్స్‌లో విపరీతమైన స్పందన వచ్చింది.

అదే బాహుబలిలోనే జై మాహిష్మతి డైలాగ్.. ఈ వీడియో క్లిప్‌లో తనను తాను ఇరాన్ బాహుబలిగా వర్ణించుకోగా... అమెరికా సైన్యాన్ని మాత్రం కాలకేయులుగా అభివర్ణించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

'' మేం ఎవ్వరికీ తలవంచమని మా అధ్యక్షుడు పెజెష్కియాన్ ఐరాస సమావేశంలో స్పష్టం చేశారు. కాలకేయ ఆర్మీకి బాహుబలి ఎదురొడ్డి నిలబడినట్లు.. మా మాతృదేశం కోసం మా సొంత రక్తానైనా చిందిస్తాం'' అంటూ హైదరాబాద్‌లోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ పోస్టు చేసింది.

దీంతో పాటు, హార్ముజ్ జలసంధిలో ఇరాన్ ఐఆర్‌జీసీ నేవీ అమెరికాకు చెందిన రెమస్ 600 అన్‌మాన్డ్ అండర్‌వాటర్ వెహికిల్‌ను స్వాధీనం చేసుకుందని, దీనిపై ట్రంప్, హెగ్‌సేథ్, సెంట్‌కామ్ రియాక్షన్ల అంటూ మరో ట్వీట్ చేసింది.

దీనికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ నటించిన హిందీ వర్షన్‌లోని భగవంత్ కేసరి డైలాగ్‌ను వాడింది. ‘బ్రో ఐ డౌంట్ కేర్’.. అనే బాలకృష్ణ డైలాగ్ జత చేసింది.

దీనికి సరిగ్గా నాలుగు రోజుల ముందు.. జింబాబ్వేలోని ఇరాన్ ఎంబసీ కూడా ఇదే మాదిరి ఒక ట్వీట్ చేసింది.

అక్కడ కూడా బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి పవర్‌ఫుల్ యాక్షన్ సీన్‌నే వాడింది. ఈ యాక్షన్ సీన్‌తో డోనల్డ్ ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్ ఇచ్చింది. అయితే, ఆ సినిమాను బాలీవుడ్‌ మూవీగా పేర్కొంది.

బాహుబలి సినిమా

''ఇరాన్‌ను నాశనం చేస్తామని ట్రంప్ మాట్లాడుతున్నారు. కానీ, ఇరాన్ బలహీనమైనది కాదని ఆయనకు తెలుసు. హాలీవుడ్‌కి బదులుగా వారు బాలీవుడ్ చూస్తున్నారని మాకు ఇటీవల తెలిసినప్పటి నుంచి ఆయన ఇలాగే మాట్లాడుతున్నారు'' అంటూ జింబాబ్వేలోని ఇరాన్ ఎంబసీ ట్వీట్ చేసింది.

భగవంత్ కేసరిలోని యాక్షన్ వీడియోను వాడుతూ ఈ పోస్టు చేసింది.

జింబాబ్వేలోని ఇరాన్ ఎంబసీ చేసిన ట్వీట్‌పై హైదరాబాద్‌లో రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ కాన్సులేట్ జనరల్ స్పందించింది.

ఆ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ.. ''భగవంత్ కేసరి తుపాకీ గుళ్లు లేని శత్రువులపై పోరాడుతున్నాడు. ట్రంప్‌లాగా బెదిరింపులకు దిగడు'' అని పేర్కొంది.

‘‘తెలుగు సినిమాలు ‘గోట్’.. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్'' అని రాసింది.

జింబాబ్వేలోని ఇరాన్ ఎంబసీ, హైదరాబాద్‌లోని రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ కాన్సులేట్ జనరల్ చేసిన పోస్టులపై సామాజిక మాధ్యమం ఎక్స్‌లో అనూహ్య స్పందన వస్తోంది.

''ప్లేయర్ – ఇరాన్, ఎనిమీ – యూఎస్, ప్లేగ్రౌండ్ -జింబాబ్వే ఎంబసీ, గేమ్ యూజ్డ్ – సౌత్ ఇండియన్ మూవీ యాక్షన్ సీన్, లాంగ్వేజ్ – హిందీ'' అంటూ ఇరాన్‌ను పొగుడుతూ ఒక యూజర్ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

అలాగే.. వారు కేవలం మైదానంలోనే అమెరికాను గెలవడం లేదు, ఇంటర్నెట్‌లో కూడా అధిగమిస్తున్నారు. ఇరానియన్ విక్టర్ 100 శాతం అంటూ ఒక యూజర్లు ట్వీట్ చేశారు.

మరో యూజర్ ‘‘ఇరానియన్ సోషల్ మీడియాలో హాస్యం ప్రత్యేకమైన స్థాయిలో ఉంది. ఈ పోస్ట్‌ల వెనుక ఉన్న బృందానికి అభినందనలు. ఇరాన్ మరింత బలోపేతం కావాలి’’ అని మరొక యూజర్ సోషల్ మీడియాలో రాశారు.

''ఒక దేశంతో యుద్ధం జరుగుతూ మీ అధ్యక్షుడు ఆ దేశ భూభాగంలో పర్యటిస్తున్నప్పుడు.. మీరు మాత్రం ఇక్కడ కూర్చుని "మాతృభూమి" పట్ల మీకున్న ప్రేమను నిరూపించుకోవడానికి ఏదో ఒక హిందూ సినిమాను ప్రదర్శించాల్సి రావడమేంటో..'' అంటూ ఒక యూజర్ ట్వీట్ చేశారు. తన పోస్ట్‌లో ఆయన ఇరాన్‌ను తప్పుపట్టారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

మరోవైపు ఇరాన్ పోస్ట్ చేసిన మూవీ భగవంత్ కేసరిలో హీరో నందమూరి బాలకృష్ణ కేంద్రంగా మరికొందరు యూజర్లు కామెంట్లు పెట్టారు.

ఇప్పుడు బాలయ్య ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయారంటూ ఓ యూజర్ రాశారు.

అయితే, ఆ ట్వీట్‌లో భగవంత్ కేసరి మూవీని బాలీవుడ్‌గా జింబాబ్వేలోని ఇరాన్ ఎంబసీ పేర్కొనడంపై కూడా యూజర్లు కామెంట్ చేస్తున్నారు.

''ఇది బాలీవుడ్ కాదు. టాలీవుడ్. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ'' అని, ''బాలయ్య క్రేజ్ ఇప్పుడు ఇరాన్ వరకు రీచ్ అయింది'' అని యూజర్లు ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 3

''ఇది బాలీవుడా, టాలీవుడా అని ఎవరు అడుగుతున్నారు, మెసేజ్ అయితే స్పష్టంగా ఉంది'' అంటూ మరొకరు ట్వీట్ చేశారు.

అయితే, ఇరాన్-అమెరికా మధ్య యుద్ధంలో ఇరాన్ ఎంబసీలు తెలుగు సినిమాలను వాడుకోవడంపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది.

డోనల్డ్ ట్రంప్

అసలు ఇరాన్ గురించి ట్రంప్ ఏమన్నారు?

గత మంగళవారం ఐరాస సర్వసభ్య సమావేశంలో ట్రంప్ తీవ్ర హెచ్చరిక చేసిన తర్వాత ఇరాన్ ఈ పోస్ట్‌లు చేయడం ప్రారంభించింది.

రాయిటర్స్ రిపోర్టు ప్రకారం ఐరాస సర్వసభ్య సమావేశంలో మాట్లాడిన ట్రంప్.. ''యుద్ధం ముగిసేలా ఇరాన్ మాతో డీల్ చేసుకోకపోతే, ఆ దేశాన్ని సర్వనాశనం చేస్తాం. లేదంటే నరకానికి పంపుతాం'' అని ట్రంప్ అన్నారు.

నవంబర్ 3న జరిగే అమెరికా మధ్యంతర ఎన్నికల తర్వాత తమ ప్రభుత్వం ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదుర్చుకుంటుందని అంచనా వేస్తూనే.. ఇరాన్‌ను చర్చల టేబుల్‌ వద్దకు బలవంతంగా తీసుకురావడానికి దానిని ఆర్థికంగా ఏకాకిని చేయడంలో అమెరికాతో చేతులు కలపాలని ట్రంప్ ఇతర దేశాలకు పిలుపునిచ్చారు.

"నేను ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇరాన్‌ను పునర్నిర్మించుకోవడానికి, అది ఎన్నడూ లేనంత గొప్ప దేశంగా రూపుదిద్దుకోవడానికి అనుమతించే ఒక ఒప్పందం కుదుర్చుకోవాలా?" లేదా "ఇస్లామిక్ రిపబ్లిక్‌ను సర్వనాశనం చేసి, ప్రజలను, దేశాలను మళ్లీ చంపడానికి, నాశనం చేయడానికి వారికి ఎప్పటికీ అవకాశం ఇవ్వకుండా పనిచేయాలా?" అని ట్రంప్ అన్నట్లు రాయిటర్స్ రిపోర్టు చేసింది.

అయితే, ట్రంప్ చేసిన ఈ హెచ్చరికలకే ప్రతిస్పందనగా ఇరాన్ రాయబార కార్యాలయాలు తమ సోషల్ మీడియాలను వాడుకుంటూ సినిమా డైలాగ్స్‌తో సమాధానాలిస్తున్నాయి.

భగవంత్ కేసరి మూవీ డైలాగ్

ఇరాన్‌లో సోషల్ మీడియా వినియోగం ఎలా ఉంది?

ఇరాన్‌ ఎన్నో ఏళ్లుగా ఇంటర్నెట్ వాడకంపై గట్టి నియంత్రణను కలిగి ఉంది. పశ్చిమ దేశాల సోషల్ మీడియా యాప్‌లు, ప్లాట్‌ఫామ్‌లతో పాటు పలు వార్తా వెబ్‌సైట్‌లు చాలా వరకు అక్కడ బ్లాక్ చేశారు.

అయినప్పటికీ.. వినియోగదారుల లొకేషన్‌లను దాచిపెట్టే వర్చ్యువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌ల సహాయంతో చాలా మంది ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్రసిద్ధ యాప్‌లను యాక్సస్ చేసుకోగలుగుతున్నారు.

2025 జూన్‌లో ఇరాన్-ఇజ్రాయెల్ సంక్షోభం సమయంలో కూడా ఇంటర్నెట్ షట్‌డౌన్‌ను విధించింది ఇరాన్.

ఈ ఆంక్షల వల్ల 10 లక్షల మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయినట్లు ప్రాథమిక అంచనా వేస్తున్నట్లు 2026 ఏప్రిల్‌లో బీబీసీ ఓ కథనం ప్రచురించింది. ఈ ప్రభావం ఇంకా ఎక్కువగానే ఉండొచ్చని కొన్ని స్వతంత్ర సంస్థలు చెబుతున్నాయి.

డోనల్డ్ ట్రంప్
ఫొటో క్యాప్షన్, ఇరాన్ తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటోందని ట్రంప్ సన్నిహితులు భావిస్తున్నారు.

ఇరాన్-అమెరికా యుద్ధం ఇంకెన్నాళ్లు?

ఇరాన్‌తో సాగుతున్న ప్రస్తుత యుద్ధం ట్రంప్ అధ్యక్ష పదవీ కాలం ముగిసే వరకు అంటే 2029 వరకు కొనసాగే అవకాశం ఉందని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో సహా పలువురు ట్రంప్ ప్రభుత్వ ఉన్నతాధికారులు అంతర్గతంగా చర్చించుకున్నట్లు 'ది వాల్‌స్ట్రీట్ జర్నల్' రిపోర్ట్ చేసింది.

యుద్ధం త్వరలోనే ముగుస్తుందంటూ ట్రంప్ పదే పదే చెబుతున్న మాటలకు ఈ అంచనాలు పూర్తి భిన్నంగా ఉన్నాయి.

మరో రెండు నెలల్లో జరగనున్న అమెరికా ప్రతినిధుల సభ (దిగువ సభ) మధ్యంతర ఎన్నికలు ముగిసిన వెంటనే యుద్ధం ముగుస్తుందని భావిస్తున్నట్లు ట్రంప్ ఇటీవల ఒక ప్రకటనలో తెలిపారు.

తమకు సానుకూలంగా ఉండేవారు దిగువ సభలో అధికారంలోకి రావాలని ఇరాన్ కోరుకుంటోందని, ఇందుకోసం ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు ఆ దేశం ప్రయత్నిస్తోందని ట్రంప్ ఆరోపించారు.

పర్షియన్ గల్ఫ్, హార్ముజ్ జలసంధి ప్రాంతాల్లో జరుగుతున్న ఘర్షణల కవరేజ్ కూడా అమెరికన్ మీడియాలో విస్తృతంగా కనిపిస్తోంది.

ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లపై అమెరికా దాడులు.. జోర్డాన్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతీకార క్షిపణి దాడులు.. అలాగే దక్షిణ ఇరాన్ సముద్ర తీరంలో అమెరికన్ నేవీపై దాడి చేశామన్న ఇరాన్ సైనికాధికారుల ప్రకటనలు అమెరికన్ మీడియాలో పతాక శీర్షికల్లో కనిపించాయి.

అయితే దీనికి భిన్నంగా తమ యుద్ధనౌక దేనినీ ఇరాన్ టార్గెట్ చేసుకోలేదని అమెరికా సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది.

"ఈ పరిస్థితి త్వరలో ముగిసే సంకేతాలేవీ కనిపించడం లేదు" అని పేర్కొన్న సీఎన్ఎన్ రిపోర్టర్, ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ చర్చలు ప్రారంభించడం సాధ్యమేనా అనే ప్రశ్నను లేవనెత్తారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)