9 రోజులు సొరంగంలో చిక్కుకుపోయిన ఇద్దరిని ఎలా రక్షించారు?

వీడియో క్యాప్షన్, 9 రోజులు సొరంగంలో చిక్కుకున్న ఇద్దర్ని కాపాడిన ఆర్మీ
9 రోజులు సొరంగంలో చిక్కుకుపోయిన ఇద్దరిని ఎలా రక్షించారు?
ప్రచురణ

నేపాల్‌లో సంభవించిన భారీ వరదల కారణంగా త్రిశూలి 3-ఏ జలవిద్యుత్ ప్రాజెక్ట్ సొరంగంలో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులను సహాయక బృందాలు రక్షించాయి.

నేపాల్ విద్యుత్ అథారిటీ జాయింట్ మేనేజర్ సురేశ్ రౌత్ ఈ విషయాన్ని నిర్థరించారు.

సొరంగంలో చిక్కుకుపోయిన సంజయ్ షా, కబీర్ మహర్జన్‌లను సురక్షితంగా బయటకు తీసుకువస్తుండగా అత్యవసర సహాయక సిబ్బంది హర్షధ్వానాలు చేశారు.

తొలుత సొరంగం నుంచి గొంతు వినపడగానే ''భయపడకండి, మిమ్మల్ని రక్షించడానికే మేం ఇక్కడ ఉన్నాం'' అని గట్టిగా అరిచినట్టు సహాయకబృందాలు పేర్కొన్నట్టు స్థానిక వార్తా కథనాలు తెలిపాయి.

తరువాత సొరంగం నుంచి ''సరే'' అంటూ బలహీనంగా స్పందన వచ్చిందని ఆ కథనాలు పేర్కొన్నాయి.

తొలుత కాపాడింది సంజయ్ షా అనే వ్యక్తిని. ప్రాజెక్ట్ వద్ద ఆయన మెకానికల్ ఫోర్‌మన్‌గా పనిచేస్తున్నారు.

అనంతరం మెకానికల్ సూపర్‌వైజర్ కబీర్ మహార్జన్‌ని సురక్షితంగా బయటకు తీసుకువచ్చినట్లు రౌత్ తెలిపారు.

నేపాల్ వరదలు, టన్నెల్ రెస్క్యూ

ఫొటో సోర్స్, NEA

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)