కామన్వెల్త్ గేమ్స్: తదుపరి వేదిక అహ్మదాబాద్, ఘనంగా 2026 ముగింపు వేడుకలు-12 ఫోటోలలో...
ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, క్లోజింగ్ సెరిమనీ సమయంలో కళ్లు మిరుమిట్లు గొలిపేలా బాణాసంచా వెలుగులుకథనం
రచయిత, పాల్ ఓ హేర్
హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రచురణ
చదివే సమయం: 4 నిమిషాలు
గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ - 2026 క్రీడలు వైభవంగా ముగిశాయి. ఆదివారం జరిగిన ముగింపు వేడుకలకు ముందు బాణాసంచాతో క్లైడ్ నదిపై అద్భుతమైన ప్రదర్శన నిర్వహించారు.
ఈ క్రీడల్లో ఆస్ట్రేలియా (171), ఇంగ్లండ్ (110) కెనడా (62), భారత్ (39), స్కాట్లాండ్ (39) పతకాలతో టాప్ 5 దేశాలుగా నిలిచాయి.
ముగింపు వేడుకలో కామన్వెల్త్ పతాకాన్ని 2030లో సెంటినరీ కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యాన్నివ్వబోతున్న అహ్మదాబాద్‌కు అధికారికంగా అప్పగించారు.
ఫొటో క్యాప్షన్, గ్లాస్గోలో పదో రోజు ముగింపు వేడుకలో సింపుల్ మైండ్స్ ప్రదర్శన జరిగింది.
ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, ముగింపు వేడుకల్లో భూమి త్రివేది, శంకర్ మహదేవన్ తమ బృందంతో కలిసి ప్రదర్శన ఇచ్చారు.
ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, శ్యామక్ దావర్ డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి మానుషి చిల్లార్ ప్రదర్శన ఇచ్చారు. ఈ వేడుకలో శాండీ థామ్, షెరీన్ కట్కెల్విన్, డైవర్సిటీ బృందం కూడా ప్రదర్శనలు ఇచ్చాయి.
ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, దీపాలు నిండిన పుష్పాలతో జరిపిన ప్రదర్శన ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.
ఫొటో క్యాప్షన్, క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శనతో పాటు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించిన క్రీడాకారిణికి ఇచ్చే డేవిడ్ డిక్సన్ అవార్డును ముగింపు వేడుకలో స్కాట్లాండ్కు చెందిన మెలనీ వుడ్స్ అందుకున్నారు.
ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, కామన్వెల్త్ క్రీడల ముగింపు వేడుకలకు వస్తున్న భారతీయ క్రీడాకారిణులు
ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, ముగింపు వేడుకలో వివిధ దేశాలకు చెందిన క్రీడాకారులు తమదేశ పతాకాలను పట్టుకుని కనిపించారు.
ఫొటో సోర్స్, Reuters
ఫొటో క్యాప్షన్, ఈ వేడుకల్లో భారతీయ కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రముఖంగా కనిపించాయి.