BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభం.. కానీ ఈ ఏడాది పొలాలకు సాగునీరు ఎందుకు ఇవ్వడం లేదంటే?
గత 30 ఏళ్లలో రెండుసార్లు శంకుస్థాపనలు, రెండుసార్లు ప్రారంభోత్సవాలు జరుపుకున్న ఈ ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం, వాస్తవ పరిస్థితులను విశదీకరిస్తూ ఇప్పటికే బీబీసీ పలుమార్లు కథనాలను ప్రచురించింది.
నేపాల్: వరద వస్తుందని తెలిసి 900మంది విద్యార్థుల్ని స్కూల్ నుంచి ఖాళీ చేయించిన హెడ్ మాస్టర్
"ఒక విద్యార్థి తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి 'పెద్ద వరద వస్తోంది. నా కూతురిని తీసుకెళ్లడానికి వచ్చాను. నేను మా అమ్మాయిని తీసుకుపోతాను' అని నాతో చెప్పారు" అని రాజేంద్ర దవాడి గుర్తు చేసుకున్నారు.
అలారం పెట్టకుండానే అనుకున్న సమయానికి నిద్ర లేవడం ఎలా? వారం రోజుల ప్రయోగంలో ఈమె ఏ రోజు ఏం చేశారంటే
జీవితంలో ఎదురయ్యే ఆందోళనలు, డోర్ బెల్స్, పుట్టినరోజుల వంటి వాటి మధ్య ప్రశాంతంగా నిరాటంకమైన నిద్రపోగలగడం అంత సులువు కాదు. దీని గురించి పరిశోధిస్తున్నప్పుడు, నిద్రతో మన సంబంధం ఎంత చెడిపోయిందో అర్థమైంది.
షార్క్ దాడి:‘‘అప్పుడు నాకు డైనోసార్‌తో పోరాడుతున్నట్లు అనిపించింది’’ అంటూ గుర్తు చేసుకున్న మహిళ
‘‘నా చేతిని పట్టుకుని చర్మం, కండరాలు, అన్నింటినీ చీల్చేసింది. ఆ తర్వాత నా కాలు పట్టుకుని నీటిలోకి లాక్కెళ్లడం మొదలుపెట్టింది. ఇక నేను చనిపోవడం ఖాయం అనుకున్నా. వెంటనే నా కూతురు గురించి ఆలోచించడం మొదలుపెట్టా. తల్లిలేని పిల్ల ఎలా పెరుగుతుందోనని ఆందోళన కలిగింది’’ అంటూ కన్నీళ్లతో వివరించారు లియా.
రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనలు బీజేపీని ఇరకాటంలో పెడతాయా?
మరికొన్ని నెలల్లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, తన మద్దతుదారుల్లో ఒక వర్గాన్ని దూరం చేసుకోకుండా రిజర్వేషన్లపై వస్తున్న ఈ కొత్త డిమాండ్లకు బీజేపీ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరమైన ప్రశ్న.
‘హెయిర్ కట్’: ‘రుణ మాఫీ’లో భాగంగా కేవలం రూ. 6.5 కోట్లు చెల్లించడానికి సుభాష్ చంద్రకు ఎలా ఆమోదం లభించింది?
‘‘చట్టంలోని నిబంధనలను ఎన్సీఎల్టీ అమలు చేసింది. అయితే ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఇంత భారీ నష్టం వాటిల్లడంపై ప్రజల్లో ఏర్పడే అభిప్రాయాన్ని విస్మరించడం కష్టం’’
కోటిన్నర మంది ఫాలోవర్స్ ఉన్న ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ను సజీవ దహనం చేయాలనుకున్నది ఎవరు?
మంజీత్‌ను చండీగఢ్ నుంచి కిడ్నాప్ చేసి సజీవంగా దహనం చేసేందుకు ప్రయత్నించారని చండీగఢ్ పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఆమె దాదాపు రెండు నెలల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందారని కుటుంబ సభ్యులు చెప్పారు.
నేపాల్ వరదలు: 'పిల్లి అనుకుని వెళ్తే శిథిలాల కింద పాప కనిపించింది'
రాసువా జిల్లాలోని స్యాబ్రుబేసి సమీపంలో ప్రాణాలతో బయటపడిన వారి కోసం సహాయ సిబ్బంది గాలిస్తుండగా, శిథిలాల కింద ఏదో పిల్లి చిక్కుకున్నట్టు వారికి శబ్దం వినిపించింది. రక్షించడానికి వెళ్లగా అక్కడ చిన్నారి కనిపించింది.
పదిహేను మంది భార్యలలో ఆమె ఒకరు.. భర్త నుంచి పారిపోయి కళా సామ్రాజ్యాన్ని నిర్మించారు
1970వ దశకంలో తన పనికి గుర్తింపు పొందడం ప్రారంభమైంది. ఆఫ్రికన్-అమెరికన్లకు సాంప్రదాయ నైజీరియన్ హస్తకళలను నేర్పించడానికి ఆమెను అమెరికాకు ఆహ్వానించారు.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్‌లో
ఇరాన్
ఫీచర్లు
ఆరుతరాల అరుదైన ఉమ్మడి కుటుంబం: రోజుకు బస్తా బియ్యం, పండగొస్తే 2 పొట్టేళ్లు, 20 కేజీల చికెన్.. కలిసిమెలిసి ఎలా జీవనం సాగిస్తున్నారంటే..
అనంతపురం జిల్లాలో 83 మంది ఒకే ఇంట్లో కలిసిమెలిసి జీవిస్తున్న అరుదైన ఉమ్మడి కుటుంబం కథ ఇది. రోజుకు 50 కేజీల బియ్యం వంట, ఆదివారం వస్తే పొట్టేలు కోయాల్సిందే, సరదాగా బజ్జీలు తినాలంటే 15 కేజీల పిండి సిద్ధం చేయాల్సిందే. ఆధునిక కాలంలో ఎలాంటి విభేదాలు లేకుండా వీరంతా ఎలా కలిసి ఉంటున్నారు? ఆ కుటుంబ సభ్యులు ఏం చెబుతున్నారంటే..
గదర్ పార్టీ: భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ఈ గ్రూప్‌కు, ఇరాన్‌కు ఉన్న అనుబంధం ఏంటి?
"చాలామంది స్వాతంత్ర్య సమరయోధులు తమ భద్రత కోసం ఇరాన్‌కు వెళ్లి అక్కడి నుంచే పోరాటాన్ని కొనసాగించేవారు. షిరాజ్‌లో జరిగిన ఒక ఎన్కౌంటర్ తర్వాత అంబా ప్రసాద్ తన ఎడమ చేతితోనే రివాల్వర్‌ను పట్టుకుని తనపై దాడి చేసిన వారిని ఎదుర్కొన్నారు’’
తాజ్‌మహల్: ప్రేమకు చిహ్నమా, ముంతాజ్ లాంటి మహిళల ప్రాణ త్యాగాలకు చిహ్నమా?
షాజహాన్ ప్రేమకు ప్రతీకగా దీన్ని నిర్మించినప్పటికీ, మాతృ ఆరోగ్య సంరక్షణకు ప్రతీక అయితే ఇంకా బాగుండేదని మద్రాస్ కొరియర్ పత్రిక రాసింది.
సముద్ర గుప్తుడు: 'ఒళ్లంతా బల్లెం, బాణం, ఈటె, కత్తి, గద, గొడ్డలి గాయాలున్న ఈ రాజు ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదు'
‘ఉత్తర భారతంలో తొమ్మిది రాజ్యాలను జయించడానికి సముద్రగుప్తుడు ఎంతో దూరదృష్టితో ఆలోచించాడు. ఈ తొమ్మిదిమంది రాజుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించాడు. సైనిక శక్తితో ఈ రాజ్యాలను జయించి, తన సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నాడు. కానీ, దక్షిణాదిన తాను జయించిన 12 రాజ్యాలను మాత్రం విలీనం చేసుకునేందుకు ప్రయత్నించలేదు’
జనాభా లెక్కల కోసం ఒకప్పుడు పోస్టల్ స్టాంపులు, ఉత్తరాలు ప్రభుత్వానికి ఎలా సాయపడ్డాయంటే..
వంద కోట్లకు పైగా ఉన్న జనాభా, తమను తాము ఈ దేశ చరిత్రలో ఒక భాగంగా గుర్తించుకునేలా, ప్రభుత్వంపై అంతటి నమ్మకాన్ని ఉంచేలా వారిని ఒప్పించడమే ఆ సవాలు.
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్‌తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.



























































