ఇరాన్‌పై మళ్లీ అమెరికా దాడులు, దక్షిణ తీరంలో భీకర శబ్దాలు

ఫొటో సోర్స్, Reuters
ఇరాన్‌పై అమెరికా మరోసారి దాడులు చేసింది.
ఓడరేవు కేంద్రాలున్న సిరిక్, బందర్ అబ్సాస్‌తో సహా దేశంలోని దక్షిణ ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించినట్టు ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది.
బందర్ అబ్బాస్‌లో ఎనిమిది పేలుళ్లు సంభవించాయని, దక్షిణ ఇరాన్‌లోని సిరిక్, జాస్క్ ఓడరేవులపై రెండు క్షిపణులు పడ్డాయని వెల్లడించింది.
హార్ముజ్ జలసంధిలో మూడు ట్యాంకర్లపై మంగళవారం(జూలై 7) జరిగిన దాడులకు ప్రతీకారంగా తాము శక్తివంతమైన దాడులు ప్రారంభించినట్టు అమెరికా సైన్యం తెలిపింది.
80కి పైగా లక్ష్యాలపై దాడులు చేసినట్టు అమెరికా ప్రకటించింది. అయితే, అమెరికా దాడులకు ప్రతిస్పందనగా బహ్రెయిన్, కువైట్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై తాము ప్రతీకార దాడులు జరిపామని ఇరాన్ తెలిపింది.


ఫొటో సోర్స్, Reuters
చాబహార్ పోర్టుపై తొలిసారి దాడులు
హార్ముజ్ జలసంధిలో మూడు ట్యాంకర్లపై మంగళవారం(జూలై 7) జరిగిన దాడులకు ప్రతీకారంగా తాము ఈ భారీ దాడులు ప్రారంభించినట్టు అమెరికా సైన్యం తెలిపింది.
ఇరాన్‌లోని చాబహార్ పోర్టుపైనా అమెరికా దాడులు చేసింది. అమెరికా-ఇరాన్ సంక్షోభం మొదలైన తర్వాత చాబహార్ పోర్టుపై దాడులు జరగడం ఇదే మొదటిసారి.

ఫొటో సోర్స్, Reuters
చాబహార్, కొనారక్‌లో దాదాపు పది పేలుళ్ల శబ్దాలు వినిపించాయని, చాబహార్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ఇరాన్ న్యూస్ ఏజెన్సీ తస్నిమ్ తెలిపింది.
చాబహార్‌లోని ఐఆర్‌జీసీ స్థావరంపై అమెరికా పైటర్ జెట్‌లు బాంబులు వేశాయని తస్నిమ్ వెల్లడించింది.
దాడులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చేశారు.
''మేం వారిపై చాలా తీవ్రంగా దాడులు చేశాం. వాళ్లు ఒకసారి దాడి చేస్తే దానికి ప్రతిస్పందనగా 20సార్లు చేస్తాం'' అని ట్రంప్ తెలిపారు.
(ఈ కథనం అప్‌డేట్ అవుతోంది)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



























