హుస్సేన్ సాగర్ తీరాన కోలాహలం.. నిమజ్జన శోభాయాత్ర 9 ఫోటోలలో

హైదరాబాద్‌, గణేశ్ నిమజ్జనం, పండుగ
ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు

హైదరాబాద్‌లో జరిగిన వినాయక నిమజ్జన శోభాయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

నిమజ్జనం కోసం గణేశ్ విగ్రహాలను తరలిస్తూ ఊరేగింపులో పాలుపంచుకున్నారు.

ఖైరతాబాద్ గణేశ్ విగ్రహ నిమజ్జనం గురువారం మధ్యాహ్నమే పూర్తి కాగా అనేక ఇతర విగ్రహాల నిమజ్జనం రాత్రి వరకు కొనసాగింది.

తెలంగాణ వ్యాప్తంగా నిమజ్జనం కోసం ‘గణేశ్ పోర్టల్’లో 1.24 విగ్రహాలు నమోదు చేసినట్లు డీజీపీ సీవీ ఆనంద్ చెప్పారు.

నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసినట్లు ఆయన వెల్లడించారు.

హైదరాబాద్‌, గణేశ్ నిమజ్జనం, పండుగ
ఫొటో క్యాప్షన్, హుస్సేన్ సాగర్ సరస్సులో నిమజ్జనం కోసం గణేశ్ విగ్రహాన్ని క్రేన్ సాయంతో తీసుకెళ్తున్న వలంటీర్లు.
హైదరాబాద్‌, గణేశ్ నిమజ్జనం, పండుగ
ఫొటో క్యాప్షన్, భక్తుల మధ్య ఖైరతాబాద్ గణేశ్ విగ్రహం
హైదరాబాద్‌, గణేశ్ నిమజ్జనం, పండుగ
ఫొటో క్యాప్షన్, హైదరాబాద్‌లో మక్కా మసీదు ముందు నుంచి గణేశ్ విగ్రహాన్ని నిమజ్జనం కోసం తీసుకెళ్తున్న భక్తులు, భద్రత కోసం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను మోహరించిన ప్రభుత్వం.

హైదరాబాద్‌లో నిమజ్జనాల కోసం గత పది రోజులుగా సుమారు 25 వేల మంది పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీజీపీ సీవీ ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు.

హైదరాబాద్‌, గణేశ్ నిమజ్జనం, పండుగ
ఫొటో క్యాప్షన్, హుస్సేన్ సాగర్ సరస్సులో నిమజ్జనం తర్వాత నీటిపై గణేశ్ విగ్రహం

నిమజ్జనాల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని ప్రకటిస్తూ తెలంగాణ తల్లి ఫ్లై ఓవర్ కింద పోలీసులు సంబరాలు చేసుకున్నారు.

నిమజ్జనాల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో సచివాలయం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఎత్తివేసి రాకపోకలు పునరుద్ధరించారు.

హైదరాబాద్‌, గణేశ్ నిమజ్జనం, పండుగ
ఫొటో క్యాప్షన్, వినాయకుడి విగ్రహాన్ని క్రేన్ సాయంతో నీటిలోకి వదులుతున్నారు.
హైదరాబాద్‌, గణేశ్ నిమజ్జనం, పండుగ
ఫొటో క్యాప్షన్, హుస్సేన్ సాగర్ వద్ద క్రేన్ సాయంతో గణేశ్ విగ్రహం నిమజ్జనం.
హైదరాబాద్‌, గణేశ్ నిమజ్జనం, పండుగ
ఫొటో క్యాప్షన్, శివుడి రూపంలో వినాయకుడి ప్రతిమ
హైదరాబాద్‌, గణేశ్ నిమజ్జనం, పండుగ
ఫొటో క్యాప్షన్, గణేశ్ విగ్రహాలను నిమజ్జనానికి ఊరేగింపుగా తీసుకెళ్తున్న భక్తులు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)