బస్ అంత పొడవున్న జెల్లీ ఫిష్
బస్ అంత పొడవున్న జెల్లీ ఫిష్
ప్రచురణ
ఈ లయన్స్ మేన్ జెల్లీఫిష్ సుమారు 10 నుంచి 15 మీటర్ల పరిమాణంతో దాదాపు 'బస్సు అంత పొడవు' ఉందని పెంబ్రోక్‌షైర్‌కు చెందిన ఫ్రీ డైవర్ ఐస్టిన్ మోర్గాన్ చెప్పారు.
'మన సముద్రాలు ఎదుర్కొంటున్న ముప్పు' గురించి అవగాహన కల్పించేందుకు సోషల్ మీడియా కోసం వీడియోలు రికార్డ్ చేసే ఈ 21 ఏళ్ల పర్యావరణ పరిరక్షకుడు, వేల్స్‌లో తాను లయన్స్ మేన్‌ను చూడటం ఇదే తొలిసారని చెప్పారు.
స్కాట్లాండ్ తీరంలోని చల్లని జలాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. లయన్స్ మేన్ కుడితే నొప్పిగా ఉన్నప్పటికీ అది ప్రమాదకరం కాదని ఒక మెరైన్ బయాలాజిస్ట్ తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









