చుట్టమల్లే సాంగ్ డీప్‌ఫేక్ వీడియో వెనుక ఎవరున్నారు? నిందితులు దొరికారా

దేవర పాట
ఫొటో క్యాప్షన్, దేవర సినిమాలోని సాంగ్
    • రచయిత, కొటేరు శ్రావణి
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

దేవర-పార్ట్ 1లోని చుట్టమల్లే పాటకు సంబంధించి జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్‌లను డీప్‌ఫేక్ చేసి రూపొందించిన వీడియోపై సినీ పరిశ్రమ ఆగ్రహించింది.

''ఎట్టిపరిస్థితుల్లో ఎవర్నీ వదిలి పెట్టను'' అంటూ.. జూనియర్ ఎన్టీఆర్ రియాక్ట్ కాగా.. తాజాగా జాన్వీ కపూర్ సైతం దీనిపై తీవ్రంగా మండిపడ్డారు.

ఇది లైంగిక దాడికి ఏమాత్రం తీసిపోని ఘటనగా జాన్వీ కపూర్ అభివర్ణించారు.

జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్‌కు పెద్ద ఎత్తున సినీ ప్రముఖుల నుంచి స్పందన వచ్చింది.

మరోవైపు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీని వెనుక ఉన్నదెవరో గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అసలేం జరిగింది?

కొన్ని రోజుల క్రితం ఒక గుర్తు తెలియని సోషల్ మీడియా యూజర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను (ఏఐ) వాడుతూ.. చుట్టమల్లే పాటకు అసభ్యకరమైన రీతిలో వీడియో చేశారు.

మార్ఫింగ్ చేసిన ఈ క్లిప్ సోషల్ మీడియాలో పోస్ట్ అయిన వెంటనే వైరల్ అయింది.

జాన్వీ కపూర్‌‌ను తప్పుగా చూపించిన ఈ ఫేక్ వీడియోను యూజర్లు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడం ప్రారంభించారు.

దీంతో, అక్టోబర్ 3న జూనియర్ ఎన్టీఆర్ తీవ్రంగా మండిపడ్డారు.

''అసహ్యకరమైన, విసుగు పుట్టించే, అవమానకర చర్య'' అని జూనియర్ ఎన్టీఆర్ దీనిపై ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు.

''మహిళలను తల్లులుగా, దేవతలుగా పూజించే మన నేలపై.. ''మాతృదేవో భవ'' అంటే కేవలం ఒక నినాదం కాదు, ఇది మన సంస్కృతిలో భాగం. కొంతమంది ఎంతలా దిగజారిపోయారంటే.. ఒక మహిళను అత్యంత అవమానకరమైన రీతిలో కించపరచడానికి ఏఐను ఉపయోగిస్తున్నారు. ఏఐని ఉపయోగించి, ఇంత దుర్మార్గమైన దాన్ని సృష్టించడం మాటల్లో చెప్పలేనంత సిగ్గుచేటు.

మార్ఫింగ్ చేసి ఈ చుట్టమల్లే సాంగ్ వీడియో వెనుకున్న ఎవర్నీ నేను వదిలిపెట్టను. దీన్ని సృష్టించిన వారిపై, దాన్ని వ్యాపి చేస్తున్న వారిపై సాధ్యమైన ప్రతి చట్టపరమైన చర్యను తీసుకుంటాను.

దయచేసి ఇటువంటి కంటెంట్‌ను ఎవరూ చూడకండి, షేర్ చేయొద్దు, షేర్ చేసి అందులో భాగం కావొద్దు. ఈరోజు ఇది వేరే ఎవరో కావొచ్చు. రేపు మీ తల్లి, సోదరి, భార్య, కూతురు దీనికి బాధితులు కావొచ్చు.

ఇది చాలా తీవ్రమైన సమస్య. ఏఐ దుర్వినియోగాన్ని కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన నిబంధనలు తీసుకురావాలని నేను కోరుతున్నా'' అని జూనియర్ ఎన్టీఆర్ ‘ఎక్స్’లో రాశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్‌పై పెద్ద ఎత్తున సోషల్ మీడియా యూజర్ల నుంచి స్పందన వచ్చింది.

''ఈరోజు ఇది వేరే ఎవరో కావొచ్చు. రేపొద్దున మీ తల్లి, సోదరి, భార్య లేదా కూతురు కావొచ్చు''.. ఈ ఆలోచన లేకనే ఇలా ఉన్నారు.. అంటూ ఒక యూజర్ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

''కచ్చితంగా మేం మీతో పాటు ఉంటాం అన్నా! ఏఐను అంత అసహ్యకరమైన రీతిలో దుర్వినియోగం చేయడం తప్పక కఠినమైన చట్టపరమైన చర్యను ఎదుర్కోవాలి. దీనిలో పాలుపంచుకున్న అందరూ దీనికి బాద్యత వహించాలి'' అని మరో యూజర్ ఎన్టీఆర్‌కు మద్దతుల పలికారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 3

''ఏఐ దుర్వినియోగం+ సాధారణ బాధితుడు = దురదృష్టకరం.

ఏఐ దుర్వినియోగం + ఇన్‌ఫ్లుయెన్స్ పర్సన్ = "భారత ప్రభుత్వం, వెంటనే చర్య తీసుకోండి!

అత్యవసర బటన్ ఎక్కడుందో తెలుసుకోవడం మంచిదే.. '' అంటూ మరొక యూజర్ సెటైరికల్‌గా ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 4

''ఒరిజినల్ వీడియోనే ఒకరకమైన సాఫ్ట్ పోర్న్‌తో ఉంది. @tarak9999, మీకు ఏమాత్రం సిగ్గు లేదా? 'చుట్టమల్లే' పాటలో జాన్వి వేసుకున్నట్లుగా మీ కుటుంబ సభ్యులకు దుస్తులు వేయించి, "మాతృదేవోభవ" భజన పాడుతూ వారితో కలిసి మీరు డ్యాన్స్ చేస్తారా?'' అంటూ మరో యూజర్ ప్రశ్నించారు.

సినిమాలోని అసలైన వీడియో సాంగ్‌లోని వస్త్రధారణపైనా యూజర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 5

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ
ఫొటో క్యాప్షన్, నిందితుడిని పట్టుకోవడంపై దృష్టి సారించి ఉంటే తెలివైన పని అయ్యేదన్న రామ్ గోపాల్ వర్మ

ఘాటుగా స్పందించిన రామ్ గోపాల్ వర్మ

మరోవైపు డైరెక్టర్, ప్రొడ్యూసర్ రామ్ గోపాల్ వర్మ దీనిపై స్పందించారు.

'' ప్రముఖులందరూ సాధించిన ఏకైక విషయం ఏమిటంటే.. ఆ అభ్యంతరకరమైన లింక్‌ను ప్రచారం చేసి, తద్వారా కోట్లాది మంది ప్రజలు చూసేలా చేయడం. నిందితుడిని పట్టుకోవడంపై దృష్టి సారించి, ఆ విషయాన్ని ప్రచారం చేసి ఉంటే తెలివైన పని అయ్యేది. దానికి బదులుగా వారు చేసింది ఏమిటంటే.. ట్వీట్ చేసి బాధితురాలి గుర్తింపుపైనా, నేరంగా పరిగణించే ఆ అభ్యంతరకరమైన కంటెంట్‌పైనా విపరీతమైన దృష్టిని ఆకర్షించడం'' అంటూ రామ్ గోపాల్ వర్మ ‘ఎక్స్’లో రాశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 6
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 6

జాన్వీ కపూర్
ఫొటో క్యాప్షన్, జాన్వీ కపూర్

'లైంగిక దాడికి ఏమాత్రం తీసిపోదు'

ఏఐతో మార్ఫింగ్ చేసిన వీడియోపై ఈ పాటలో నటించిన జాన్వీ కపూర్ కూడా స్పందించారు.

సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ మహిళలను అసభ్యకరంగా చూపించడాన్ని ఖండించిన జాన్వీ కపూర్.. అనుమతి లేకుండా ఫిక్షనలైజ్డ్ కంటెంట్‌ను (కల్పిత కంటెంట్‌ను) వ్యాప్తి చేయడం తీవ్రమైన ఉల్లంఘన కిందకు వస్తుందని అన్నారు.

ఇది లైంగిక దాడికి ఏమాత్రం తీసిపోదని ఆమె అన్నారు.

''ఇండస్ట్రీలో ప్రతి మహిళ ఏదో ఒక విధంగా ఈ అనుభవాన్ని ఎదుర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలు రోజురోజూ దీని బారిన పడుతున్నారు. ఒక మహిళకు, ఆమె శరీరానికి సమ్మతి, ఎంపిక, గౌరవం ఇవ్వడమనేది మానవత్వ అత్యంత ప్రాథమిక విలువల్లో భాగం. అయినప్పటికీ, వాటిని ఇంకా సంక్లిష్టమైనవిగానే చూస్తున్నారు. కానీ, ఇవి కావు.

ఒక మహిళ వరుసగా ఐదు రోజులు 'సరే' అని చెప్పి, ఆరో రోజు 'వద్దు' అంటే కూడా ఆ 'వద్దు' అనే మాటకు గౌరవం ఇవ్వాలనేది కొందరికి అర్థం కావడానికి ఇంకా చాలా క్లిష్టమైన విషయంగా అనిపించడం ఆశ్చర్యకరంగా ఉంది.

ఒకవేళ ఆమె మినీస్కర్ట్ ధరిస్తే, ఆమె స్కర్ట్ కింద కెమెరా పెట్టడానికి, అసభ్యకరమైన కోణాలలో వీడియోలు తీయడానికి లేదా ఆమె శరీరాన్ని విజువల్‌గా దోచుకోవడానికి కాదు, అలా ఎవరికీ ఎప్పటికీ ఎలాంటి అనుమతి ఇవ్వదు. ఒక మహిళ ఎంతవరకు సౌకర్యంగా ఉంటుంది, ఆమె ఎక్కడ వరకు గీత గీసుకుంది (హద్దులు పెట్టుకుంటుంది), ఆమె తన శరీరంతో ఏం చేయాలని కోరుకుంటుంది అనే నిర్ణయాలు పూర్తిగా ఆమెకు మాత్రమే చెందుతాయి. ఇది చాలా ప్రాథమికమైన విషయం" అంటూ.. జాన్వీ కపూర్ సుదీర్ఘమైన పోస్టు పెట్టారు.

ఈ సమస్య తన మొత్తం కెరీర్‌లో తాను ఎదుర్కొన్న అన్నిటికంటే చాలా పెద్దదని పేర్కొన్నారు.

''మహిళల జీవితాలను ప్రతిరోజూ అస్తవ్యస్తం చేస్తున్న వాస్తవిక, భౌతిక భయాన్ని మనం ఇప్పటికీ సమర్థవంతంగా పరిష్కరించలేకపోయాం, ఇప్పుడు ఆ ముప్పు డిజిటల్ రంగానికి కూడా విస్తరించింది'' అని జాన్వీ కపూర్ చెప్పారు. ఇటువంటి విషయాలను ఎదుర్కోవడం ఒక మహిళగా జీవించడంలో భాగమైన ఒక కఠినమైన వాస్తవమని జాన్వీ కపూర్ అన్నారు.

నటుడు చిరంజీవి
ఫొటో క్యాప్షన్, ఈ ఘటనపై తెలుగు సినిమా కుటుంబమంతా ఒక్కటిగా ముందుకు రావాలని పిలుపునిచ్చిన చిరంజీవి

దీనిపై సినీనటులు ఎవరెవరు రెస్పాండ్ అయ్యారు?

చుట్టమల్లే సాంగ్ మార్ఫింగ్ వీడియోపై సినీ ప్రముఖులు వరుసగా స్పందిస్తున్నారు.

సాంకేతికతను ఉపయోగించిన ఒక మహిళను అత్యంత హేయంగా చిత్రీకరించడం తనను తీవ్రంగా కలచివేస్తోందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.

ఏఐతో మార్ఫింగ్ చేసిన ఇలాంటి వీడియోలను సృష్టించడం, ప్రచారం చేయడం అమానుషమని, తాను దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాని చెప్పారు.

''ఇది ఏ ఒక్క వ్యక్తికో, ఏ ఒక్క సినిమాకో పరిమితమైన సమస్య కాదు. ఈరోజు ఒకరికి ఎదురైన ఈ పరిస్థితి రేపు మీకు, నాకు, ఎవరికైనా ఎదురుకావచ్చు. ఒకరి గౌరవానికి భంగం కలుగుతుంటే మనకెందుకులే అని మౌనంగా ఉండటానికి వీల్లేదు. దీనిని అరికట్టడంలో మనందరికీ బాధ్యత ఉంది. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిని, వాటిని ఉద్దేశపూర్వకంగా వ్యాప్తి చేస్తున్న వారిని చట్టపరంగా జవాబుదారీ చేయాలి. వీటిని సరదాగానో, వినోదంగానో తీసుకొని తేలికగా వదిలేయడానికి లేదు'' అని చిరంజీవి అన్నారు.

''ఈ సమస్యపై తెలుగు ఫిలిం ఛాంబర్, నిర్మాతల మండలి, ఇతర అనుబంధ సంఘాలతో మాట్లాడి, ఒక ప్రత్యేక కమిటీని, ఫిర్యాదులపై చర్యలకు సమన్వయం చేసే విభాగాన్ని ఏర్పాటు చేయాలని సిఫార్సు చేస్తాను. సైబర్ క్రైమ్ అధికారులతో కలిసి పనిచేస్తూ, బాధితులకు అండగా నిలవడం, ఇలాంటి కంటెంట్‌ను తొలగించేలా చర్యలు చేపట్టడం, బాధ్యులపై చట్టపరమైన చర్యలను ముందుకు తీసుకెళ్లడం ఈ విభాగం లక్ష్యంగా ఉండాలి'' అని కోరారు.

ఇందుకోసం తెలుగు సినిమా కుటుంబమంతా ఒక్కటిగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 7
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 7

జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ స్పందించిన నటుడు విజయ్ దేవరకొండ.. ''మనం అత్యంత నీచమైన స్థాయికి దిగజారిపోయాం'' అంటూ ఈ వీడియోను తీవ్రంగా ఖండించారు.

''దీనికి బాధ్యులైన వారిని వదిలిపెట్టం. వారు కచ్చితంగా కఠినమైన చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాలి. దీన్ని వదిలిపెట్టేది లేదు'' అంటూ విజయ్ దేవరకొండ స్పందించారు.

ప్రపంచమంతా ఏఐ ప్రజల జీవనోపాధిని ఎలా ప్రభావితం చేస్తుంది? ఉద్యోగాలను ఎలా హరించేస్తుందనే విషయాలపై చర్చించుకుంటూ, భయపడుతున్న సమయంలో.. ఇలాంటి వెదవలు అదే సాంకేతికతను ఉపయోగించి పూర్తిగా అర్థరహితమైన పనులు చేస్తున్నారని మండిపడ్డారు.

నటుడు మంచు విష్ణు
ఫొటో క్యాప్షన్, భవిష్యత్‌కు ఇదొక హెచ్చరిక అన్న ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు

‘దురదృష్టవశాత్తు ఇదే చివరి డీప్‌ఫేక్ వీడియో కాదు’

‘‘మన పరిశ్రమను ఆగ్రహానికి గురిచేసిన ఈ కలవరపెట్టే ఏఐ డీప్‌ఫేక్ సంఘటనను కేవలం ఒకే ఒక సంఘటనగా చూడకూడదు. ఇదొక హెచ్చరిక చూడాలి.

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా.. దుర్వినియోగానికి, హానికరమైన ప్రచారాలకు పదే పదే పాల్పడుతున్న ఖాతాలపై, నెట్‌వర్క్‌లపై, అలాగే ప్రజలను తప్పుదారి పట్టించడానికి నటుల ఫోటోలు, గుర్తింపులను దుర్వినియోగం చేస్తున్న ఖాతాలపై ‘మా’ సమాచారాన్ని సేకరిస్తోందని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను.

ఇది విమర్శలను ఆపడం గురించి కాదు.

జవాబుదారీతనంపై ఆధారపడి పనిచేస్తున్నాం’’ అని నటుడు మంచు విష్ణు అన్నారు.

‘ప్రస్తుత డీప్‌ఫేక్ ఘటన ఈ విస్తృత చర్చను అత్యవసరంగా మార్చింది. దురదృష్టవశాత్తు, ఇదే చివరి డీప్‌ఫేక్ కాదు. ఒక వీడియోను తొలగించడం లేదా ఒక ఫిర్యాదు చేయడం సమస్యను పరిష్కరిస్తుందని మనం నమ్మలేనంత వేగంగా సాంకేతికత అభివృద్ధి చెందుతోంది’’ అని ఆందోళన వ్యక్తం చేశారు.

‘‘తెలుగు ఫిల్మ్ చాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, మా, స్టేక్‌హోల్డర్లు అందరూ కలిసి.. ఏఐ డీప్‌ఫేక్‌లు, గుర్తింపు దొంగతనం, హానికరమైన ప్రచారాలు, ఉద్దేశపూర్వక ఆన్‌లైన్ విధ్వంసాలను ఎదుర్కోవడానికి పరిశ్రమ కోసం శాశ్వత యంత్రాంగాన్ని రూపొందించాలని అభ్యర్థిస్తున్నాను’’ అని కోరారు.

ఏఐ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలేంటి?

ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ఎలాంటి చట్టం భారత్‌లో లేదు. దీనికి బదులుగా ఇప్పటికే ఉన్న చట్టాలు, మార్గదర్శకాలపై ఆధారపడిన విధానాన్ని అనుసరిస్తుంది.

కృత్రిమ మేధ (ఏఐ)తో రూపొందించిన డీప్‌ఫేక్‌ల వల్ల ముఖ్యంగా సాంకేతికత సాయంతో రూపొందించిన ఆడియో, వీడియో, సందేశాల వల్ల ఎదురయ్యే ప్రమాదాల పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని ఈ ఏడాది జులైలో ప్రభుత్వ వార్తా సంస్థ పీఐబీ తన రిపోర్టులో పేర్కొంది.

అందరికీ అందుబాటులో ఉండే, సురక్షితమైన, విశ్వసనీయమైన, జవాబుదారీతనం ఉన్న సైబర్‌స్పేస్‌ను వినియోగదారులకు అందించే లక్ష్యంతో భారత ప్రభుత్వం డీప్‌ఫేక్ విసురుతున్న సవాళ్లను పరిష్కరించేందుకు చట్టాలను, నిబంధనలను వర్తింపజేస్తుందని తెలిపింది.

అయితే, గుర్తింపును తస్కరించడం (సెక్షన్ 66సీ), మరొకరిగా నటించడం (సెక్షన్ 66డీ), గోప్యతా ఉల్లంఘనలు (సెక్షన్ 66ఈ), అశ్లీల లేదా అసభ్యకరమైన కంటెంట్‌ను ప్రచురించడం లేదా ప్రసారం చేయడం (సెక్షన్ 67,67ఏ) వంటివి ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2000 (ఐటీ యాక్ట్) కిందకు వస్తుందని తెలిపింది.

చట్ట విరుద్ధమైన చర్యలకు పాల్పడేందుకు ప్రేరేపిస్తున్న సమాచారాన్ని తొలగించడానికి ఇంటర్మీడియరీలకు నోటీసు జారీ చేసే నిబంధన (సెక్షన్ 79) కూడా దీనిలోనే ఉంది.

అలాగే, నేరాలను దర్యాప్తు చేయడానికి పోలీసులకు అధికారం కల్పించింది.

సోషల్ మీడియాను, ఇంటర్‌మీడియర్స్‌ను, డిజిటల్ న్యూస్, ఆన్‌లైన్ క్యురేటెడ్ కంటెంట్‌ను నియంత్రించేందుకు ఐటీ యాక్ట్ కింద ప్రభుత్వం ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్‌మీడియరీ గైడ్‌లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్‌ 2021ను తీసుకొచ్చింది.

డీప్‌ఫేక్‌లు, ఏఐతో రూపొందించిన కంటెంట్‌తో సహా సాంకేతిక సహకారంతో సృష్టించిన సమాచారం (ఎస్‌జీఐ) వల్ల ఎదురయ్యే ప్రమాదాలను పరిష్కరించడానికి 2026, ఫిబ్రవరి 10న ఐటీ నియమాలు-2021కి సవరణలు చేసి నియంత్రణలను ప్రభుత్వం మరింత బలోపేతం చేసింది.

అయితే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ప్రత్యేకంగా రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌ను భారత్‌కు తీసుకొచ్చే సమయం ఆసన్నమైందని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్ట్రీ (మైటీ) సెక్రటరీ ఎస్. కృష్ణన్ అన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రచురించింది. ''సమయం సరైనది అయినప్పుడు ఏఐ రెగ్యులేషన్ కోసం మేం చూస్తాం. సమయం ఆసన్నమైనట్లు అనిపిస్తుంది. మేం ఇక దీనిపై పని మొదలుపెడతాం'' అని అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)