నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్: ఉత్తమ నటులుగా మమ్ముట్టి, కార్తీక్ ఆర్యన్, యామీ గౌతమ్.. ఉత్తమ తెలుగు చిత్రం - కమిటీ కుర్రోళ్లు

ఫొటో సోర్స్, Facebook
భారతీయ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం శనివారం న్యూదిల్లీలో ప్రకటించింది.
ఈసారి ఉత్తమ నటుడి అవార్డును ఇద్దరు ప్రముఖ నటులు పంచుకున్నారు.
'భ్రమయుగం' చిత్రంలో నటనకు గానూ మలయాళ నటుడు మమ్ముట్టి, 'చందూ ఛాంపియన్' సినిమాలో నటనకు గానూ బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్‌ను ఈ అవార్డు సం వరించింది.
ఉత్తమ నటిగా యామి గౌతమ్ (ఆర్టికల్ 370) ఎంపికయ్యారు.
ఉత్తమ దర్శకుడిగా రాజ్‌కుమార్ పెరియాసామి (అమరన్) ఎంపికయ్యారు.

ఫొటో సోర్స్, Twitter@PinkElephant_P
ఉత్తమ తెలుగు చిత్రం : కమిటీ కుర్రోళ్లు
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ పురస్కారాల్లో 2024 సంవత్సరానికి గానూ మొత్తం 400లకు పైగా చిత్రాలు జ్యూరీ ముందుకు రాగా, వాటిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వాటిని ఎంపిక చేసినట్లు కమిటీ ప్రకటించింది.
ఈసారి జాతీయ అవార్డులలో తెలుగు చిత్ర పరిశ్రమ పలు విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకుంది.
'35 ఇది చిన్న కథ కాదు' ఉత్తమ బాలల చిత్రంగా ఎంపికవగా, అందులో నటించిన బాల నటుడు అరుణ్‌దేవ్‌కు ఉత్తమ బాలనటుడు అవార్డు దక్కింది.
'కమిటీ కుర్రోళ్లు' ఉత్తమ తెలుగు చిత్రంగా నిలవడమే కాకుండా, ఈ చిత్రానికి పి. రవికుమార్‌కు ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ అవార్డు లభించింది.

ఫొటో సోర్స్, Facebook/Sureshproductions
'కల్కి 2898 ఏడీ' ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా ఎంపికైంది. దీంతో పాటు ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ (నితిన్ జిహానీ చౌదరి) అవార్డును కూడా గెలుచుకుంది.
'పుష్ప 2' చిత్రం కోసం దర్శకుడు సుకుమార్ ఉత్తమ స్క్రీన్‌ప్లే రైటర్(ఒరిజినల్) అవార్డు గెలుచుకోగా , ఇదే చిత్రానికి దీపాలి నూర్, శీతల్ శర్మలకు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్లుగా అవార్డు దక్కింది.
దుల్కర్ సల్మాన్ నటించిన 'లక్కీ భాస్కర్' చిత్రానికి గాను వెంకీ అట్లూరి ఉత్తమ సంభాషణల రచయితగా అవార్డును గెలుచుకున్నారు.

ఫొటో సోర్స్, FB/iKamalHaasan
జాతీయ అవార్డుల విజేతలు వీరే..
ఉత్తమ చిత్రం - ఆర్టికల్ 370
ఉత్తమ నటుడు - మమ్ముట్టి, కార్తీక్ ఆర్యన్ (సంయుక్తంగా)
ఉత్తమ నటి - యామీ గౌతమ్ (ఆర్టికల్ 370)
ఉత్తమ దర్శకుడు - రాజ్‌కుమార్ పెరియస్వామి (అమరన్)
ఉత్తమ నేపథ్య గాయని - వైకోం విజయలక్ష్మి (ఏఆర్‌ఎం)
ఉత్తమ నేపథ్య గాయకుడు - అభయ్ జోధ్ పుర్కర్
ఉత్తమ సినిమాటోగ్రఫర్ - జలాల్ (భ్రమయుగం)
ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రం - కెప్టెన్ మిల్లర్ (తమిళం)
బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ - నితిన్ జిహానీ చౌదరి (కల్కి 2798 ఏడీ)
బెస్ట్ ఎడిటర్ - కలైవన్నన్ (అమరన్)
బెస్ట్ సౌండ్ డిజైనర్ - మానస్ చౌదరి (భూల్ బులియా)
బెస్ట్ స్క్రీన్‌ప్లే రైటర్ - యోగేశ్ దేశ్‌పాండే
ఉత్తమ పాటల రచయిత – మనోజ్ ముంతాసిర్ (మైదాన్)
ఉత్తమ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ – జీవీ ప్రకాశ్ కుమార్ (అమరన్)
ఉత్తమ సంగీత దర్శకుడు (పాటలు) - శశ్వంత్ సచ్‌దేవ్ (ఆర్టికల్ 370)
ఉత్తమ తెలుగు చిత్రం - కమిటీ కుర్రోళ్లు
ఉత్తమ మేకప్ - పి.రవికుమార్ (కమిటీ కుర్రోళ్లు)
బెస్ట్ డైలాగ్ రైటర్ - వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)
బెస్ట్ స్క్రీన్‌ప్లే రైటర్ (ఒరిజనల్) - సుకుమార్ (పుష్ప-2)
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ - దీపాలి నూర్, శీతల్ శర్మ (పుష్ప-2)
ఉత్తమ బాలల చిత్రం - 35 చిన్న కథ కాదు
ఉత్తమ పాపులర్ చిత్రం - కల్కి 2798 ఏడీ
ఉత్తమ తమిళ చిత్రం - రాయన్
ఉత్తమ మలయాళ చిత్రం - ఫెమినిస్ట్ ఫాతిమా
ఉత్తమ కన్నడ చిత్రం - మిథ్య (ఇల్యూజన్)
ఉత్తమ హిందీ చిత్రం - శ్రీకాంత్
ఉత్తమ గుజరాత్ చిత్రం - మారన్ (ద హంట్)
ఉత్తమ బెంగాలీ చిత్రం - చల్‌చిత్ర ఎఖో
వీటితో పాటు ఆయా సినిమాలకు వివిధ కేటగిరీల్లో అవార్డులు దక్కాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
































