తిరుపతి: శ్రీ సిటీలో వాటర్ బాయిలర్ పేలుడు ఘటనలో నలుగురు కార్మికులు మృతి

శ్రీసిటీలో పేలుడు
ఫొటో క్యాప్షన్, పేలుడు ధాటికి ధ్వంసమైన ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాలు
ప్రచురణ
చదివే సమయం: 2 నిమిషాలు

తిరుపతి జిల్లా శ్రీసిటీలో ఉన్న టిల్ హెల్త్ కేర్ ఇండస్ట్రీస్‌లో శనివారం ఉదయం వాటర్ బాయిలర్ పేలుడు సంభవించింది.

ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందారని పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.

ఈ ఘటనలో మరో కార్మికుడు తీవ్రగాయపడి చికిత్స పొందుతున్నారు.

పేలుడు జరిగిన ప్రదేశంలోనే ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారని పీటీఐ పేర్కొంది.

తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందినట్లు పీటీఐ వెల్లడించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీసిటీలో పేలుడు
ఫొటో క్యాప్షన్, శ్రీసిటీలోని టిల్ హెల్త్‌కేర్ ఇండస్ట్రీస్‌లో ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో మరో 10 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.

వారిని చికిత్స కోసం శ్రీ సిటీ ఆస్పత్రికి తరలించారు.

తీవ్రంగా గాయపడిన వారిని చెన్నై కి తరలించారు.

శ్రీసిటీలో పేలుడు
ఫొటో క్యాప్షన్, ప్రమాద స్థలంలో కంపెనీ ఉద్యోగులు

ఈ ఘటనపై ఏపీ మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.

బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు.

శ్రీసిటీలో పేలుడు
ఫొటో క్యాప్షన్, ఫ్యాక్టరీలో ధ్వంసమైన ఒక భాగం

పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. మృతి చెందిన కార్మికుల వివరాలు కూడా అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.

శ్రీసిటీలో పేలుడు UGC
ఫొటో క్యాప్షన్, శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది.

శ్రీ సిటీ ప్రత్యేక ఆర్థిక మండలిలోని టిల్ హెల్త్ కేర్ పరిశ్రమలో శనివారం ఉదయం సంభవించిన భారీ పేలుడు ఘటనపై తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు.

(ఈ కథనం అప్‌డేట్ అవుతోంది.)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)