కరీంనగర్: కాలిపోయిన తెలంగాణ ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు
ప్రయాణికులతో వెళ్తున్న తెలంగాణ ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కరీంనగర్ జిల్లాలో అగ్నిప్రమాదానికి గురైంది. కరీంనగర్ నుంచి సికింద్రాబాద్ జేబీఎస్‌కు వెళ్తుండగా అలుగునూరు దగ్గర బస్సుకు మంటలు అంటుకున్నాయి.
ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు.
కాలిన వాసన రావడంతో బస్సును నిలిపివేసిన డ్రైవర్ అప్రమత్తం చేయడంతో వారంతా సురక్షితంగా బయటపడ్డారు. నిముషాల వ్యవధిలోనే బస్సుకు మంటలు వ్యాపించాయి.
ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేలోపే బస్సు పూర్తిగా కాలిపోయింది.
ఉదయం 8 గంటలకు బస్సు బయల్దేరిన తర్వాత 15 నిమిషాలకే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెప్పారు. బస్సు ప్రమాదంతో ఆ మార్గంలో కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









