You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పారిస్: హింసాత్మకంగా మారిన ఫుట్‌బాల్ అభిమానుల సంబరాలు - 9 ఫోటోల్లో..
ఛాంపియన్స్ లీగ్ ఫైనల్ మ్యాచ్‌లో ఆర్సెనల్‌పై పారిస్ సెయింట్ జెర్మైన్ (పీఎస్జీ) జట్టు విజయానంతరం ఫ్రాన్స్‌లో ఫుట్‌బాల్ అభిమానులు, పోలీసుల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ అల్లర్లలో 400 మందికి పైగా అరెస్టయ్యారు.
పారిస్ నగరంలో బస్సులు, రైళ్లు, మెట్రో సేవలకు అంతరాయం కలిగింది.
అభిమానులు టపాసులు, ఫ్లేర్స్ వెలిగించడంతో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
గత ఏడాది పీఎస్జీ ట్రోఫీ గెలిచినప్పుడు కూడా ఇలాగే హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే, ఈసారి అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారని, పకడ్బందీగా వ్యవహరించినట్లు ఫ్రాన్స్ ఇంటీరియర్ మినిస్టర్ లారెంట్ న్యూనెజ్ తెలిపారు.
పీఎస్జీ విజయానంతరం, పారిస్‌లోని ప్రముఖ షాంప్స్ ఎలిసీ వీధి అభిమానులతో నిండిపోయింది. పెనాల్టీ షూటౌట్లో ఫ్రెంచ్ జట్టు గెలవగానే వేలాది మంది వీధుల్లోకి వచ్చేశారు.
అభిమానులు ఫ్లేర్స్ వెలిగించడం, రోడ్లపై ఎలక్ట్రిక్ బైకులు కాలిపోవడం, ఒక దుకాణం అద్దాలు పగలగొట్టడం వంటి దృశ్యాలు కనిపించాయి.
పోలీసులు తెలిపిన ప్రకారం.. ఈ అల్లర్లలో ఆరు వాహనాలు, రెండు దుకాణాలు, ఒక బస్ షెల్టర్ దెబ్బతిన్నాయి.
ఆదివారం తెల్లవారుజామున 416 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)