తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు.. 12 ఫోటోల్లో..

ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం జిల్లా ఎటపాక మండలం బుట్టాయగూడెంలో అత్యధికంగా 45.65 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ పేర్కొంది.

తెలంగాణలో ఇవాళ (మే 23వ తేదీన) మంచిర్యాల జిల్లాలో అత్యధికంగా 45.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతున్నట్లు రాష్ట్ర డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ అంచనా వేసింది.

పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ళలో, ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామలోని తొర్రగుడిపాడులో, తూర్పు గోదావరి జిల్లా గోపాలపురంలోని చిట్యాలలో 45 డిగ్రీల సెల్సియస్ పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

కుమురం భీమ్, పెద్దపల్లి, జయశంకర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కూడా 45 డిగ్రీల సెల్సియస్ పైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు ఈ డేటాలో వెల్లడైంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)