టైఫూన్ డాల్ఫిన్: సుమారు 10 లక్షలమందిని కదిలించిన తుపాను తీవ్రత 11 ఫోటోలలో..

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, కెల్లీ యంగ్
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
డాల్ఫిన్ తుపాను తీరం దాటడంతో అధికారులు చైనా ఆర్థిక రాజధాని షాంఘైతో పాటు తూర్పు చైనా నుంచి పదిలక్షలమందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
తుపాను కారణంగా భారీవర్షాలు కురిశాయి. రవాణా స్తంభించిపోయింది. కేవలం ఒక్క షాంఘైలోనే సోమవారం దాదాపు వెయ్యి విమానాలను రద్దు చేశారు.
డాల్ఫిన్ తుపాను కారణంగా కుంభవృష్ఠి కురుస్తుందని, వరదలు, కొండచరియలు విరిగి పడే ముప్పు ఉందని అధికారులు నిరంతరం హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
ఇంతకుముందు డాల్ఫిన్ తుపానుకు సంబంధించి హై లెవెల్ రెడ్ అలర్ట్ జారీ చేశారు చైనా అధికారులు.
ఈ ఏడాది చైనాను తాకిన తుపానుల్లో ఇదే అత్యంత బలమైనదిగా అధికారులు పేర్కొన్నారు.


ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో సోర్స్, Reuters
ఆదివారం సాయంత్రం జెజియాంగ్ ప్రావిన్స్‌లోని యుహువాన్ వద్ద డాల్ఫిన్ తొలిసారి తీరాన్ని తాకింది. ఆ సమయంలో గరిష్ఠంగా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
దాదాపు గంట తర్వాత వెన్‌జౌ నగరం వద్ద తుపాను రెండోసారి తీరాన్ని తాకిందని వాతావరణ అధికారులు తెలిపారు.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో సోర్స్, Reuters
సోమవారం షాండాంగ్, హెనాన్, హుబే, అన్హుయ్, జియాంగ్సు, జెజియాంగ్ ప్రావిన్సులతో పాటు షాంఘై నగరంలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

ఫొటో సోర్స్, Getty Images
రాబోయే కొన్ని రోజుల్లో జెజియాంగ్‌లోని కొన్ని ప్రాంతాల్లో 250 మిల్లీమీటర్ల నుంచి 500 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
జెజియాంగ్‌లోని మరో నగరం వెన్‌జౌలో సుమారు 9 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 1,000కు పైగా అత్యవసర ఆశ్రయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తైజౌ నగరంలో సుమారు 3.9 లక్షల మందిని వారి ఇళ్ల నుంచి తరలించారు.

ఫొటో సోర్స్, Getty Images
డాల్ఫిన్ తుపాను తీరాన్ని తాకడానికి ముందు 6,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది.
సాధారణంగా ఒక టైఫూన్ ఉండే కాలంతో పోలిస్తే, ఇది మూడింతల ఎక్కువని చైనా ప్రభుత్వ ప్రసార సంస్థ సీసీటీవీ తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Reuters
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























