అక్రమ మద్యం దుకాణంపై దాడి చేసి, ధ్వంసం చేసిన మహిళలు
అక్రమ మద్యం దుకాణంపై దాడి చేసి, ధ్వంసం చేసిన మహిళలు
తమిళనాడులోని ధర్మపురి జిల్లాలోని పెన్నాగరం గ్రామంలో ఏర్పాటు చేసిన అక్రమ మద్యం దుకాణాన్ని జనం ధ్వంసం చేశారు.
పెన్నాగరం, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో దుకాణాలు ఏర్పాటు చేసి, టాస్మాక్ అంటే తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి మద్యం కొనుగోలు చేసి, దానిని అక్రమంగా అధిక ధరలకు విక్రయిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.
దీంతో పెన్నాగరం సమీపంలోని పోతూర్ గ్రామంలో నిర్వహిస్తున్న అలాంటి ఒక షాపును ధ్వంసం చేశారు. అక్రమంగా మద్యం అమ్మినందుకు గానూ ఈ కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









