'మేం 83 మంది కలిసే ఉంటాం, రోజూ 50 కేజీల బియ్యం వండుకుంటాం'

వీడియో క్యాప్షన్, మేం 83 మంది కలిసే ఉంటాం, రోజూ 50 కేజీల బియ్యం కావాలి
'మేం 83 మంది కలిసే ఉంటాం, రోజూ 50 కేజీల బియ్యం వండుకుంటాం'
ప్రచురణ

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఆరు తరాల ఒక పెద్ద ఉమ్మడి కుటుంబం ఉంది. ఈ ఇంట్లో ఒక రోజు వంటకు 50 కిలోల బియ్యం బస్తా అవసరమవుతుంది.

ఆదివారం నాన్‌వెజ్ తినాలంటే ఒక పొట్టేలు కోయాల్సిందే. ఎప్పుడైనా సాయంత్రం బజ్జీలు తిందామనుకుంటే 15 కిలోల పిండి సిద్ధం చేయాల్సిందే. ఎందుకంటే ఆ కుటుంబంలో పదీఇరవై మంది కాదు, ఏకంగా 83 మంది ఉంటారు.

ఈ ఉమ్మడి కుటుంబంతో ఒక రోజంతా గడపడానికి 'బీబీసీ' బృందం కుర్లపల్లి చేరుకుంది. అక్కడ అంతమంది సభ్యులు ఉమ్మడిగా కలిసి ఎలా ఉంటున్నారు, ఏం పనులు చేస్తారో తెలుసుకుంది.

కల్యాణదుర్గం నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో కుర్లపల్లి ఉంటుంది.

అనంతపురం జిల్లాలో ఆరు తరాల ఒక పెద్ద ఉమ్మడి కుటుంబం

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)