తిరువనంతపురం: దంచి కొట్టిన కోహ్లీ.. వన్డేల్లో 55వ సెంచరీ, శతకం బాదిన శుభ్‌మన్ గిల్ , వెస్టీండీస్‌పై భారత్ గెలుపు

ఫొటో సోర్స్, Getty Images
తిరువనంతపురం గ్రీన్‌ఫీల్డ్ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
296 పరుగుల లక్ష్యంతో దిగిన భారత జట్టు 41.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి టార్గెట్ ఛేదించింది. విరాట్ కోహ్లీ(139), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (110) సెంచరీలతో రాణించారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శుభ్ మన్ గిల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అయితే, విండీస్ ఓపెనింగ్ జోడీ జాన్ క్యాంప్‌బెల్ (62), జస్టిన్ గ్రీవ్స్‌లు భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ తొలి వికెట్‌కు 135 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.


ఫొటో సోర్స్, ANI
అయితే, 20వ ఓవర్లో క్యాంప్‌బెల్‌ను కుల్దీప్ యాదవ్ ఔట్ చేసి, భారత్‌కు తొలి వికెట్ అందించాడు. ఆ తర్వాత కెప్టెన్ షయ్ హోప్ (12), జస్టిన్ గ్రీవ్స్ (101) , జ్యువెల్ ఆండ్రూ (0)లను స్వల్ప వ్యవధిలో పెవిలియన్ పంపాడు. దీంతో, 176/2 స్కోరుతో పటిష్ఠంగా ఉన్న విండీస్.. ఒక్కసారిగా 198/5కి చేరింది.
చివర్లో అమీర్ జంగూ (58 నాటౌట్) రాణించడంతో విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీయగా, ప్రసిద్ధ్ కృష్ణ 2, నితీశ్ రెడ్డి ఒక వికెట్ పడగొట్టారు.
296 పరుగుల ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(32) ఉన్నంతసేపు ఆకట్టుకున్నాడు. ఇక మరో ఓపెనర్ గిల్ దూకుడైన ఆటతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు.
రోహిత్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన విరాట్ కూడా వేగంగా ఆడాడు. రెండో వికెట్‌కు 151 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడీని రోస్టన్ విడదీశాడు. గిల్ ఔటయ్యాక మరింత వేగంగా ఆడిన కోహ్లీ.. సిక్సర్లతో అభిమానులను అలరించాడు.
మోతీ ఓవర్లో బంతిని లాంగ్ ఆన్‌లో స్టాండ్స్‌లోకి పంపిన విరాట్.. వన్డేల్లో 55వ శతకం అందుకున్నాడు. సెంచరీ తర్వాత మరింత దూకుడుగా ఆడిన కోహ్లీ.. కార్టీ వేసిన 42వ ఓవర్లో సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు.

ఫొటో సోర్స్, R.Satish BABU / AFP via Getty Images
నా ఫోకస్ మైలురాళ్లపై ఉండదు: కోహ్లీ
"నా ఫోకస్ ఎప్పుడూ మైలురాళ్లపై ఉండదు. మ్యాచ్ పరిస్థితిని బట్టి జట్టు కోసం ఆడటమే. ఇన్నాళ్లుగా క్రికెట్ ఆడుతున్నందుకు నిజంగా అదృష్టంగా భావిస్తున్నా" అని మ్యాచ్ అనంతరం కోహ్లీ అన్నాడు.
"కెరీర్‌లో ఈ స్టేజ్‌లో నా గేర్ మార్చాల్సిన సవాలు ఎదురైంది. ఇంకొంచెం అగ్రెసివ్‌గా ఆడటం నాకు ఉత్సాహాన్నిస్తుంది. స్వేచ్ఛగా ముందుకెళ్లాలంటే ఫిట్‌నెస్ చాలా అవసరం. అప్పుడే నేను ఎలా ఆడాలో ఊహించుకుని, ఈ రోజులా మైదానంలో ఆచరణలో పెట్టగలను" అన్నాడు.
"మైదానంలో అడుగుపెట్టాక బయటి విషయాల గురించి ఆలోచించకూడదు. శాయశక్తులా పోరాడాలి, అక్కడ ఎలాంటి సాకులకు తావులేదు. ప్రపంచ కప్‌కు ఇంకా ఏడాది సమయం ఉంది, నా లక్ష్యం ఏమిటో నాకు తెలుసు" అన్నాడు కోహ్లీ.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























