ఇండోనేషియా: అనక్ క్రాకటోవా అగ్నిపర్వతం బద్దలయ్యాక అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో కళ్లకు కట్టే 7 ఫోటోలు ఇవే...

ఏరియల్ వ్యూ

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, అనక్ క్రాకటోవా అగ్నిపర్వతం పేలుడు శబ్ధాలు 700 కిలోమీటర్ల దూరం వరకు వినిపించాయని మీడియా రిపోర్ట్ చేసింది. అగ్నిపర్వతం ఏరియల్ వ్యూను ఇండోనేషియా జియాలాజికల్ ఏజెన్సీ విడుదల చేసింది.
ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు

ఇండోనేషియాలోని అనక్ క్రాకటోవా అగ్నిపర్వతం బద్దలై మూడు రోజులవుతున్నా దాని ప్రభావం పూర్తిగా తగ్గలేదు.

ఈ పేలుళ్ల ప్రభావం ప్రధానంగా రాజధాని జకార్తాతోపాటు లాంపాంగ్ ప్రావిన్స్ పై అధికంగా కనిపిస్తోంది.

ముఖ్యంగా విమాన సర్వీసులపై ఈ ప్రభావం ఎక్కువగా పడింది.

సుమారు 3,000 విమాన సర్వీసులు నిలిచిపోయాయి.

దాదాపు 340,000 మందికి పైగా పాసింజర్లు వివిధ విమానాశ్రాయల్లో చిక్కుకు పోయారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఇండోనేషియ

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, బందర్ లాంపాంగ్ ప్రావిన్స్ లో ఫైర్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది ఇలా వీధుల్లో నీళ్లు చల్లుతు బూడిదను తొలగించే ప్రయత్నం చేశారు.
అగ్నిపర్వతం

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, పసౌరాన్ గ్రామంలోని మసీదును ముంచెత్తిన బూడిదను తొలగిస్తున్న వ్యక్తిని ఈ ఫోటోలో చూడవచ్చు. ప్రస్తుతానికి ఈ ప్రాంతంలో లావా తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టినట్టు స్థానికులు చెబుతున్నారు.
విమానాశ్రయం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అగ్నిపర్వతం పేలుడు ప్రభావంతో వేలకొద్దీ విమాన సర్వీస్‌లను తాత్కాలికంగా రద్దు చేశారు. దీంతో పలు విమానాశ్రయాలలో చిక్కుకుపోయిన ప్రయాణికులు రీఫండ్‌ కోసం ఎదురు చూస్తున్నారు.
మౌంట్ అనక్ క్రాకటోవా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పార్క్ చేసిన విమానాల ఇంజిన్లు పాడవకుండా రక్షించడం విమానాశ్రయ సిబ్బందికి తక్షణ కర్తవ్యంగా మారింది. అందుకే ప్రత్యేకమైన రక్షణ కవర్‌లతో వాటిని కప్పి ఉంచుతున్నారు.
ప్రయాణికులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గమ్యస్థానాలకు వెళ్లే విమానాలు రద్దు కావడంతో కొందరు ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే కార్డ్స్ ఆడుతూ కాలక్షేపం చేస్తున్నారు. మరికొందరు తాము కూర్చున్న చోటే కునుకు తీస్తూ కనిపిస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)