సర్దార్ 2: కార్తీ ద్విపాత్రాభినయం, ఎస్‌జే సూర్య విలనిజం మెప్పించాయా

sardar 2

ఫొటో సోర్స్, Prince Pictures/facebook

    • రచయిత, జీఆర్ మ‌హ‌ర్షి
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 3 నిమిషాలు

కార్తీ సినిమాల‌కి తెలుగులో మంచి ఆద‌ర‌ణ ఉంది. స‌ర్దార్ హిట్ త‌ర్వాత అదే డైరెక్ట‌ర్ పీఎస్ మిత్ర‌న్ స‌ర్దార్‌-2 తీశారు. భారీ అంచ‌నాలున్న ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

పార్ట్ -1లో స‌ర్దార్‌పై దేశ ద్రోహి ముద్ర ప‌డుతుంది. చ‌నిపోయారనే అంద‌రూ అనుకుంటారు. కానీ, కొడుకు విజ‌య్ మాత్రం తండ్రి బ‌తికున్నాడ‌నే న‌మ్ముతుంటాడు.

స‌ర్దార్ -2 ప్రారంభ‌మే ఒక రా ఏజెంట్‌ని వెత‌క‌డంతో మొద‌ల‌వుతుంది. మైసూర్‌లో మిస్స‌యిన అత‌న్ని విజ‌య్ (కార్తీ) బృందం క‌నిపెడుతుంది.

ఆ ఏజెంట్‌ని కొంత మంది వెంటాడుతూ ఉంటారు. అత‌ను చ‌నిపోతూ ఒక క‌త్తి లాంటి సాధ‌నాన్ని ఇస్తూ ప్ర‌పంచం ప్ర‌మాదంలో ఉందని హెచ్చ‌రిస్తాడు.

ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంటుంది. మరోవైపు అదే ఆయుధంతో ప్ర‌పంచాన్ని నాశ‌నం చేయాల‌ని బ్లాక్ డాగ‌ర్ (ఎస్‌జే సూర్య‌) అనే అంత‌ర్జాతీయ డాన్ వెతుకుతూ వుంటాడు.

అత‌నికి ద‌క్క‌కుండా విజ‌య్ బృందం ఏం చేసింది? 35 ఏళ్ల క్రితం ఈ వెపెన్‌కి స‌ర్దార్‌కి సంబంధం ఏంది? అస‌లు స‌ర్దార్ బ‌తికే వున్నాడా? ఇది మిగ‌తా క‌థ‌.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సర్దార్ 2 మూవీ రివ్యూ

ఫొటో సోర్స్, Insta/ashika_rangnath

వరుసగా యాక్షన్ సన్నివేశాలు

మూడు గంట‌ల నిడివి ఉన్న ఈ సినిమాలో వ‌రుస‌గా యాక్ష‌న్‌ స‌న్నివేశాలే ఉంటాయి. విమానం, రైలు, కేబుల్ కార్‌, పురాత‌న కోట‌లోని సొరంగం ఇలా అనేక ప్రాంతాల్లో ఫైట్స్, గ‌న్స్‌తో కాల్చుకోవ‌డం ఉంటాయి. క‌థ‌లో ఏ ర‌క‌మైన ఎమోష‌న్స్ ఉండ‌వు.

పాట‌లు, ల‌వ్‌ట్రాక్ లేక‌పోవ‌డం రిలీఫ్ అయినా, వ‌రుస‌గా ఛేజ్‌లు, ఫైట్స్ వ‌స్తూ ఉంటే ఒక ద‌శ‌లో వీడియో గేమ్ చూస్తున్నామా? అనే సందేహం కూడా వ‌స్తుంది. మూడు క‌త్తుల‌తో తాళం తీయ‌డం చూస్తే, వెనుక‌టికి మోస‌గాళ్ల‌కి మోస‌గాడు గుర్తుకొచ్చింది. దాంట్లో నిధి తెర‌వాలంటే ఐదు తాళాలు కావాలి.

రెండు పాత్ర‌ల్లో కార్తీ చాలా బాగా న‌టించాడు. ఆ తేడా చూపించాడు. అయితే క‌థ‌లో ద‌మ్ము లేక‌పోవ‌డంతో వృథా అయ్యింది. మాళ‌విక మోహ‌న‌న్‌, నాజ‌ర్‌, ఆషికా జ‌స్ట్ ఓకే. యోగిబాబు అక్క‌డ‌క్క‌డ న‌వ్వించాడు.

సర్దార్ 2 మూవీ రివ్యూ

ఫొటో సోర్స్, Insta/ashika_rangnath

ఎస్‌జే సూర్య ఎంట్రీ

ప్ర‌త్యేకంగా చెప్పాల్సింది ఎస్‌జే సూర్య గురించి. భారీ బిల్డ‌ప్‌తో ఆకాశంలో ఉన్న క్రేన్ నుంచి రోప్స్ క‌ట్టుకుని మ‌రీ ఎంట్రీ ఇస్తాడు. త‌ర్వాత అంతా అరుపులు, కేక‌లే. ఈ త‌ర‌హా శ‌బ్దం చేసే విల‌న్ పాత్ర‌లు ఆయ‌నే గ‌తంలో ఎన్నో సినిమాల్లో చేశాడు.

ప్రొడ‌క్ష‌న్ వ్యాల్యూస్ బాగా రిచ్‌గా ఉన్న సినిమాలో మ్యూజిక్ గురించి ఎంత త‌క్కువ చెబితే అంత మంచిది.

ప్ల‌స్ పాయింట్

సూర్య‌, కార్తీ న‌ట‌న‌

మైనస్ పాయింట్స్

చాలా ఉన్నాయి.

(గమనిక: అభిప్రాయాలు సమీక్షకుల వ్యక్తిగతం)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)