విమానం గాల్లో ఉండగా పైలట్ల మధ్య గొడవ.. సౌదీలో ఆకస్మికంగా దిగిన ఫ్లైట్

ఫొటో సోర్స్, Getty Images
దుబయి నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబయి ప్రయాణికుల విమానాన్ని బుధవారం ఉదయం సౌదీ అరేబియాకు మళ్లించి, అక్కడే బలవంతంగా దించారు.
విమాన ప్రయాణ సమయంలో పైలట్ల మధ్య గొడవ జరిగిందని, ఆ తర్వాత విమానం అత్యవసర కోడ్‌ను పంపడంతో హైజాక్ అయిందనే భయాందోళనలు కొద్దిసేపు తలెత్తాయని ఇజ్రాయెల్ మీడియా నివేదించింది.
ఎఫ్‌జెడ్1073 పేరుతో నడుస్తోన్న ఈ విమానంలో సుమారు 180 మంది ఇజ్రాయెల్ ప్రయాణికులు ఉన్నారు.
ఈ విమానం తొలుత స్క్వాక్ కోడ్ 7700 పంపింది. ఇది జనరల్ ఎమర్జెన్సీని సూచిస్తోంది. ఆ తర్వాత, విమానంలోకి అనధికారిక జోక్యాన్ని సూచిస్తూ ఆ కోడ్‌ను 7500కు మార్చారు. అనంతరం ఆ విమానం తిరిగి తన ప్రారంభ కోడ్ 7700ను పంపింది.
ఈ సంఘటనతో, అత్యవసర పరిస్థితికి సన్నద్ధతగా ఇజ్రాయెల్ వైమానిక దళం తన అప్రమత్తత స్థాయిని పెంచిందని జెరూసలేం పోస్ట్ నివేదించింది.

సౌదీ అరేబియా వైపు అకస్మాత్తుగా దిశ మార్చుకుని కిందికి దిగిన కొద్దిసేపటికే ఆ విమానం సుమారు ఏడు నిమిషాల పాటు అత్యవసర సంకేతాన్ని జారీ చేసిందని ఫ్లైట్ రాడార్24 నుంచి అందిన డేటాలో తెలిసింది.
"విమానం గాలిలో ప్రయాణిస్తుండగా ఇద్దరు పైలట్లు ఘర్షణకు దిగినట్లు తెలుస్తోంది. దీంతో మధ్యప్రాచ్యం అంతటా హై అలర్ట్ ప్రకటించారు" అని ఇజ్రాయెల్ బ్రాడ్‌కాస్టర్ ఎన్12 న్యూస్ చీఫ్ పొలిటికల్ అనలిస్ట్ అమిత్ సెగల్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో రాశారు.
ఈ కామెంట్‌ను రీపోస్టు చేసిన ఇజ్రాయెల్‌లోని అమెరికా అంబాసిడర్ మైక్ హకాబీ, ''ఈ ఉదయం జరిగిన సంఘటన మధ్యప్రాచ్యం అంతటా, ముఖ్యంగా ఇజ్రాయెల్‌లో పౌరులను, భద్రతా సంస్థలను అప్రమత్తతకు గురిచేసింది. పరిస్థితి మరింత ముదరకపోవడం మంచి విషయం. కానీ, విమానం గాలిలో ప్రయాణిస్తుండగా పైలట్లు ఘర్షణకు దిగి, విమానాన్ని దారి మళ్లించాల్సి రావడం అనేది కచ్చితంగా సాధారణంగా జరిగే విషయం కాదు'' అని రాశారు.
ఈ గొడవ తర్వాత పైలట్లు ఎమర్జెన్సీ సిగ్నల్స్ పంపించారని రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీకి ఈ విషయం తెలిసిన ఇజ్రాయెలీ అధికారులు తెలిపారు.
అయితే, పైలట్ కావాలనే ఎమర్జెన్సీ సిగ్నల్ పంపారా? అన్న విషయం తెలియలేదు.
అంతకుముందు, అధికారులతో ఈ విమాన ప్రయాణం గురించి ప్రధానమంత్రి నెతన్యాహు చర్చించారని ముగ్గురు ఇజ్రాయెల్ భద్రతా అధికారులు రాయిటర్స్‌కు తెలిపారు.
ఆర్మీ చీఫ్ అయాల్ జమీర్ కూడా వైమానిక దళ కమాండర్, ఇతర సైనిక అధికారులతో పరిస్థితిని సమీక్షించారని ఇజ్రాయెల్ సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది.
దుబయి, టెల్ అవీవ్ మధ్య ఫ్లైదుబయి ప్రతిరోజూ విమానాలను నడుపుతుంది. ఈ రూట్ ఇజ్రాయెల్ పౌరులలో చాలా ప్రాచుర్యం పొందింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























