మట్టిలో భవనాలు.. తవ్వేకొద్దీ మృతదేహాలు.. వయనాడ్‌‌‌లో భయానక దృశ్యాలు

వయనాడ్
ఫొటో క్యాప్షన్, కొండచరియలు విరిగిపడడంతో ధ్వంసమైన చూరల్మలై
ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు

కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 150 దాటింది. భారీ వర్షాల కారణంగా మెప్పాడి, చూరల్మలై, ముండక్కే, అట్టామలై తదితర ప్రాంతాల్లో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి.

ఇళ్లు, దుకాణాలు, పాఠశాలలు సహా అనేక భవనాలు మట్టిలో కూరుకుపోయాయి.

ఆర్మీ, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఫైర్ డిపార్ట్‌మెంట్, స్థానికులు రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు. మట్టిలో కూరుకుపోయిన వారి కోసం తవ్వుతున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి.

వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రమాద తీవ్రతను ఈ ఫోటోలు తెలియజేస్తున్నాయి..

బీబీసీ న్యూస్ తెలుగు
వయనాడ్
ఫొటో క్యాప్షన్, వరద, కొండచరియలు విరిగిపడిన ప్రమాదంలో చిక్కుకున్న కారు
వయనాడ్
ఫొటో క్యాప్షన్, చూరల్మలైలోని ఒక పాఠశాల వద్ద ప్రమాద తీవ్రతను ఈ ఫోటో తెలియజేస్తోంది
వయనాడ్
ఫొటో క్యాప్షన్, కొండచరియలు విరిగిపడడంతో మట్టిలో కూరుకుపోయిన జీపు
వయనాడ్
ఫొటో క్యాప్షన్, చూరల్మలైలో దెబ్బతిన్న ఇల్లు
వయనాడ్
ఫొటో క్యాప్షన్, బురదలో కూరుకుపోయిన ఇళ్లలోని వారి కోసం గాలిస్తున్న సహాయక బృందాలు
వయనాడ్
ఫొటో క్యాప్షన్, రెస్క్యూ ఆపరేషన్ కోసం తిరువనంతపురం విమానాశ్రయం నుంచి వయనాడ్‌కు బయలుదేరిన సైనికులు
వయనాడ్
ఫొటో క్యాప్షన్, చూరల్మలైలో మట్టిలో కూరుకుపోయిన వ్యక్తిని కాపాడుతున్న రెస్క్యూ టీం
వయనాడ్
ఫొటో క్యాప్షన్, ఒక వ్యక్తిని కాపాడి వీపుపై మోసుకొస్తున్న భద్రతా సిబ్బంది
వయనాడ్
ఫొటో క్యాప్షన్, రోప్ సాయంతో రెస్క్యూ ఆపరేషన్
వయనాడ్
ఫొటో క్యాప్షన్, పొంగిపొర్లుతున్న నదిపై రోప్‌ సాయంతో సహాయక చర్యలు
వయనాడ్
ఫొటో క్యాప్షన్, సహాయక చర్యల్లో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు