గుడ్‌నైట్.
ఈ లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం.
ఈరోజు ముఖ్యమైన వార్తలు కొన్నింటిని ఇక్కడ చూడండి.
"దిల్లీ పోలీసులు అభిజీత్ దీప్కేను గుర్తుతెలియని ప్రదేశానికి తీసుకెళ్లారు. ఆయనతో మాకు సంబంధాలు తెగిపోయాయి. లాయర్లతో మాట్లాడడానికి కూడా ఆయన్ను అనుమతించడం లేదు. అసలు త్రివర్ణ పతాకం పట్టుకుని వెళ్లడం నేరం ఎలా అవుతుంది?"
గుడ్‌నైట్.
ఈ లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం.
ఈరోజు ముఖ్యమైన వార్తలు కొన్నింటిని ఇక్కడ చూడండి.

ఫొటో సోర్స్, ANI
అభిజీత్ దీప్కేను తన లాయర్లతో మాట్లాడనివ్వడం లేదని కాక్రోచ్ జనతా పార్టీ ఆరోపించింది.
"దిల్లీ పోలీసులు అభిజీత్ దీప్కేను గుర్తుతెలియని ప్రదేశానికి తీసుకెళ్లారు. ఆయనతో మాకు సంబంధాలు తెగిపోయాయి. లాయర్లతో మాట్లాడడానికి కూడా ఆయన్ను అనుమతించడం లేదు. ఈ ప్రభుత్వం యువతతో ఉగ్రవాదుల మాదిరిగా ఎందుకు వ్యవహరిస్తోంది" అని ‘ఎక్స్’లోచేసిన పోస్ట్‌లో సీజేపీ ప్రశ్నించింది.
‘‘భారత పౌరులం. రాజ్యాంగం హామీ ఇచ్చిన అన్ని రక్షణలు, హక్కులు మాకు వర్తిస్తాయి. దిల్లీ పోలీసులు అభిజీత్‌ను ఎక్కడికి తీసుకువెళ్లారు? దీనికి మీరు మాకు సమాధానం చెప్పాల్సిందే. అభిజీత్ చేతిలో త్రివర్ణ పతాకం పట్టుకుని బయటకు వచ్చారు. అసలు త్రివర్ణ పతాకం పట్టుకుని వెళ్లడం నేరం ఎలా అవుతుంది?" అని సీజేపీ ఆ పోస్ట్‌లో రాసింది.

ఫొటో సోర్స్, Ishant Chauhan/Hindustan Times via Getty Images
‘త్రివర్ణ పతాకంతో సమస్య ఉన్నవాళ్లు పాకిస్తాన్‌కు వెళ్ళిపోవాలి' అని దిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
అభిజీత్ దీప్కేను దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని ఆయన విమర్శించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఆయన విమర్శలు చేశారు.
"మన జాతీయ జెండాను మనదేశంలో ఎగరేయకుండా పాకిస్తాన్లో ఎగరేయాలా? భారత త్రివర్ణ పతాకంతో సమస్య ఉన్నవాళ్లు పాకిస్తాన్‌కు వెళ్లిపోవాలి" అని ‘ఎక్స్’ లో చేసిన పోస్ట్‌లో కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
అంతకుముందు అభిజీత్ దీప్కేను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న వీడియోను కేజ్రీవాల్ షేర్ చేశారు.
"ఇది పూర్తిగా నియంతృత్వమే. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం నేరమా? మోదీకి అభిజిత్ దీప్కే అంటే ఎంత భయమో దీప్కే అరెస్ట్‌తో అర్ధమవుతోంది" అని కేజ్రీవాల్ కామెంట్ చేశారు.
అభిజిత్ దీప్కేను అదుపులోకి తీసుకోవడంపై పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించారు.
"అసలు దిల్లీ పోలీసులు ఏం చేస్తున్నారు? భారత జాతీయ జెండాను పట్టుకున్నందుకు అభిజీత్ దీప్కేను నిర్బంధించారు. దీని గురించి ఒక్కసారి ఆలోచించండి. స్వతంత్ర భారతదేశంలో మన యువత తమ ప్రజాస్వామ్య హక్కులను శాంతియుతంగా వినియోగించుకుంటున్నందుకు నిర్బంధంలోకి వెళ్తున్నారు’’ అని మమతాబెనర్జీ పోస్ట్ చేశారు.
"ఇది అప్రకటిత అత్యవసర పరిస్థితి తప్ప మరేమీ కాదు. అసమ్మతికి భయపడే ప్రభుత్వం ఇప్పుడు ఒక తరాన్నే బెదిరించి, అణచివేయడానికి ప్రయత్నిస్తోంది. తాను నియంత్రించలేని గొంతును సహించలేని ఫాసిస్ట్ పాలన ప్రవర్తన ఇది." అని ఆమె విమర్శించారు.
‘‘మొదటి 50ఏళ్లు త్రివర్ణపతాకంపై ద్వేషం ప్రదర్శించారు. ఆ తర్వాత 25ఏళ్ల పాటు త్రివర్ణ పతాకాన్ని మోస్తున్నట్టు నటించారు. ఇప్పుడు దేశభక్తి ఉన్న యువత చేతుల్లో త్రివర్ణపతాకాన్ని చూసి భయపడుతున్నారు. ఇదే ఆరెస్సెస్, బీజేపీల తిరంగా యాత్ర’’ అని రాజకీయ కార్యకర్త యోగేంద్ర యాదవ్ అన్నారు.

ఫొటో సోర్స్, VATSYAYANA / AFP via Getty Images
ఏఐఎస్ఏ నాయకురాలు నేహా బోరాను మండి హౌస్ ప్రాంతంలో దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అంతకుముందు నేహా బోరా, ఇతరులు మండి హౌస్ ప్రాంతం నుంచి తిరంగాయాత్రను ప్రారంభించారు.
నేహా బోరాతో పాటు ఏఐఎస్ఏ, లెఫ్ట్ పార్టీలకు చెందిన ఇతర కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
"నేహాను గుర్తు తెలియని ప్రాంతానికి తరలించారు. ఆమె దగ్గర ఫోన్ కూడా లేదు. నేహా ఎక్కడ ఉందో దిల్లీ పోలీసులు చెప్పాలి. ఆమెను మరోసారి కిడ్నాప్ చేశారు... ఇది నిర్బంధం కాదు" అని నేహా బోరా ‘ఎక్స్’ ఖాతాలో ఓ పోస్ట్ ఉంది.
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నేహా బోరా నిరసన చేపట్టారు.
అంతకుముందు సీజేపీ తలపెట్టిన ‘లెహ్రా దో తిరంగా’ మార్చ్ కోసం జాతీయ జెండా పట్టుకుని వచ్చిన అభిజిత్ దీప్కేను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఫొటో సోర్స్, ANI
కాక్రోచ్ జనతా పార్టీ నాయకుడు అభిజీత్ దీప్కేను దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
దిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లోని సెంట్రల్ పార్క్‌లో ‘లెహ్రా దో తిరంగా-(జాతీయ జెండాను రెపరెపలాడించండి)’పేరుతో నిరసన కార్యక్రమానికి సీజేపీ పిలుపునిచ్చింది.
కన్నాట్‌ప్లేస్‌లో భారతీయ నాగరిక్ సురక్షాసంహిత(బీఎన్ఎన్ఎస్)లోని 163వ సెక్షన్ అమల్లో ఉంది. సీజేపీ నిరసనకు న్యూదిల్లీ మున్సిపల్ కౌన్సిల్ అనుమతి ఇవ్వలేదు.
‘‘మిమ్మల్ని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నిర్బంధిస్తున్నాం. కన్నాట్ ప్లేస్‌లో 163వ సెక్షన్ అమల్లో ఉంది. అందుకే మిమ్మల్ని అదుపులోకి తీసుకుంటున్నాం’’అని ఓ పోలీస్ అధికారి అభిజిత్ దీప్కేతో చెప్పారు. ఆ సమయంలో దీప్కే ఎన్సీపీ శరద్ పవార్ వర్గం అధికార ప్రతినిధి అనీశ్ గవాండే నివాసం నుంచి బయటకు వస్తున్నారు.
అక్కడకు చేరుకున్న దిల్లీ పోలీసులు అభిజీత్ దీప్కేను అదుపులోకి తీసుకున్నారు.
దిల్లీ పోలీసులు దీప్కేకు రెండు నోటీసులిచ్చారు. బీఎన్ఎస్ 163వ సెక్షన్ అమల్లో ఉన్నందున సెంట్రల్ పార్క్‌కు వెళ్లొద్దని దీప్కేను ఓ నోటీసులో ఆదేశించారు. సౌత్ వెస్ట్ దిల్లీ పోలీసులు ఇచ్చిన రెండో నోటీసులో అభిజీత్, ఆశుతోష్, సౌరభ్‌ను ఎయిర్‌పోర్టులో ముందస్తుగా అదుపులోకి తీసుకుని క ోర్టు ముందు హాజరుపర్చినప్పుడు కోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రస్తావించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించేలా, ప్రజల శాంతికి భంగం కలిగించేలా ఎలాంటి చర్యలకు పాల్పడకూడదని ఆదేశించారు.
దీప్కేను ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని దిల్లీ ఏడీసీపీ జైదేశ్ సింగ్ చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
నియోజకవర్గాల పునర్విభజనపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
"2026 ఆగస్టు 13న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వాయిదా పడ్డాయి. 64 రోజులు గడిచినా, పార్లమెంటు ఉభయ సభలను ఇంకా అధికారికంగా నిరవధిక వాయిదా వేయలేదు. ఇలాంటిది గతంలో ఎప్పుడూ జరగలేదు" అని ఖర్గే ఆ లేఖలో రాశారు.
"నియోజకవర్గాల పునర్విభజనపై రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టే ముందు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయమని కోరుతూ ఏప్రిల్ 11, 2026న మీకు నేను లేఖ రాసిన విషయం గుర్తుండే ఉంటుంది. కానీ మీరు అలా చేయలేదు"
‘‘ఆ తర్వాత 2026 ఏప్రిల్ 14వ తేదీ రాత్రి ఆలస్యంగా ఆ బిల్లులను బహిరంగంగా అందుబాటులోకి తెచ్చి ఏప్రిల్ 16వ తేదీన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నియోజకవర్గాల పునర్విభజనపై రాజ్యాంగ సవరణ బిల్లు 2026 ఏప్రిల్ 17వ తేదీన లోక్‌సభలో అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీని సాధించలేకపోయింది. దీంతో ఆ బిల్లు భారీ తేడాతో వీగిపోయింది.
ఆ తర్వాత అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్న నా అభ్యర్థనను పునరుద్ఘాటిస్తూ జూలై 16, ఆగస్టు 27తేదీల్లో మీకు మళ్ళీ లేఖ రాశాను. ఇప్పుడు నాలుగోసారి ఇదే విజ్ఞప్తి చేస్తున్నా" అని ఖర్గే ఆ లేఖలో రాశారు.

ఫొటో సోర్స్, ANI
కాక్రోచ్ జనతా పార్టీ నాయకుడు అభిజీత్ దీప్కే బస చేస్తున్న ప్రదేశానికి దిల్లీ పోలీసు బృందం చేరుకుంది.
అభిజీత్ దీప్కే.. ఎన్‌సిపి శరద్ పవార్ వర్గం అధికార ప్రతినిధి అనీష్ గవాండే నివాసంలో ఉంటున్నారు.
దిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో ఉన్న సెంట్రల్ పార్క్‌లో శుక్రవారం ‘లహరా దో తిరంగా’ కార్యక్రమంతో నిరసనలకు దీప్కే పిలుపునిచ్చారు.
ఈ నేపథ్యంలో దిల్లీ పోలీసులు ఆయన ఉంటున్న ‘గవాండే’ నివాసానికి చేరుకున్నారు.

ఫొటో సోర్స్, Mike Campbell/NurPhoto via Getty Images
సౌదీ అరేబియాలో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా రియాద్, దమ్మామ్, జెడ్డాకు ఈనెల 20వ తేదీవరకు విమానాలు రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది.
పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని , విమానాల రాకపోకల పునరుద్ధరణకు తగిన పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు ఒక అంచనాకు వస్తున్నామని ఎయిర్ లైన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.
విమానాల రద్దుతో ప్రభావితమైన ప్రయాణికులకు పూర్తి రీఫండ్ ఇస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రత తమ అత్యుత్తమ ప్రాధాన్యత అని పేర్కొంది.
అంతకుముందు, సౌదీలోని స్థానిక అధికారుల సూచనలను పాటించాలని, వైమానిక దాడి జరిగితే ఇంట్లోనే ఉండాలని పౌరులను కోరుతూ భారత రాయబార కార్యాలయం తన అడ్వైజరీలో సూచించింది.
సౌదీ అరేబియా నుంచి తక్షణమే వెళ్లాల్సిన అవసరం ఉన్న భారతీయ పౌరులు బహ్రెయిన్, కువైట్, ఖతార్ నుంచి ప్రయాణించడానికి ఏర్పాట్లు చేసుకోవచ్చని తెలిపింది.
ఇరాన్ మద్దతు ఉన్న హూతీ తిరుగుబాటుదారులు ఇటీవల సౌదీ అరేబియా అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిపిన దాడిలో ఒక భారతీయ పౌరుడు మరణించగా, 10 మంది గాయపడ్డారు.

ఫొటో సోర్స్, ANI
దిల్లీలోని కన్నాట్ ప్లేస్ సెంట్రల్ పార్క్‌లో అక్టోబర్ 16న ‘లెహ్రా దో తిరంగా’ పేరుతో సీజేపీ కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో, పోలీసులు న్యూదిల్లీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.
సోషల్ మీడియా, ప్రెస్ మీట్ ద్వారా అక్టోబర్ 16న సాయంత్రం 5 గంటలకు సెంట్రల్ పార్క్‌కు జాతీయ జెండాలతో తరలిరావాలని ప్రజలకు సీజేపీ పిలుపునిచ్చిందని దిల్లీ పోలీసు డీసీపీ నేహా యాదవ్ తెలిపారు.
ప్రస్తుత శాంతిభద్రతల పరిస్థితుల దృష్ట్యా కన్నాట్ ప్లేస్, పరిసర ప్రాంతాల్లో బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని నేహా యాదవ్ వెల్లడించారు.
ఈ నేపథ్యంలో, కన్నాట్ ప్లేస్‌లో మూతపడిన దుకాణాలు , భారీగా పోలీసు బలగాల మోహరింపు కనిపించాయి.

ఫొటో సోర్స్, ANI

ఫొటో సోర్స్, ANI

ఫొటో సోర్స్, ANI

ఫొటో సోర్స్, ANI

ఫొటో సోర్స్, ANI

ఫొటో సోర్స్, Prakash Singh/Bloomberg via Getty Images
స్టార్ లింక్ వ్యవహారంలో అమెరికా వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ ఆరోపణలపై రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పందించింది. శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసిన ఆ సంస్థ, తాము ఎప్పుడూ పోటీకి భయపడలేదని పేర్కొంది.
భారతదేశంలో స్టార్‌లింక్ ప్రవేశాన్ని అడ్డుకుంటున్నారని ఎలాన్ మస్క్ ఇటీవల ఆరోపించారు.
పారిశ్రామికవేత్త ముకేష్ అంబానీని "ప్రధాన మంత్రి అంబానీ" అని సంబోధించిన మస్క్, భారత్‌లో స్టార్‌లింక్‌కు నిష్పాక్షికంగా పోటీపడే అవకాశం ఇస్తారా? అని ప్రశ్నించారు.
రిలయన్స్ ప్రకటనలో, "ప్రతి భారతీయ కంపెనీలాగే రిలయన్స్ కూడా దేశీయ విదేశీ పెట్టుబడులతో పాటు సరికొత్త ఆలోచనలకు స్వాగతం పలికే దేశంలో అభివృద్ధి చెందింది. ముఖ్యంగా ప్రజల జీవితాలను మెరుగుపరిచే పనులను ఆహ్వానిస్తుంది"
స్టార్‌లింక్‌తో సహా ఉపగ్రహ సమాచార రంగంలో పోటీని స్వాగతిస్తున్నట్లు రిలయన్స్ తెలిపింది. జియోతో సహా ప్రతి కంపెనీ భారత ప్రజలకు సేవలు అందించాలని, దేశ చట్టాలు, విధానాలను పాటించాలని ఆ ప్రకటనలో పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
దిల్లీ పోలీసులు, ఐబీ సిబ్బంది తన ఇంటిని చుట్టుముట్టారని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే అన్నారు.
"ఇంటి చుట్టూ ఉన్న నాలుగు వీధుల్లో ఐబీ సిబ్బంది, దిల్లీ పోలీసు అధికారులు తిరుగుతున్నారు. నేను బయటకు వెళ్లినప్పుడల్లా నంబర్ ప్లేట్లు లేని వాహనాలు నన్ను అనుసరిస్తున్నాయి. నేను తిరిగి రాగానే, ఐబీ, పోలీసు సిబ్బంది మా వాచ్‌మన్‌తో మాట్లాడి వివరాలు సేకరిస్తున్నారు. కాబట్టి, దిల్లీ పోలీసులు నన్ను అదుపులోకి తీసుకోవచ్చు" అని మీడియాతో అభిజిత్ చెప్పారు.

ఫొటో సోర్స్, German Customs
జర్మనీలోని కోలాన్ బాన్ విమానాశ్రయంలో 90కి పైగా బల్లులు, విషపూరిత పాములను అక్రమంగా తరలించడానికి ప్రయత్నించిన వ్యక్తిని అధికారులు అడ్డుకున్నారు.
45 ఏళ్ల మెక్సికన్ అగ్నిమాపక సిబ్బంది సభ్యుడు గ్రీన్ ఎగ్జిట్ గుండా వెళ్తున్న సమయంలో "అనుమానాస్పదంగా ఆందోళన చెందుతూ" కనిపించినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.
ఆ వ్యక్తికి అధికారులు డ్రగ్స్ పరీక్ష నిర్వహించగా కొకైన్ ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది. ఆ తర్వాత ఆయన సూట్‌కేసును తనిఖీ చేశారు. అందులో ఎలాంటి డ్రగ్స్ లభించలేదు. కానీ, షాంపూ, క్రీమ్ సీసాలు, ప్లాస్టిక్ కంటైనర్లు, సాక్సులలో దాచిన వైపర్లు, రాటిల్‌స్నేక్స్, ఇగువానాలతో పాటు ఇతర జాతుల పాములు, బల్లులు దొరికాయి.
"విమానాశ్రయంలో సూట్‌కేసులలో తెచ్చే జ్ఞాపికల విషయంలో మా సహచరులు చాలా చూశారు. కానీ మెక్సికో నుంచి 37 సజీవ విషసర్పాలు, 55 బల్లులు రావడం ఇదే మొదటిసారి" అని కోలాన్ కస్టమ్స్ కార్యాలయ ప్రతినిధి జెన్స్ అహ్లాండ్ తెలిపారు.
కొన్ని జంతువులను "అమానుషమైన పరిస్థితుల్లో" ఉంచినట్లు అహ్లాండ్ చెప్పారు. మరికొన్ని మెక్సికో నగరం నుంచి ఇస్తాంబుల్ మీదుగా ప్రయాణించే సమయంలో చనిపోయాయి.

ఫొటో సోర్స్, Reuters
అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రంలో ఒక ప్రాథమిక పాఠశాలలో జరిగిన కాల్పులు ఘటనలో టీచర్ సహా 5, 8, 11 ఏళ్ల వయసున్న ముగ్గురు పిల్లలు మరణించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.
బెండ్ నగరంలోని సిల్వర్ రైల్ ప్రాథమిక పాఠశాల వద్ద ఈ ఘటన జరిగింది.
కాల్పులు జరిపిన వ్యక్తిని బెండ్ నగరానికి చెందిన 16 ఏళ్ల బాలుడిగా గుర్తించారు.
తాళం వేసి ఉన్న తలుపులపై కాల్పులు జరుపుతూ బాలుడు పాఠశాలలోకి ప్రవేశించారు. పాఠశాలలోకి వెళుతున్న అనుమానితుడిని కమ్యూనిటీలోని ఓ గన్ మెన్ వెంబడించారని, ఆయన చేతిలోనే బాలుడు హతమయ్యాడని పోలీసులు తెలిపారు.
ఘటనా స్థలంలో ఐదుగురు మృతి చెంది ఉన్నట్లు బెండ్ పోలీస్ చీఫ్ మైక్ క్రాంజ్ తెలిపారు.
ఈ ఘటనలో ఏడేళ్ల బాలుడు, మరో ఉపాధ్యాయురాలు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు, ప్రస్తుతం వారిద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లకు స్వాగతం.
నేను బీబీసీ ప్రతినిధి వద్ది ప్రభాకర్, మధ్యాహ్నం 2 గంటల వరకు ముఖ్యమైన వార్తలను మీకు అందిస్తాను.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.