‘ట్రంప్‌ను హతమార్చేందుకే కాల్పులు’- వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ ఫైరింగ్‌లో అనుమానితునిపై కేసు నమోదు

ఫొటో సోర్స్, Getty Images
కాలిఫోర్నియాకు చెందిన వ్యక్తిపై అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌ను హత్యచేయబోయారనే కేసు నమోదయింది.
31 ఏళ్ల కోల్ థామస్ అలెన్‌పై ఆయుధాలకు సంబంధించిన రెండు కేసులు నమోదయ్యాయి. సోమవారం(ఏప్రిల్ 27) వాషింగ్టన్ డీసీ కోర్టుకు హాజరైన కోల్ థామస్ ఎలాంటి వాదనలూ చేయలేదు.
వైట్‌హౌస్ కరెస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్ సెక్యూరిటీ చెక్ పాయింట్ దాటి వెళ్లేటప్పుడు ఆయన దగ్గర సెమీ-ఆటోమేటిక్ హ్యాండ్‌గన్, పంప్-యాక్షన్ షాట్‌గన్, మూడు కత్తులు ఉన్నాయని ప్రాసిక్యూటర్లు చెప్పారు.
ఆయన కాల్పుల్లో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ స్వల్పంగా గాయపడ్డారు.
నిందితుడు దోషిగా నిర్ధరణ అయితే జీవిత ఖైదు పడుతుంది.

అనుమానితుడు సోమవారం కోర్టుకు హాజరయినప్పుడు మౌనంగా ఉన్నట్టు కనిపించారు. బ్లూ జంప్‌సూట్ వేసుకున్నారు. నేమ్ ట్యాగ్ కనిపిస్తోంది.
మృదువుగా మాట్లాడారు. జడ్జి అడిగిన ప్రతి ప్రశ్నకు దాదాపుగా ఎస్, యువర్ ఆనర్, నో, యువర్ ఆనర్ అని సమాధానమిచ్చారు.
తన వయసు చెప్పారు. మాస్టర్స్ డిగ్రీ పూర్తయినట్టు తెలిపారు.
ఆయన వెంట ముగ్గురు అమెరికా మార్షల్స్ నిల్చుని ఉన్నారు. ఒకరు ఆయన పక్కన నిలబడ్డారు. ఈ కేసులో వాదనలు వినిపిస్తున్న ఫెడరల్ ప్రాసిక్యూటర్, వాషింగ్టన్ యూఎస్ అటార్నీ జినైన్ పిర్రో కూడా అక్కడే ఉండి గమనించారు.
శనివారం కాల్పులు మొదలైన తర్వాత ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, క్యాబినెట్ సభ్యులు, వైట్‌హౌస్ ఇతర అధికారులను వాషింగ్టన్ హిల్టన్ హోటల్ బాల్‌రూమ్ నుంచి వేగంగా తరలించారు.
బేస్‌మెంట్‌లో ఉన్న ప్రదేశానికి అనుమానితుడుపై అంతస్తులో ఉన్న సెక్యూరిటీ చెక్ పాయింట్‌ను దాటి దూసుకెళ్లాడన్న ఆరోపణలు వినిపించాయి.
'' ఓ సీక్రెట్ సర్వీస్ ఆఫీసర్‌కు ఛాతీలో గాయాలయ్యాయి. ఆయన వేసుకున్న బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వల్ల ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం ఏర్పడలేదు'' అని తాత్కాలిక అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచె చెప్పారు.
'' సాహసికుడైన ఆ అధికారి అలెన్‌పై ఐదు సార్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అలెన్‌కు గాయాలేమీ కాలేదు. నేలపై పడిపోయాడు. తర్వాత ఆయన్ను అరెస్టు చేశారు'' అని టాడ్ బ్లాంచె తెలిపారు.
అనుమానితుడు కనీసం ఓసారి కాల్పులు జరిపినట్టు భావిస్తున్నామని బ్లాంచె చెప్పారు.

ఫొటో సోర్స్, Donald Trump
అమెరికా అధ్యక్షునిపై హత్యాయత్నానికి తీవ్రమైన శిక్ష తప్పదా?
సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌కు అనుమానితుడి కాల్పుల్లో గాయాలయ్యాయా లేక ఇతర అధికారుల కాల్పుల్లో గాయపడ్డారా అన్నదానిపై స్పష్టత లేదు. గాయపడిన అధికారిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
అమెరికా అధ్యక్షుణ్ని హత్య చేయడానికి ప్రయత్నిస్తే జీవితఖైదు పడే అవకాశముంది.
ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఆయుధాన్ని తీసుకెళ్లడం, కాల్పులు జరపడం వంటి నేరాలకు పదేళ్ల జైలుశిక్ష పడే అవకాశముంది. అనుమానితుణ్ని మంగళవారం తిరిగి కోర్టులో హాజరుపరుస్తారు.
ట్రంప్‌ను హత్య చేయడానికి ప్రయత్నించేందుకు ఆయన అనేక రాష్ట్రాల గుండా ప్రయాణించారని కోర్టుకు తెలిపారు అధికారులు.
''లాస్ ఏంజెల్స్‌లోని టొర్రాన్స్ నగరంలోని తన ఇంటి నుంచి ఏప్రిల్ 21న అనుమానితుడు బయలుదేరారు. రైలులో షికాగో చేరుకున్నారు'' అని అధికారులు చెప్పారు.
ఏప్రిల్ 24న ఆయన షికాగో నుంచి బయలుదేరి వాషింగ్టన్ చేరుకున్నారు. ఘటన జరగడానికి ముందు రోజు హిల్టన్ హోటల్‌లో బస చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)































