కాకినాడలో అర్నబ్ బీభత్సం- విద్యుత్ లేక అంధకారం

ఫొటో సోర్స్, ANI
అర్నబ్ తుపాను తీరం దాటుతున్న సమయంలో కాకినాడ జిల్లాలో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. అధికారుల హెచ్చరికలతో ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. రాత్రంతా కురిసిన వర్షం ధాటికి పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
‘అర్నబ్’ ప్రభావం కాకినాడ జిల్లాలోని చాలా ప్రాంతాలపై పడింది. పగడాలపేట సహా పలు తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. వారి కోసం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి అక్కడ వారికి కావాల్సిన సౌకర్యాలు కల్పించారు.


