ఒకే కుటుంబంలో 83 మంది: 'రోజూ బస్తా బియ్యం వండుతాం'

వీడియో క్యాప్షన్, 'ఆదివారం ఒక పొట్టేలు,10 కేజీల చికెన్'
ఒకే కుటుంబంలో 83 మంది: 'రోజూ బస్తా బియ్యం వండుతాం'
ప్రచురణ

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఆరు తరాల ఒక పెద్ద ఉమ్మడి కుటుంబం ఉంది.

ఈ ఇంట్లో ఒక రోజు వంటకు 50 కిలోల బియ్యం బస్తా అవసరమవుతుంది.

ఆదివారం నాన్‌వెజ్ తినాలంటే ఒక పొట్టేలు కోయాల్సిందే.

ఎప్పుడైనా సాయంత్రం బజ్జీలు తిందామనుకుంటే 15 కిలోల పిండి సిద్ధం చేయాల్సిందే. ఎందుకంటే ఆ కుటుంబంలో పదీఇరవై మంది కాదు, ఏకంగా 83 మంది ఉంటారు.

83 మందికి చేసే వంటలన్నీ ఒకే వంటింటిలో జరుగుతాయి.

అది కూడా కట్టెల పొయ్యిపైనే చేయడం ఈ ఉమ్మడి కుటుంబం ప్రత్యేకత.

ఆరు తరాల నుంచీ ఈ ఇంట్లో పాతకాలం పద్ధతులనే ఉపయోగిస్తున్నారు.

ఆదివారం నాన్ వెజ్ తినాలంటే ఒక పొట్టేలు, పది కిలోల చికెన్ వండుతామని, ఇక పండుగలు, జాతరలు లాంటివి వచ్చాయంటే రెండు పొట్టేళ్లు, 20 కేజీల చికెన్ తీసుకురావాల్సిందేనని కుటుంబంలో ఒకరైన రాజేశ్వరి చెప్పారు.

''పండగ వచ్చిందంటే రెండు పొట్టేళ్లు 20 కేజీల చికెన్ వండాలి. ఒక ఆదివారం చేసుకోవాలంటే ఒక పొట్టేలు 10 కేజీల చికెన్ వండుతాం. ఇంకా కొంతమంది హాస్టల్లో ఉన్నారు కాబట్టి ఇది తక్కువే. చేసిన వాటిని దగ్గర్లో ఉన్న పిల్లలకు పంపిస్తాం. దూరం ఉండే వాళ్ళకి పంపించలేం'' అన్నారు.

అనంతపురం, ఉమ్మడి కుటుంబం

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)