దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు.. ఫోటోల్లో

ఉత్తరప్రదేశ్, ప్రయాగ్‌రాజ్
ఫొటో క్యాప్షన్, ఈ పండుగలో దేవుళ్ల పాత్రలను పోషించే నటులతో కూడిన వివిధ వేడుకలు ఉంటాయి. ఇక్కడ చిత్రంలో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఒక ఊరేగింపునకు ముందు శ్రీరాముడి పాత్రను పోషిస్తున్న నటుడు సిద్ధమవుతున్నారు.
    • రచయిత, రచితా ప్రసాద్
    • హోదా, బీబీసీ న్యూస్, ముంబయి
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

భారత్‌లో అత్యంత వైభవంగా జరుపుకొనే హిందూ పండుగలలో ఒకటి దసరా.

దేశవ్యాప్తంగా లక్షల మంది ప్రజలు ఈ పండుగను దేవతల ఊరేగింపులతో, భక్తిశ్రద్ధలతో కూడిన పూజతో ఘనంగా నిర్వహిస్తారు.

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈరోజున భారీ దిష్టిబొమ్మలను దహనం చేస్తుంటారు.

ఈ పండుగను దేశంలోని వివిధ ప్రాంతాల్లో భిన్నమైన ఆచారాలు, సంప్రదాయాలతో జరుపుకుంటారు. అయితే, అన్ని చోట్లా ఈ పండుగెంతో వైభవంగా జరుగుతుంటుంది.

పౌరాణిక కథల ప్రకారం 10 తలల రాజు అయిన రావణాసురుడిపై శ్రీరాముడు సాధించిన విజయానికి ప్రతీకగా.. అధర్మంపై ధర్మం సాధించిన గెలుపునకు సంకేతంగా ఈ పండుగను చూస్తారు.

ఈ పండుగ విజయదశమి రోజునే వస్తుంది. మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించినందుకు గుర్తుగా భారత్‌లోని తూర్పు, దక్షిణ, ఇతర ప్రాంతాలలో విజయదశమిని జరుపుకొంటారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అహ్మదాబాద్‌లో దసరా వేడుకలు
ఫొటో క్యాప్షన్, అహ్మదాబాద్‌లో దసరా వేడుకల్లో భాగంగా 10 తలల రాజు రావణాసురుడి భారీ ప్రతిమను బయటికి తీసుకొచ్చి, దహనం చేశారు.
'రామ్‌లీలా' నాటకం
ఫొటో క్యాప్షన్, హిందూ ఇతిహాసమైన రామాయణం ఆధారంగా ప్రదర్శించే నాటక రూపమే 'రామ్‌లీలా'. దసరా వేడుకల్లో భాగంగా నిర్వహించే ఈ ప్రదర్శనను ఇక్కడ నోయిడాలో చూడవచ్చు.
విజయదశమి, దసరా
ఫొటో క్యాప్షన్, పది తలల రాజు రావణుడిని ఓడించడాన్ని చెడుపై మంచి సాధించిన విజయంగా జరుపుకుంటారు. ఈ సందర్భంలో సీత తన భర్త శ్రీరాముడి మెడలో విజయమాల వేస్తుంది.
దిల్లీలోని ఓ మార్కెట్‌లో రావణుడి ప్రతిమలు
ఫొటో క్యాప్షన్, దసరా పండుగకు ముందు మార్కెట్లలో రావణుడి చిన్న ప్రతిమలు దర్శనమిస్తుంటాయి. దిల్లీలోని ఓ మార్కెట్‌లో అటువంటి ప్రతిమలను ఇవి.
పూల మార్కెట్
ఫొటో క్యాప్షన్, దేశంలో ఈ పండుగను వివిధ రకాలుగా జరుపుకుంటారు. ఇక్కడ, బెంగళూరులో దసరాకు ముందు ప్రజలు ఓ మార్కెట్లో పెద్ద ఎత్తున పూలను కొంటున్నారు.
బంతిపూలు, దసరా పండుగ
ఫొటో క్యాప్షన్, మంచిపై చెడు సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ వేడుకలు బంతిపూలతో ముడిపడి ఉంటాయి. ఈ పూలను దేశవ్యాప్తంగా దసరా పండుగకు ముందే మార్కెట్లకు తీసుకొస్తారు.

హిందువులు చంద్రమాన క్యాలెండర్‌ను అనుసరిస్తారు. నవరాత్రి అనే తొమ్మిది రాత్రుల పూజా వేడుకలు ముగిసిన తర్వాత వచ్చే పదవ రోజున దసరా పండుగ నిర్వహిస్తారు.

ఉత్తర భారత్‌లో దసరా పండుగకు ముందు రోజుల్లో, కళాకారులు ప్రత్యేకమైన వేషధారణలు, అలంకరణలతో 'రామ్‌లీల'ను ప్రదర్శిస్తారు. ఇది ప్రాచీన హిందూ ఇతిహాసమైన రామాయణాన్ని నాటక రూపంలో తెలియజేస్తుంది.

ఇందులో శ్రీరాముని వనవాసం, రావణునిచే సీతాదేవి అపహరణ, చివరగా చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరిగే యుద్ధం వంటి ఘట్టాలను ప్రదర్శిస్తారు.

ఈ నాటకం ముగిసిన తర్వాత, రావణుడు, ఆయన సోదరుడు కుంభకర్ణుడు, కుమారుడు మేఘనాథుల దిష్టిబొమ్మలను దహనం చేసే ఆచారం ఉంటుంది.

నోయిడాలో రామ్‌లీలా ప్రదర్శన
ఫొటో క్యాప్షన్, నోయిడాలోని ఇక్కడ చిత్రంలో చూపిన విధంగా, రామ్‌లీలా ప్రదర్శనలు తరచుగా స్టాల్స్, రైడ్స్ వంటి కుటుంబ సభ్యులందరూ ఆనందించే విస్తృత కార్యక్రమాలతో కలిసి జరుగుతాయి.

తూర్పు ప్రాంతాల్లోనూ, మరికొన్ని ఇతర చోట్లా, అలాగే బంగ్లాదేశ్‌లోని హిందువులు, ఈ పండుగ సందర్భంగా 'దుర్గా పూజ' ద్వారా దైవిక స్త్రీ శక్తిని ఆరాధిస్తారు.

పట్టణాలు, నగరాల్లో దుర్గాదేవి, ఇతర దేవతల విగ్రహాలను ఉంచడానికి తాత్కాలిక మండపాలను ఏర్పాటు చేస్తారు. ప్రజలు ఈ మండపాలను సందర్శిస్తారు. వీటిలో మహిషాసురుడనే రాక్షసుడిని దుర్గా దేవి సంహరిస్తున్న దృశ్యాలను ప్రదర్శిస్తుంటారు.

దుర్గా పూజ వేడుకలకు ప్రసిద్ధి చెందిన కోల్‌కతా నగరంలో, సాంప్రదాయ వేడుకలలోకి సమకాలీన విషయాలు తరచుగా వస్తుంటాయి. ఉదాహరణకు, అక్కడ గుడారాలను థీమ్ ఆధారంగా అలంకరిస్తారు.

దుర్గా దేవీ విగ్రహం తయారీ, కోల్‌కతా
ఫొటో క్యాప్షన్, దుర్గా పూజ ఉత్సవాలలో దుర్గా దేవి ప్రతిమను ఏర్పాటు చేస్తారు. మహిషాసురుడనే రాక్షసుడిని దుర్గా దేవీ సంహరించిందని ప్రజలు నమ్ముతారు. కోల్‌కతాలో ఇక్కడ చూసినట్లుగా, కళాకారులు ఈ కార్యక్రమానికి వారాల ముందు నుంచే దుర్గా దేవీ విగ్రహాలను తయారు చేస్తారు.
సంధి పూజ
ఫొటో క్యాప్షన్, దుర్గా పూజలో అత్యంత పవిత్ర ఘట్టమైన 'సంధి పూజ' సమయంలో భక్తులు నూనె దీపాలను వెలిగిస్తారు.
దుర్గా పూజ
ఫొటో క్యాప్షన్, దుర్గా పూజ కోసం విగ్రహాలను ఉంచేందుకు అలంకారప్రాయంగా, కళాత్మకమైన తాత్కాలిక మండపాలను ఏర్పాటు చేస్తారు.
సాంప్రదాయ నృత్యాలు, గర్బా, గుజరాత్
ఫొటో క్యాప్షన్, గుజరాత్‌కు చెందిన గర్బా వంటి సాంప్రదాయ నృత్యాలు కమ్యూనిటీ వేడుకల్లో భాగంగా ఉంటాయి.

20 రోజుల తర్వాత వచ్చే దీపాల పండుగ దీపావళికి సన్నాహాలు కూడా దసరాతోనే మొదలవుతాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)