రద్దీగా ఉన్న రోడ్డులో 'స్పైడర్‌మ్యాన్'..
అమెరికాలో స్పైడర్-మ్యాన్ వేషధారణలో ఉన్న ఒక డ్రైవర్, రద్దీగా ఉన్న రోడ్డు మీద వీల్‌చైర్‌లో ఉన్న ఒక వ్యక్తి రోడ్డు దాటేందుకు సాయం చేస్తూ కనిపించారు.
క్రిస్టోఫర్ హెల్లెంథాల్ ఒక సూపర్‌హీరో-థీమ్ కార్యక్రమం నుంచి తిరిగి వస్తుండగా కూడలిలో సిగ్నల్ లైట్లు మారే క్షణాల ముందు వెంటనే సహాయం చేయడానికి ముందుకొచ్చారు.
ఆర్కన్సాస్ రాష్ట్రంలోని జోన్స్‌బోరో పోలీస్ డిపార్ట్‌మెంట్ ట్రాఫిక్ కెమెరా దృశ్యాల్లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. డ్రైవర్ హెల్లెంథాల్ చేసిన పనికి పోలీస్ డిపార్ట్‌మెంట్ కృతజ్ఞతలు తెలిపింది.
హీరోలందరూ కేప్‌లు ధరించరు, కానీ కొన్నిసార్లు వారు ఆ సందర్భానికి తగిన వేషధారణలో ఉంటారు అని పేర్కొంది.

ఫొటో సోర్స్, Jonesboro Police Department
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









