లైవ్, కారుతో ఢీకొట్టి ఆస్ట్రేలియా ఎంపీపై హత్యాయత్నం- పరిస్థితి విషమం

ఆస్ట్రేలియా ఎంపీ హెలెన్ హెయిన్స్‌ను కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ప్రకటించారు

సారాంశం

ఆస్ట్రేలియా ఎంపీ హెలెన్ హెయిన్స్‌ను కారు ఢీకొట్టడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ప్రకటించారు.

లైవ్ కవరేజీ

  1. పారిస్‌ సహా పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ

    ఫ్రాన్స్, పారిస్,
    ఫొటో క్యాప్షన్, అల్లర్లు చెలరేగిన పారిస్‌ సహా పలు ప్రాంతాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధింపు

    ఫ్రాన్స్‌లో అల్లర్లు చెలరేగిన పారిస్‌తోపాటు పలు ప్రాంతాల్లో రాత్రిపూట కర్ఫ్యూను విధించారు.

    దేశవ్యాప్తంగా శని, ఆదివారాల్లో జరిగిన అల్లర్లు, దోపిడీల కారణంగా ఫ్రాన్స్ అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. పారిస్‌లోని కొన్ని ప్రాంతాలతోపాటు ఇతర నగరాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధించారు.

    వారాంతంలో నిరసనకారులు గుమిగూడిన ప్లేస్ డి లా రిపబ్లిక్, లెస్ హాల్స్ షాపింగ్ ప్రాంతంలో స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని పారిస్ పోలీసులు తెలిపారు.

    ప్రజలు అనధికారిక సమావేశాలపై నిషేధం విధించారు. దక్షిణాన ఉన్న మార్సెయిల్, బోర్డో, నైస్, లియోన్ నగరాలతోపాటు ఉత్తరాన ఉన్న లిల్లే, ఇతర పట్టణాల్లో యువత కదలికలు, సమావేశాలపై ఆంక్షలు విధిస్తూ పాక్షిక కర్ఫ్యూలను ప్రకటించారు.

  2. ఆస్ట్రేలియా: ఎంపీని కారుతో గుద్ది హత్యాయత్నం

    ఆస్ట్రేలియా, ఎంపీ హెలెన్ హెయిన్స్‌, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి, ఆంథోనీ అల్బనీస్
    ఫొటో క్యాప్షన్, కారుతో ఢీకొట్టి ఆస్ట్రేలియా ఎంపీపై హత్యాయత్నం

    ఆస్ట్రేలియా ఎంపీ హెలెన్ హెయిన్స్‌ను కారు ఢీకొట్టడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆస్ట్రేలియా ప్రధాని ప్రకటించారు.

    విక్టోరియాలోని వాంగరట్టాలో తన కార్యాలయం బయట పార్కింగ్‌లో ఉండగా, సోమవారం మధ్యాహ్నం కారు ఢీకొనడంతో హెలెన్ హెయిన్స్ తీవ్రంగా గాయపడ్డారు. ఆమెకు శస్త్రచికిత్స జరిగింది. ఈ ఘటన ఉద్దేశపూర్వకంగా జరిగిందని ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ ప్రకటించారు. అయితే దాడి వెనుక ఉన్న ఉద్దేశం మాత్రం స్పష్టంగా తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.

    హెయిన్స్‌ను ఢీకొట్టడానికి కారు డ్రైవర్ యూ టర్న్ తీసుకు వచ్చినట్టు కనిపిస్తోందని అల్బనీస్ అన్నారు. కారు నడుపుతున్న 43 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

    హెలెన్ హెయిన్స్ ఆగ్నేయ ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో గల ఇండి డివిజన్‌కు చెందిన 65 ఏళ్ల స్వతంత్ర ఎంపీ.

    ఆమె 2019లో తొలిసారిగా ఆస్ట్రేలియన్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు ఎన్నికయ్యారు. 2022, 2025లలో తిరిగి ఎన్నికయ్యారు.

    రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ముందు ఆమె నర్సుగా, ప్రజారోగ్య పరిశోధకురాలిగా పనిచేశారు.

  3. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లకు స్వాగతం.

    నేను బీబీసీ ప్రతినిధి ఖగేష్, మధ్యాహ్నం 2 గంటల వరకు ముఖ్యమైన వార్తలను మీకు అందిస్తాను.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.