సోషల్ మీడియాలో ప్రజలతో అనుసంధానమైన అమ్మాయి ముభావంగా కూర్చున్నట్లు చూపించే GIF.

ఎప్పుడూ ఆన్‌లైన్‌లోనే.. కలవడమే అరుదు

ఆధునిక జీవనంలో పెరుగుతున్న ఒంటరితనంపై విశ్లేషణ

సింగపూర్‌లోని తన చిన్న అపార్ట్‌మెంట్‌లో ఉన్న శశాంక్‌కు... ఫ్యామిలీ గ్రూప్ చాట్ నుంచి వరుసగా వస్తున్న “హ్యాపీ దీపావళి” మెసేజ్‌లతో ఫోన్ మోగుతూనే ఉంది.

కాసేపయ్యాక, ఆయన తల్లి వీడియో కాల్ చేశారు. స్క్రీన్‌పై అలా స్వైప్ చేయగానే శశాంక్ ఒక్కసారిగా ముంబయిలోని తన ఇంటికి వెళ్లినట్లయింది.

పండగ దుస్తుల్లో ఉన్న బంధువుల కోలాహలం, టపాసుల శబ్దాల మధ్య ఒకరినొకరు పిలుచుకుంటున్న కేరింతలతో ఆ లివింగ్ రూమ్ అంతా సందడిగా ఉంది.

ఆ క్షణంలో సింగపూర్‌లోని శశాంక్ గది కూడా బంధువులతో నిండినట్లు అనిపించింది. కానీ, కాల్ కట్ అవ్వగానే మళ్లీ నిశ్శబ్దం ఆవరించింది.

"మనుషుల మధ్య సాధారణంగా ఉండే ఆ ప్రత్యక్ష బంధాలు.. ఇక్కడ దాదాపు కరువయ్యాయి."

శశాంక్‌కు ఈ భావన కొత్తదేమీ కాదు. చదువు ఆ తర్వాత ఉద్యోగం కోసం ఆయన ఏడేళ్లుగా సింగపూర్‌లో ఉంటున్నారు.

పండగల సమయంలో ఇంట్లో లేకపోవడం ఆయన్ని బాధిస్తోంది. ముంబయి వస్తే, దీపావళి, హోలీ, వినాయక చవితి పండగలకు బంధువులంతా ఒక చోటకు చేరుకుంటారు. పసందైన ఆహారం, స్నేహితులు, ఇరుగుపొరుగువారితో ఆనందాన్ని పంచుకుంటారు.

సింగపూర్‌లో, ఆయన ఫోటోలు, ఫోన్ కాల్స్‌తోనే సంతృప్తి పడాల్సి వస్తుంది.

"కొన్నిసార్లు అది చాలా కష్టంగా ఉంటుంది. రోజులు గడిచే కొద్దీ అలవాటుపడిపోతారు” అని శశాంక్ అన్నారు.

సింగపూర్‌కు వచ్చిన కొత్త రోజుల్లో ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి శశాంక్ రకరకాల ప్రయత్నాలు చేశారు. ఆఫీసులో తానే ఖర్చు పెట్టి గ్రూప్ లంచ్ ఏర్పాటు చేసేవారు. అలా పరిచయం అనుబంధంగా మారుతుందని భావించేవారు.

అయితే అంత పెద్ద నగరంలో వయసు పెరిగిన తర్వాత కొత్త స్నేహితులను సంపాదించుకోవడం అంత తేలిక కాదని ఆయన త్వరలోనే గ్రహించారు.
“వారిని కుటుంబంగా భావించడం కాస్త అమాయకత్వమే. వారికి కూడా వ్యక్తిగత జీవితం ఉంటుంది కదా” అని శశాంక్ అన్నారు.

“అఫ్‌కోర్స్, టెక్నాలజీ మీకు సాయపడుతుంది. మీరు మీ తల్లిదండ్రులకు వీడియోకాల్ చేయవచ్చు. కానీ భౌతికంగా వారితో ఉండే అనుబంధం అందులో ఉండదు” అని ఆయన సాలోచనగా చెప్పారు.

శశాంక్ ఎదుర్కొంటున్న ఈ పరిస్థితిని పరిశోధకులు "సోషల్ స్నాక్స్" (సామాజిక చిరుతిండ్లు) అని పిలుస్తారు.

ఇవి కేవలం మన దృష్టిని ఆకర్షించే చిన్న చిన్న డిజిటల్ సంభాషణలు మాత్రమే. ఇవి నమ్మకం, ఆత్మీయత లేదా ఒక ఆప్యాయత లాంటి లోతైన అవసరాలను తీర్చలేవు. ఇవి పైకి బంధాలుగా కనిపిస్తాయి కానీ, మనసుకు మాత్రం ఆ అనుభూతిని ఇవ్వలేవు.

దీని ప్రభావాలు ప్రపంచవ్యాప్తంగా గమనించవచ్చు.

ఒంటరితనం ప్రపంచ ప్రధాన ప్రజారోగ్య సమస్య అని ప్రపంచ ఆరోగ్య సంస్థ వర్గీకరించింది. చిన్నారులు, యువకులు, పెద్దలు- చరిత్రలో ఎన్నడూ లేనట్లుగా ఈ తరం డిజిటల్‌గా కనెక్ట్ అయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.

ప్రపంచవ్యాప్తంగా 2014-2023 మధ్య కాలంలో ప్రతీ ఆరుగురిలో ఒకరు ఒంటరితనాన్ని అనుభవించారు.

సామాజిక అనుబంధాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కమిషన్ 2025

2014-2019 మధ్య కాలంలో, ఒంటరితనం, సామాజిక ఏకాకితనం కారణంగా ఏటా 8.71 లక్షల మంది మరణించినట్లు అంచనా.

2014-2019 మధ్య కాలంలో, {{beginHighlight-purple}} ఒంటరితనం, సామాజిక ఏకాకితనం {{endHighlight}} కారణంగా ఏటా {{beginHighlight-h2}} 8.71 లక్షల మంది {{endHighlight}} మరణించినట్లు అంచనా.

13 నుంచి 17 ఏళ్ల వయసు ఉన్న టీనేజర్లలో ఐదుగురిలో ఒకరు ఒంటరితనంతో బాధపడుతున్నారు.

13 నుంచి 17 ఏళ్ల వయసు ఉన్న టీనేజర్లలో ఐదుగురిలో ఒకరు ఒంటరితనంతో బాధపడుతున్నారు.
18 నుంచి 29 ఏళ్ల మధ్య ఉన్నవారు అనేక ప్రాంతాల్లో పెద్దవాళ్లతో పోలిస్తే ఎక్కువ ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. చరిత్రలోనే అత్యధికంగా డిజిటల్‌గా కనెక్ట్ కావడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది.

18 నుంచి 29 ఏళ్ల మధ్య ఉన్నవారు అనేక ప్రాంతాల్లో పెద్దవాళ్లతో పోలిస్తే ఎక్కువ ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. చరిత్రలోనే అత్యధికంగా డిజిటల్‌గా కనెక్ట్ కావడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది.

"ప్రజల్లో ఎక్కువ మందిని నమ్మవచ్చు" అని భావించే భారతీయుల వాటా — 1993తో పోలిస్తే 2014లో తగ్గింది. {{beginHighlight-source}}(వరల్డ్ వ్యాల్యూస్ సర్వే, ప్రపంచ ఆరోగ్య సంస్థ){{endHighlight}}
35.5%1993
"ప్రజల్లో ఎక్కువ మందిని నమ్మవచ్చు" అని భావించే భారతీయుల వాటా — 1993తో పోలిస్తే 2014లో తగ్గింది. {{beginHighlight-source}}(వరల్డ్ వ్యాల్యూస్ సర్వే, ప్రపంచ ఆరోగ్య సంస్థ){{endHighlight}}
16.7%2014

"ప్రజల్లో ఎక్కువ మందిని నమ్మవచ్చు" అని భావించే భారతీయుల వాటా — 1993తో పోలిస్తే 2014లో తగ్గింది.

(వరల్డ్ వ్యాల్యూస్ సర్వే, ప్రపంచ ఆరోగ్య సంస్థ)

“ఒంటరితనం సామాజిక సమస్య మాత్రమే కాదు. ఇది మానసిక, శారీరక ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది.. నిరంతరం డిజిటల్‌గా కనెక్టై ఉండటం అనేది ప్రజలను ఒంటరితనం నుంచి రక్షించలేదు” — డాక్టర్ కృతి ఆనంద్, సీనియర్ కన్సల్టెంట్ సైకియాట్రీ, పారస్ హెల్త్, పంచకుల.

స్వేచ్ఛలోని వైరుధ్యాలు

స్వేచ్ఛలోని వైరుధ్యాలు

శశాంక్ ముంబయిలోని తన వాళ్ల కోసం తపన పడుతుంటే, తన ఇల్లుగా భావించే నగరం ఇకపై ఏ మాత్రం సురక్షితమైన ప్రదేశం కాదని యశోద భావిస్తున్నారు.

మాస్టర్స్ చేసేందుకు 2022లో యశోద బెర్లిన్‌ వెళ్లినప్పుడు, తనకు ఇంటి మీద బెంగ ఉంటుందని అనుకున్నారామె. బెర్లిన్‌లో ఆమె భాష, పరిచయం లేని సంస్కృతి, కుటుంబం, స్నేహితుల నుంచి దూరంగా ఉండటం లాంటి సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది.

కానీ, దిల్లీలో తనకు ఎప్పుడూ దొరకని స్వేచ్ఛ బెర్లిన్‌లో యశోదకు మొదటిసారి అనుభవంలోకి వచ్చింది. అక్కడ తనకిష్టమైనట్లుగా తిరిగే వీలు కలిగింది. రాత్రి వేళల్లో ఆలస్యమైనా ఒంటరిగా నడుచుకుంటూ ఇంటికి వెళ్లగలిగేవారు, తోచినప్పుడు నచ్చిన కార్యక్రమాలకు హాజరయ్యేవారు. వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన (భయపడాల్సిన) అవసరం లేకుండా బహిరంగ ప్రదేశాల్లో స్వేచ్ఛగా తిరిగేవారు.
“పురుషులు కూడా కేవలం సాటి మనుషులేనని నాకు మొదటిసారి అర్థమైంది” అని యశోద అన్నారు.

కానీ, దిల్లీకి తిరిగొచ్చిన తర్వాత ఆమెలో ఒంటరితనం మొదలైంది. వెళ్లడానికి ఎన్నో ప్రదేశాలు ఉన్నప్పటికీ, రాత్రి కర్ఫ్యూ వల్ల చీకటి పడకముందే ఇల్లు చేరాల్సిన పరిస్థితి. కలవడానికి స్నేహితులు ఉన్నా, బెర్లిన్‌లో లాగా ఇక్కడ ప్రయాణాలు అంత సులభం కాదు, రహదారులు కూడా అంత సురక్షితంగా లేవు.

“ఇక్కడ నాకు అన్నీ ఉన్నాయి, కానీ వేటినీ అనుభవించలేకపోతున్నాను.”

పెద్దవాళ్లయిన తర్వాత ఒంటరితనం

పెద్దవాళ్లయిన తర్వాత ఒంటరితనం

రిషబ్‌కు సురక్షితమైన స్థలం కనుక్కోవడం సమస్య కాదు. ఆయన ముంబయిలో ఉంటారు. అనేక భారతీయ మెట్రో నగరాల కంటే ముంబయిలో నేరాల రేటు తక్కువ. దిల్లీలో యశోద మాదిరిగా ఆయన బయటకు వెళ్లే ముందు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

అయినప్పటికీ, రిషబ్ తాను ఒంటరినని భావిస్తారు. అది తరచుగా వారానికి ఒకసారి ఉంటుంది.

“సోమవారం నుంచి శుక్రవారం వరకు ఆఫీసు ఉంటుంది. కానీ వీకెండ్లలో ఏం చేయాలో తెలియదు” అని ఆయన అన్నారు.

ఉద్యోగం కోసం ముంబయి వచ్చినప్పుడు 2 కోట్ల మంది జనాభా ఉన్న నగరంలో ఆయనకు స్నేహితులున్నారు. అయితే వారిని కలవడం చాలా ఖరీదైన, కష్టమైన వ్యవహారంగా ఉండేది.

క్విజ్ నైట్స్, బుక్ క్లబ్స్, కమ్యూనిటీ గ్రూపుల్లో పాల్గొంటూ ఎలాగోలా పదిమందితో పరిచయాలు పెంచుకోవడానికి ఆయన ప్రయత్నించారు. వారాల తరబడి ఇలాంటి కార్యక్రమాలకు వెళ్లడంతో... కొందరు అపరిచితులు కాస్తా అలవాటైన ముఖాలుగా మారి, చివరికి స్నేహితులయ్యారు.

"ఆ మూడు గంటలు నేను అన్నీ మర్చిపోతాను" అని రిషబ్ చెప్పారు.

ఒంటరితనం ఎలా ఏర్పడుతుందంటే

ఒంటరితనం ఎలా ఏర్పడుతుందంటే

శశాంక్, యశోద, రిషబ్... వీరి ఒంటరితనం వేర్వేరు రూపాల్లో ఉండవచ్చు. కానీ వారి కథల వెనుక ఒకే పోలిక ఉంది.

పట్టణ, ఆధునిక ఒంటరితనం అనేది ఎక్కువగా జీవనశైలి వల్ల వస్తున్నదే. నగరాలు కమ్యూనిటీ కోసం కాకుండా, ఉద్యోగాల చుట్టూనే రూపుదిద్దుకుంటున్నాయి. గంటల కొద్దీ ప్రయాణాలు సమయాన్ని తినేస్తున్నాయి. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు ఎంగేజ్‌మెంట్ కోసం తయారయ్యాయి తప్ప, ఆత్మీయత కోసం కాదు. సామాజిక పరిధులు నిశ్శబ్దంగా తగ్గిపోతున్నాయి. పని సంస్కృతి అసలు సమయమే మిగల్చడం లేదు.

ఆసియా దేశాల్లో 18 శాతం మంది ప్రజలు ఒంటరితనంతో బాధపడుతున్నట్లు అంచనా. యూరప్‌లోని 10 శాతంతో పోలిస్తే ఇది రెట్టింపని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఒంటరితనం గురించి డబ్ల్యూహెచ్ఓ 142 దేశాల్లో ప్రజలపై అధ్యయనం చేసింది.

భారతదేశంలో ఈ అంతరం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడం, నగరాలకు మూకుమ్మడి వలసలు, సానిహిత్యానికి డిజిటల్ కనెక్టివిటీని ప్రోత్సహించే నగర జీవితం ఈ పరిస్థితికి దారి తీశాయి.

నిరంతరం ఆన్‌లైన్‌లో ఉండే తరం ఇది. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, వారికి పరిచయాలు ఉన్నాయా లేదా అని కాదు, అసలు బంధాలకు వారు సిద్ధంగా ఉన్నారా లేదా అన్నదే.

దీనికి నిపుణుల పరిష్కారం... తమ జీవితంలో ఏదో కోల్పోయామని నిస్సిగ్గుగా అంగీకరించే ధైర్యం వాళ్లకు ఉండాలి.

“డిజిటల్ కనెక్షన్ సంబంధాల సంఖ్యను పెంచుతుంది. అయితే వ్యక్తుల మధ్య ప్రత్యక్ష సంబంధాల్లో ఉండే అనుభూతి అందులో కనిపించదు. చాలా మంది వారికి వందల మంది ఫాలోవర్లు లేదా స్నేహితులు ఉన్నారు. అయితే వారితో ఏ బంధం కూడా అంత లోతైనదిగా చెప్పుకోలేరు” డా. సందీప్ వోహ్రా, మానసిక వైద్యుడు.

భారత్‌లో ఏఐ ఆధారిత మానసిక ఆరోగ్య స్క్రీనింగ్ సాధనమైన ఎమోషనల్ వెల్‌నెస్ ఇండెక్స్ అభివృద్ధి చేసిన మొదటి వ్యక్తి.