మాల్దీవులు: ప్రధాని మోదీపై వివాదాస్పద పోస్టులు పెట్టిన ముగ్గురు మంత్రుల సస్పెన్షన్

నరేంద్ర మోదీ లక్షదీవుల సందర్శనపై మాల్దీవుల మంత్రులు సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెట్టిన అనంతరం భారత్‌లో ఆగ్రహం వ్యక్తమవడంతో అక్కడి ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది.

లైవ్ కవరేజీ

  1. హైదరాబాద్: 'ముంబయి తరహా దాడులు చేస్తాం.. 300 మందిని చంపేస్తాం' అంటూ ఈ-మెయిల్.. పోలీసులు ఏం చెబుతున్నారు?

  2. 'నా చేతులకు ఉన్న మెహందీ చెరగక ముందే, కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తోంది'.. శ్రావణి రాణే, మహమ్మద్ ఫైజ్‌ల కేసు ఏమిటి?

  3. అమెరికా, రష్యా, చైనా కలిస్తే క్వాడ్ బలహీనపడుతుందా.. భారత్ వ్యూహం ఏంటి?

  4. మోదీ మాట వినడం వల్లే ప్రజలు బంగారం కొనడం తగ్గించారా.. అసలు పసిడి ధరలు పడిపోవడానికి కారణమేంటి?

  5. 'భర్తే మత్తుమందు ఇచ్చి ఇతరులకు అప్పగించాడు' దోషుల నిర్ధరణ వేళ బాధితురాలు ఏమన్నారంటే..

  6. కేఎల్ రాహుల్ సెంచరీ: ఆడిన బంతుల కంటే వదిలేసినవే ఎక్కువ, ఈ ఆటగాడిలో వచ్చిన మార్పేంటి?

  7. 6 ఏళ్లకే 80 ఏళ్ల వృద్ధురాలిలా కనిపిస్తున్న ఈ కేరళ చిన్నారికి ఏమైంది?

  8. తమిళనాడు: దోమలను పట్టుకుని జ్యూస్ చేస్తున్నారు ఎందుకు?

  9. తమిళనాడు పెట్టుబడుల రహస్యాలు ఆంధ్రప్రదేశ్‌కు లీకయ్యాయా, గైడెన్స్ సంస్థలో ఏం జరుగుతోంది?

  10. అనన్య బిర్లా: వ్యాపారాల నుంచి సినిమాల దాకా ఈమె పేరు ఎందుకు వినిపిస్తోంది?

  11. కొత్త నేపాల్, పాత పొరుగు దేశం.. బాలేంద్ర షాకు భారత్ పరీక్ష

  12. బొడ్డుతాడు రక్తం దాచిపెడితే భవిష్యత్తులో ఏ వ్యాధినైనా నయం చేయొచ్చా?

  13. భారత్, న్యూజీలాండ్ తొలి టెస్ట్: రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి 159 పరుగులు చేసిన టీమిండియా

    భారత్, న్యూజీలాండ్, క్రికెట్
    ఫొటో క్యాప్షన్, న్యూజీలాండ్‌తో తొలి టెస్ట్‌ ఆట ముగిసే సమయానికి భారత్ ఒక వికెట్ కోల్పోయి 159 పరుగులు చేసింది.

    భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసింది. భారత్ ఒక వికెట్ నష్టానికి 159 పరుగులు చేసింది.

    కేఎల్ రాహుల్ 52 పరుగులతో, దేవదత్ పడిక్కల్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. యశస్వి జైస్వాల్ 85 పరుగులు చేసి అవుటయ్యాడు.

    న్యూజీలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 368 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ ప్రస్తుతం న్యూజీలాండ్ కంటే 209 పరుగులు వెనుకబడి ఉంది.

    న్యూజీలాండ్ తరఫున హెన్రీ నికోల్స్ 175 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, గ్లెన్ ఫిలిప్స్ 118 పరుగులు చేశాడు.

    భారత్ తరఫున జస్ప్రీత్ బుమ్రా 92 పరుగులకు నాలుగు వికెట్లు తీయగా, ఆకాశ్ దీప్ 53 పరుగులకు మూడు వికెట్లు తీశాడు.

  14. ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల నటించిన ఓ.ఎం సినిమా ఎలా ఉంది?

  15. త్రైపాక్షిక శిఖరాగ్ర సమావేశం: ‘ఆర్భాటం ఎక్కువ, ఫలితాలు తక్కువ’

  16. ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్ ఫొటోను షేర్ చేసిన రాహుల్ గాంధీ, ఏమన్నారంటే..

    రాహుల్ గాంధీ
    ఫొటో క్యాప్షన్, ఇరాన్, అమెరికాలతో పాకిస్తాన్ చర్చలు జరుపుతుండగా, భారత్‌ కేవలం చూస్తూ ఉండిపోయిందని రాహుల్ గాంధీ తెలిపారు.

    కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శుక్రవారం సోషల్ మీడియాలో ఒక ఫోటోను షేర్ చేసి బీజేపీని లక్ష్యంగా చేసుకున్నారు. ఈ ఫోటోలో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఉన్నారు.

    "కాంగ్రెస్ అధికారంలో ఉండి ఉంటే, భారత ప్రధాని ఈ టేబుల్‌ వద్ద కూర్చుని ఉండేవారు. రాజీపడిన ప్రధాని ఎన్నడూ అక్కడ కూర్చోలేరు" అని ఆయన ఎక్స్‌ పోస్టులో రాశారు.

    గతంలో ఇరాన్ యుద్ధం, భారత విదేశాంగ విధానంపై కేంద్ర ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ లక్ష్యంగా చేసుకున్నారు. ఇరాన్, అమెరికాలతో పాకిస్తాన్ చర్చలు జరుపుతుండగా, భారత్‌ కేవలం చూస్తూ ఉండిపోయిందని అన్నారు.

    "భారత్‌ పరిమాణం, చరిత్ర, ఇతర దేశాలతో దానికున్న సంబంధాలను దృష్టిలో ఉంచుకుని, దానిని ప్రపంచ చర్చలో చేర్చాలి. కానీ, భారత్‌ ఇప్పుడు ఒక అప్రధాన పాత్రధారిగా మారింది. మనం ప్రపంచ వేదిక నుంచి తప్పుకున్నాం" అని రాహుల్ గాంధీ చెప్పారు.

    భారత్‌కు ఇప్పటికే ఇబ్బందులు ఉన్నాయని, ఇరాన్ యుద్ధం వాటిని మరింత తీవ్రతరం చేసిందని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాల పట్ల భారత్ ఉదాసీనంగా ఉండకూడదని రాహుల్ గాంధీ అన్నారు.

    రాహుల్ గాంధీ పోస్టుపై బీజేపీ జాతీయ మీడియా కన్వీనర్ ఆశిష్ అగర్వాల్ స్పందించారు.

    "అంతర్జాతీయ దౌత్య వాస్తవాలను రాహుల్ గాంధీ అర్థం చేసుకోవాలి. అమెరికా, రష్యా, చైనాల మధ్య జరిగే త్రైపాక్షిక సమావేశం భారత్‌ స్థానాన్ని నిర్ణయించదు. పరస్పరం పోటీపడుతున్న ప్రపంచశక్తులతోనూ భారత్ బ్రిక్స్, క్వాడ్, ఎస్‌సీఓ, జీ20, జీ7 వంటి వివిధ వ్యూహాత్మక వేదికల ద్వారా సంబంధాలు కొనసాగిస్తోంది" అని ఆశిష్ అగర్వాల్ ఎక్స్ పోస్టులోతెలిపారు.

    "భారత విదేశాంగ విధానాన్ని ప్రశ్నించే ముందు లేదా ప్రధానమంత్రిని 'రాజీ పడిన ప్రధాని' అని పిలిచే ముందు, డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సోనియా గాంధీ విదేశీ దేశాధినేతలను ఎందుకు కలిశారో రాహుల్ వివరించాలి" అని ప్రశ్నించారు.

  17. మెక్‌డొనాల్డ్స్‌లో లైంగిక వేధింపులు: 'బాలికలకు 18 ఏళ్లు వచ్చే వరకు ఎదురుచూస్తారు'

  18. నర్మదా నదీ తీరాన లభించిన భారీ దవడ శిలాజం ఏ జీవిది? పరిశోధకులు ఏం చెబుతున్నారు...

  19. తీవ్ర తుపాను నుంచి తుపానుగా బలహీనపడిన ‘అక్వాన్’

    అక్వాన్ తుపాను

    పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర తుపాను ‘అక్వాన్’ బలహీనపడి తుపానుగా మారింది. గత ఆరు గంటలుగా తుపాను గంటకు 21 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) తెలిపింది.

    ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశా తీరాలని తాకిన అక్వాన్ తుపాను బాహ్యవలయం, మరో 2 గంటల్లో పూర్తిగా తీరం దాటే సూచనలు కనిపిస్తున్నాయని పేర్కొంది.

    ప్రస్తుతం ఈ తుపాను కళింగపట్నానికి 80 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 190 కిలోమీటర్లు, గోపాల్‌పూర్‌కు 60 కిలోమీటర్లు, పూరీకి 160 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

    తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీఎస్‌డీఎంఏ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ సూచించారు.

    ఈ తుపాను కదలికలను విశాఖపట్నం, గోపాల్‌పూర్‌లోని డాప్లర్ వాతావరణ రాడార్ల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

  20. 2070 నాటికి భారత్‌లో హిందూ, ముస్లింల జనాభా ఎలా ఉండబోతోంది?