ఖతార్ - దహ్రా గ్లోబల్ కేసు: మరణ శిక్ష విధించిన భారత నేవీ మాజీ అధికారులకు శిక్ష తగ్గింపుపై కేంద్రం ఏం చెప్పింది?
ఈ ఎనిమిది మందిలో విశాఖపట్నానికి చెందిన పాకాల సుగుణాకర్ ఒకరు. కేసు అప్పీలుపై విచారణకు ఖతార్‌లో భారత రాయబారి, ఇతర అధికారులు హాజరయ్యారు.
లైవ్ కవరేజీ
వాహనాల మీద కులం పేరు రాయడంపై నిషేధం, గుజరాత్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధన ఏంటి?
కావ్య మారన్ - అనిరుధ్ వివాహ రిసెప్షన్‌కు ఎవరెవరు హాజరయ్యారో 9 ఫోటోలలో చూడండి
కేఎల్ రాహుల్ సెంచరీ: ఆడిన బంతుల కంటే వదిలేసినవే ఎక్కువ, ఈ ఆటగాడిలో వచ్చిన మార్పేంటి?
6 ఏళ్లకే 80 ఏళ్ల వృద్ధురాలిలా కనిపిస్తున్న ఈ కేరళ చిన్నారికి ఏమైంది?
తమిళనాడు: దోమలను పట్టుకుని జ్యూస్ చేస్తున్నారు ఎందుకు?
తమిళనాడు పెట్టుబడుల రహస్యాలు ఆంధ్రప్రదేశ్‌కు లీకయ్యాయా, గైడెన్స్ సంస్థలో ఏం జరుగుతోంది?
‘రోహింజ్యాలపై మియన్మార్ జాతి హననానికి పాల్పడింది’ - ఐసీజే తీర్పు ఎలాంటి ప్రభావం చూపనుంది?
అనన్య బిర్లా: వ్యాపారాల నుంచి సినిమాల దాకా ఈమె పేరు ఎందుకు వినిపిస్తోంది?
ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ చికిత్సలో దశాబ్దాల తర్వాత అతిపెద్ద ముందడుగు.. రోజువారీ మాత్రతో ప్రతి 12 మందిలో ఒకరిలో పూర్తిగా నయమైన కణితులు
కొత్త నేపాల్, పాత పొరుగు దేశం.. బాలేంద్ర షాకు భారత్ పరీక్ష
‘లాహోరీ జీరా’ : వంటింట్లో పుట్టిన ఈ సోడా వెయ్యికోట్ల వ్యాపారంగా ఎలా ఎదిగింది?
‘‘నాలుగు రొమ్ములు’ ఉన్నాయని వెక్కిరిస్తారని బాత్రూమ్లో దాక్కున్న రోజులున్నాయి’
బాలిస్టిక్ క్షిపణులతో యుక్రెయిన్‌పై రష్యా దాడి

ఫొటో సోర్స్, Reuters
ఫొటో క్యాప్షన్, యుక్రెయిన్‌పై రష్యా తీవ్రస్థాయిలో దాడి చేసింది. యుక్రెయిన్ రాజధాని కీయేవ్‌లోని వంతెనలు, రైల్వే స్టేషన్లను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులు చేసింది. బాలిస్టిక్ క్షిపణులతో తీవ్రస్థాయిలో దాడులు చేసింది.
ఇప్పటివరకు యుద్ధంలో జరిగిన అతిపెద్ద దాడుల్లో ఒకటిగా ఈ దాడులను యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియన్‌స్కీ అభివర్ణించారు. ఈ దాడుల్లో తొమ్మిది మంది మరణించారు.
యుక్రెయిన్‌లోని పలు నగరాలు, ప్రాంతాలపై రష్యా దాడులు చేసిందని,నివాస భవనాలు, ఇంధన సరఫరా కేంద్రాలను కూడా లక్ష్యంగా చేసుకుందని జెలియన్‌స్కీ చెప్పారు.
రష్యా 110కి పైగా క్షిపణులు, 400కు పైగా డ్రోన్లను ప్రయోగించిందని, 20 నుంచి 30 నిమిషాల వ్యవధిలో వరుసగా దాడులు చేసిందని చెప్పారు. ఇది అత్యంత ప్రమాదకరమైన వ్యూహమని ఆయన అన్నారు. ఈ దాడుల కారణంగా మంటలను ఆర్పడం, శిథిలాలను తొలగించడం, అత్యవసర సేవలను పునరుద్ధరించడం మరింత కష్టంగా మారిందన్నారు.
క్రిమియా బ్రిడ్జిపై జరిగిన దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంతకుముందే హెచ్చరించారు.
యుద్ధానికి ముగింపు పలికేందుకు వివిధ స్థాయుల్లో చర్చలు జరుగుతున్న సమయంలో రష్యా తాజా దాడులకు పాల్పడింది.
యుక్రెయిన్‌కు పాశ్చాత్య దేశాల మద్దతుతో భద్రతా హామీలు కల్పించే ప్రతిపాదనకు రష్యా అంగీకరించే అవకాశం ఉందని అమెరికా చేసిన వ్యాఖ్యలను రష్యా తోసిపుచ్చింది.

ఫొటో సోర్స్, AFP via Getty Images
ఫొటో క్యాప్షన్, రష్యా దాడుల్లో దెబ్బతిన్న యుక్రెయిన్ రైల్వే స్టేషన్. బొడ్డుతాడు రక్తం దాచిపెడితే భవిష్యత్తులో ఏ వ్యాధినైనా నయం చేయొచ్చా?
భారత్, న్యూజీలాండ్ తొలి టెస్ట్: రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి 159 పరుగులు చేసిన టీమిండియా

ఫొటో సోర్స్, Hagen Hopkins/Getty Images
ఫొటో క్యాప్షన్, న్యూజీలాండ్‌తో తొలి టెస్ట్ ఆట ముగిసే సమయానికి భారత్ ఒక వికెట్ కోల్పోయి 159 పరుగులు చేసింది. భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసింది. భారత్ ఒక వికెట్ నష్టానికి 159 పరుగులు చేసింది.
కేఎల్ రాహుల్ 52 పరుగులతో, దేవదత్ పడిక్కల్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. యశస్వి జైస్వాల్ 85 పరుగులు చేసి అవుటయ్యాడు.
న్యూజీలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 368 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ ప్రస్తుతం న్యూజీలాండ్ కంటే 209 పరుగులు వెనుకబడి ఉంది.
న్యూజీలాండ్ తరఫున హెన్రీ నికోల్స్ 175 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, గ్లెన్ ఫిలిప్స్ 118 పరుగులు చేశాడు.
భారత్ తరఫున జస్ప్రీత్ బుమ్రా 92 పరుగులకు నాలుగు వికెట్లు తీయగా, ఆకాశ్ దీప్ 53 పరుగులకు మూడు వికెట్లు తీశాడు.
ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల నటించిన ఓ.ఎం సినిమా ఎలా ఉంది?
త్రైపాక్షిక శిఖరాగ్ర సమావేశం: ‘ఆర్భాటం ఎక్కువ, ఫలితాలు తక్కువ’
ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్ ఫొటోను షేర్ చేసిన రాహుల్ గాంధీ, ఏమన్నారంటే..

ఫొటో సోర్స్, Ishant Chauhan/Hindustan Times via Getty Images
ఫొటో క్యాప్షన్, ఇరాన్, అమెరికాలతో పాకిస్తాన్ చర్చలు జరుపుతుండగా, భారత్ కేవలం చూస్తూ ఉండిపోయిందని రాహుల్ గాంధీ తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శుక్రవారం సోషల్ మీడియాలో ఒక ఫోటోను షేర్ చేసి బీజేపీని లక్ష్యంగా చేసుకున్నారు. ఈ ఫోటోలో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఉన్నారు.
"కాంగ్రెస్ అధికారంలో ఉండి ఉంటే, భారత ప్రధాని ఈ టేబుల్ వద్ద కూర్చుని ఉండేవారు. రాజీపడిన ప్రధాని ఎన్నడూ అక్కడ కూర్చోలేరు" అని ఆయన ఎక్స్ పోస్టులో రాశారు.
గతంలో ఇరాన్ యుద్ధం, భారత విదేశాంగ విధానంపై కేంద్ర ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ లక్ష్యంగా చేసుకున్నారు. ఇరాన్, అమెరికాలతో పాకిస్తాన్ చర్చలు జరుపుతుండగా, భారత్ కేవలం చూస్తూ ఉండిపోయిందని అన్నారు.
"భారత్ పరిమాణం, చరిత్ర, ఇతర దేశాలతో దానికున్న సంబంధాలను దృష్టిలో ఉంచుకుని, దానిని ప్రపంచ చర్చలో చేర్చాలి. కానీ, భారత్ ఇప్పుడు ఒక అప్రధాన పాత్రధారిగా మారింది. మనం ప్రపంచ వేదిక నుంచి తప్పుకున్నాం" అని రాహుల్ గాంధీ చెప్పారు.
భారత్‌కు ఇప్పటికే ఇబ్బందులు ఉన్నాయని, ఇరాన్ యుద్ధం వాటిని మరింత తీవ్రతరం చేసిందని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాల పట్ల భారత్ ఉదాసీనంగా ఉండకూడదని రాహుల్ గాంధీ అన్నారు.
రాహుల్ గాంధీ పోస్టుపై బీజేపీ జాతీయ మీడియా కోఆర్డినేటర్ ఆశిష్ అగర్వాల్ స్పందించారు.
"అంతర్జాతీయ దౌత్య వాస్తవాలను రాహుల్ గాంధీ అర్థం చేసుకోవాలి. అమెరికా, రష్యా, చైనాల మధ్య జరిగే త్రైపాక్షిక సమావేశం భారత్ స్థానాన్ని నిర్ణయించదు. భారతదేశం బ్రిక్స్, క్వాడ్, ఎస్సీఓ, జీ20, జీ7 వంటి వివిధ వ్యూహాత్మక వేదికల ద్వారా ప్రత్యర్థి దేశాలతో సంబంధాలు కొనసాగిస్తుంది" అని ఆశిష్ అగర్వాల్ ఎక్స్ పోస్టులోతెలిపారు.
"భారత విదేశాంగ విధానాన్ని ప్రశ్నించే ముందు లేదా ప్రధానమంత్రిని 'రాజీ పడిన ప్రధాని' అని పిలిచే ముందు, డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సోనియా గాంధీ విదేశీ దేశాధినేతలను ఎందుకు కలిశారో రాహుల్ వివరించాలి" అని ప్రశ్నించారు.
ఆకాశంలో ఒక తార రివ్యూ: భార్య కలను తన లక్ష్యంగా మార్చుకున్న భర్త కథ ప్రేక్షకులను మెప్పించిందా?
