క్రికెట్ వరల్డ్ కప్-2023 తాజ్ మహల్ దగ్గర... ఏంటీ కథ?

తాజ్ మహల్ వద్ద ఉంచిన ప్రపంచకప్ చిత్రాన్ని ఐసీసీ తన ట్విటర్ హ్యాండిల్‌లో షేర్ చేసింది. ప్రపంచకప్‌ పోటీలకు ఇంకా 50 రోజులే ఉంది అంటూ దానికి వ్యాఖ్యను జోడించింది.

లైవ్ కవరేజీ

  1. ఒప్పందం లేకుండానే ముగిసిన కాప్-31 వాతావరణ సదస్సు.. కారణాలేంటి?

  2. మాంసం తినకుండానే శరీరంలో ఐరన్ శాతాన్ని పెంచుకునే 5 మార్గాలు

  3. 'నా చేతులకు ఉన్న మెహందీ చెరగక ముందే, కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తోంది'.. శ్రావణి రాణే, మహమ్మద్ ఫైజ్‌ల కేసు ఏమిటి?

  4. అమెరికా, రష్యా, చైనా కలిస్తే క్వాడ్ బలహీనపడుతుందా.. భారత్ వ్యూహం ఏంటి?

  5. ప్రభాస్‌ను కలిసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

  6. మోదీ మాట వినడం వల్లే ప్రజలు బంగారం కొనడం తగ్గించారా.. అసలు పసిడి ధరలు పడిపోవడానికి కారణమేంటి?

  7. కళ్లలోకి కళ్లు పెట్టి చూసిన ఆ తిమింగలం కొన్ని రోజుల్లోనే కన్నుమూసింది.. కానీ దాని మరణం ఒక చరిత్ర సృష్టించింది

  8. 'భర్తే మత్తుమందు ఇచ్చి ఇతరులకు అప్పగించాడు' దోషుల నిర్ధరణ వేళ బాధితురాలు ఏమన్నారంటే..

  9. కేఎల్ రాహుల్ సెంచరీ: ఆడిన బంతుల కంటే వదిలేసినవే ఎక్కువ, ఈ ఆటగాడిలో వచ్చిన మార్పేంటి?

  10. 6 ఏళ్లకే 80 ఏళ్ల వృద్ధురాలిలా కనిపిస్తున్న ఈ కేరళ చిన్నారికి ఏమైంది?

  11. తమిళనాడు: దోమలను పట్టుకుని జ్యూస్ చేస్తున్నారు ఎందుకు?

  12. అనన్య బిర్లా: వ్యాపారాల నుంచి సినిమాల దాకా ఈమె పేరు ఎందుకు వినిపిస్తోంది?

  13. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ చికిత్సలో దశాబ్దాల తర్వాత అతిపెద్ద ముందడుగు.. రోజువారీ మాత్రతో ప్రతి 12 మందిలో ఒకరిలో పూర్తిగా నయమైన కణితులు

  14. కొత్త నేపాల్, పాత పొరుగు దేశం.. బాలేంద్ర షాకు భారత్ పరీక్ష

  15. ‘‘నాలుగు రొమ్ములు’ ఉన్నాయని వెక్కిరిస్తారని బాత్‌రూమ్‌లో దాక్కున్న రోజులున్నాయి’

  16. బొడ్డుతాడు రక్తం దాచిపెడితే భవిష్యత్తులో ఏ వ్యాధినైనా నయం చేయొచ్చా?

  17. భారత్, న్యూజీలాండ్ తొలి టెస్ట్: రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి 159 పరుగులు చేసిన టీమిండియా

    భారత్, న్యూజీలాండ్, క్రికెట్
    ఫొటో క్యాప్షన్, న్యూజీలాండ్‌తో తొలి టెస్ట్‌ ఆట ముగిసే సమయానికి భారత్ ఒక వికెట్ కోల్పోయి 159 పరుగులు చేసింది.

    భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసింది. భారత్ ఒక వికెట్ నష్టానికి 159 పరుగులు చేసింది.

    కేఎల్ రాహుల్ 52 పరుగులతో, దేవదత్ పడిక్కల్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. యశస్వి జైస్వాల్ 85 పరుగులు చేసి అవుటయ్యాడు.

    న్యూజీలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 368 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ ప్రస్తుతం న్యూజీలాండ్ కంటే 209 పరుగులు వెనుకబడి ఉంది.

    న్యూజీలాండ్ తరఫున హెన్రీ నికోల్స్ 175 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, గ్లెన్ ఫిలిప్స్ 118 పరుగులు చేశాడు.

    భారత్ తరఫున జస్ప్రీత్ బుమ్రా 92 పరుగులకు నాలుగు వికెట్లు తీయగా, ఆకాశ్ దీప్ 53 పరుగులకు మూడు వికెట్లు తీశాడు.

  18. త్రైపాక్షిక శిఖరాగ్ర సమావేశం: ‘ఆర్భాటం ఎక్కువ, ఫలితాలు తక్కువ’

  19. ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్ ఫొటోను షేర్ చేసిన రాహుల్ గాంధీ, ఏమన్నారంటే..

    రాహుల్ గాంధీ
    ఫొటో క్యాప్షన్, ఇరాన్, అమెరికాలతో పాకిస్తాన్ చర్చలు జరుపుతుండగా, భారత్‌ కేవలం చూస్తూ ఉండిపోయిందని రాహుల్ గాంధీ తెలిపారు.

    కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శుక్రవారం సోషల్ మీడియాలో ఒక ఫోటోను షేర్ చేసి బీజేపీని లక్ష్యంగా చేసుకున్నారు. ఈ ఫోటోలో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఉన్నారు.

    "కాంగ్రెస్ అధికారంలో ఉండి ఉంటే, భారత ప్రధాని ఈ టేబుల్‌ వద్ద కూర్చుని ఉండేవారు. రాజీపడిన ప్రధాని ఎన్నడూ అక్కడ కూర్చోలేరు" అని ఆయన ఎక్స్‌ పోస్టులో రాశారు.

    గతంలో ఇరాన్ యుద్ధం, భారత విదేశాంగ విధానంపై కేంద్ర ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ లక్ష్యంగా చేసుకున్నారు. ఇరాన్, అమెరికాలతో పాకిస్తాన్ చర్చలు జరుపుతుండగా, భారత్‌ కేవలం చూస్తూ ఉండిపోయిందని అన్నారు.

    "భారత్‌ పరిమాణం, చరిత్ర, ఇతర దేశాలతో దానికున్న సంబంధాలను దృష్టిలో ఉంచుకుని, దానిని ప్రపంచ చర్చలో చేర్చాలి. కానీ, భారత్‌ ఇప్పుడు ఒక అప్రధాన పాత్రధారిగా మారింది. మనం ప్రపంచ వేదిక నుంచి తప్పుకున్నాం" అని రాహుల్ గాంధీ చెప్పారు.

    భారత్‌కు ఇప్పటికే ఇబ్బందులు ఉన్నాయని, ఇరాన్ యుద్ధం వాటిని మరింత తీవ్రతరం చేసిందని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాల పట్ల భారత్ ఉదాసీనంగా ఉండకూడదని రాహుల్ గాంధీ అన్నారు.

    రాహుల్ గాంధీ పోస్టుపై బీజేపీ జాతీయ మీడియా కన్వీనర్ ఆశిష్ అగర్వాల్ స్పందించారు.

    "అంతర్జాతీయ దౌత్య వాస్తవాలను రాహుల్ గాంధీ అర్థం చేసుకోవాలి. అమెరికా, రష్యా, చైనాల మధ్య జరిగే త్రైపాక్షిక సమావేశం భారత్‌ స్థానాన్ని నిర్ణయించదు. పరస్పరం పోటీపడుతున్న ప్రపంచశక్తులతోనూ భారత్ బ్రిక్స్, క్వాడ్, ఎస్‌సీఓ, జీ20, జీ7 వంటి వివిధ వ్యూహాత్మక వేదికల ద్వారా సంబంధాలు కొనసాగిస్తోంది" అని ఆశిష్ అగర్వాల్ ఎక్స్ పోస్టులోతెలిపారు.

    "భారత విదేశాంగ విధానాన్ని ప్రశ్నించే ముందు లేదా ప్రధానమంత్రిని 'రాజీ పడిన ప్రధాని' అని పిలిచే ముందు, డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సోనియా గాంధీ విదేశీ దేశాధినేతలను ఎందుకు కలిశారో రాహుల్ వివరించాలి" అని ప్రశ్నించారు.

  20. మెక్‌డొనాల్డ్స్‌లో లైంగిక వేధింపులు: 'బాలికలకు 18 ఏళ్లు వచ్చే వరకు ఎదురుచూస్తారు'