ఫ్రాన్స్‌లోని పరిస్థితికి వలసదారులే కారణమని ట్రంప్ ఆరోపణ

ఫొటో సోర్స్, Anna Moneymaker/Getty Images
ఫ్రాన్స్‌లో జరిగిన హింసాత్మక ఘర్షణలకు వలసదారులు, జిహాదీలు, కమ్యూనిస్టులే కారణమని ట్రంప్ ఆరోపించారు.
కాన్సాస్‌లోని విచిటాలో జరిగిన ఒక ప్రచార సభలో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, ఫ్రాన్స్‌లో కొనసాగుతున్న ఘర్షణల గురించి ప్రస్తావించారు. రాబోయే మధ్యంతర ఎన్నికల ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. అమెరికాలో అలాంటి పరిస్థితులు రాకుండా నివారించాలని మద్దతుదారులకు సూచించారు.
ఐరోపా వామపక్ష నాయకులు "పాశ్చాత్య విలువలను దెబ్బతీసే" వలస విధానాలను అనుసరిస్తున్నారని ట్రంప్ ఆరోపించారు. ఐరోపాలో జరిగిన తప్పులు జరగొద్దని అన్నారు.
"పశ్చిమ దేశాలతో ఏమాత్రం సంబంధం లేని మూడో ప్రపంచ దేశాల వలసదారులను ప్రపంచ వామపక్షం ఐరోపాకు తీసుకువస్తోంది. వారు ఫ్రాన్స్‌లోని ప్రతి విషయాన్నీ ద్వేషిస్తారు. వారు ఆ దేశాన్ని నాశనం చేస్తున్నారు. మన దేశానికి అలా జరగనివ్వం," అని ట్రంప్ అన్నారు.
విలేకరులతో మాట్లాడుతూ, దేశ సరిహద్దులను మూసివేయడం గురించి తాను ఫ్రాన్స్ అధ్యక్షుడిని ఇప్పటికే హెచ్చరించినట్లు ట్రంప్ చెప్పారు.
"ఫ్రాన్స్‌లో జరుగుతున్నది పాఠశాలల వల్లనో లేదా మరే ఇతర కారణం వల్లనో కాదు. అది వలసల వల్లే," అని ట్రంప్ అన్నారు.



