లైవ్ , యుక్రెయిన్‌కు 500 పేట్రియాట్ క్షిపణుల విక్రయానికి అమెరికా ఆమోదం
రష్యా వైమానిక దాడులు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో యుక్రెయిన్‌కు 2.1 బిలియన్ డాలర్ల విలువైన 500 పేట్రియాట్ క్షిపణులను విక్రయించేందుకు అమెరికా ఆమోదం తెలిపింది.
సారాంశం
ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలిచి, ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా మనీషా భన్వాలా నిలిచారు.
కజకిస్థాన్ రాజధాని అస్తానాలో శుక్రవారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్‌లో అమెరికాకు చెందిన అబిగైల్ నెట్‌ను 8-6 తేడాతో ఓడించారు.
రష్యా వైమానిక దాడులు తీవ్రతరం చేస్తున్న నేపథ్యంలో యుక్రెయిన్‌కు 500 పేట్రియాట్ క్షిపణుల విక్రయానికి అమెరికా ఆమోదం తెలిపింది.
శ్రీహరికోట నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్18 రాకెట్ ద్వారా ఎన్‌వీఎస్-03 నావిగేషన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు ఇస్రో ప్రకటించింది.
శుక్రవారం శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్18 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.ఈ రాకెట్ ఎన్‌వీఎస్-03 ఉపగ్రహాన్ని విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి చేర్చింది.
లైవ్ కవరేజీ
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు: 40 మంది అభ్యర్థులతో ఆప్ తొలిజాబితా
ఫొటో సోర్స్, bhagwant mann/fb
ఫొటో క్యాప్షన్, భగవంత్ సింగ్ మాన్
పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ 2027లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థుల
తొలి జాబితాను విడుదల చేసింది.
ఈ జాబితాలో ధూరి నుంచి భగవంత్ మాన్, కోట్‌కపురా నుంచి కుల్తార్
సింగ్ సంధ్వాన్, అజ్నాలా నుంచి కుల్దీప్ సింగ్ ధాలివాల్, అమృత్‌సర్ సౌత్ నుంచి
డాక్టర్ ఇందర్‌బీర్ సింగ్ నిజ్జర్‌తో సహా మొత్తం 40 మంది అభ్యర్థుల పేర్లు
ఉన్నాయి.
టిక్కెట్లు ఖరారు అయిన వారందరికీ పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్
సింగ్ మాన్ అభినందనలు తెలిపారు. కొత్త వారికి కూడా ఈ ఎన్నికల్లో అవకాశం
కల్పిస్తామని అన్నారు.
, గుడ్ ఆఫ్టర్‌నూన్
నేను బీబీసీ ప్రతినిధి శారద మియాపురం, ఇప్పటినుంచి
రాత్రి 10 గంటల వరకు ముఖ్యమైన వార్తలను మీకు అందిస్తాను.
ఇండియాపై పాకిస్తాన్ గెలిచిందని షాబాజ్ షరీఫ్ అభినందనలపై విమర్శలు ఎందుకు?
ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో పాకిస్తాన్ విజయం పట్ల ఆ దేశ ప్రధాని షాబాజ్ షరీఫ్ స్పందించారు.
హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో భారత్‌పై పాక్ విజయం సాధించడంతో ప్రధాని షాబాజ్ షరీఫ్ అభినందనలు తెలిపారు. అయితే ఇది వరల్డ్ కప్ కాదంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు, ప్రముఖ విమర్శిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌ను 'బిహార్ ఆఫ్ సౌత్' అంటూ ఉత్తరాది రాష్ట్రంతో ఎందుకు పోలుస్తున్నారు?
ఫొటో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్, బిహార్
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చెలరేగిన హింసాత్మక ఘటనలపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ మొదలైంది. ''ఏపీని దక్షిణాది బిహార్‌గా మార్చేశారు'' అంటూ ట్రోలింగ్, విమర్శలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. హింసాత్మక ఘటనల ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఏపీ, బిహార్ మధ్య పోలికలు పెడుతూ కామెంట్లు పెడుతున్నారు.పూర్తి కథనం కోసం ఇక్క క్లిక్ చేయండి.
రాజరికాన్ని ప్రశ్నించినందుకు 34 ఏళ్ల జైలు శిక్ష
ఫొటో సోర్స్, Reuters
ఫొటో క్యాప్షన్, రాజకుటుంబాన్నిప్రశ్నించడంతో పాటు జవాబుదారీతనం ఉండాలని అర్ణోన్ నంపా డిమాండ్ చేశారు.
థాయ్‌లాండ్‌కు చెందిన
42 ఏళ్ల మానవ హక్కుల న్యాయవాది అర్ణోన్ నంపా.. ఆ దేశ రాజరిక వ్యవస్థను ప్రశ్నించినందుకు జైలు శిక్షలు ఎదుర్కొంటున్నారు.
2020లో బ్యాంకాక్‌లో హ్యారీ పోటర్ ఇతివృత్తంతో నిర్వహించిన నిరసనలో యువ మాంత్రికుడి వేషంలో పాల్గొన్న ఆయన.. రాజకుటుంబాన్నిప్రశ్నించడంతో పాటు జవాబుదారీతనం ఉండాలని డిమాండ్ చేశారు.
దీంతో రాజకుటుంబాన్ని అవమానించారనే ఆరోపణలపై థాయ్‌లాండ్‌లోని లెస్ మజెస్టే చట్టం
(ఆర్టికల్ 112) కింద ఆయనపై 14 కేసులు నమోదయ్యాయి. తాజాగా ఓ కేసులో కోర్టు ఆయనకు రెండేళ్ల ఎనిమిది నెలల జైలు శిక్ష విధించింది. దీంతో ఇప్పటివరకు ఆయనకు పడిన మొత్తం శిక్ష 34 ఏళ్లు దాటింది. మరో రెండు కేసుల్లో తీర్పు వెలువడాల్సి ఉంది.
2020 నుంచి ఈ చట్టం కింద
294 మందిపై కేసులు నమోదయ్యాయి. వీరిలో 18 ఏళ్లలోపు వారు 20 మంది ఉన్నారు. ఈ చట్టం ప్రకారం గరిష్ఠంగా 50 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
యుక్రెయిన్‌కు 500 పేట్రియాట్ క్షిపణుల విక్రయానికి అమెరికా ఆమోదం
ఫొటో సోర్స్, Reuters
ఫొటో క్యాప్షన్, ఆధునిక పీఏసీ-3 ఇంటర్‌సెప్టర్ క్షిపణుల విలువ సుమారు 2.1 బిలియన్ డాలర్లు ఉంటుందని అమెరికా విదేశీ వ్యహహారాల శాఖ వెల్లడించింది.
రష్యా వైమానిక దాడులు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో యుక్రెయిన్‌కు 2.1 బిలియన్ డాలర్ల విలువైన 500 పేట్రియాట్ క్షిపణులను విక్రయించేందుకు అమెరికా ఆమోదం తెలిపింది.
ఇటీవల నెలల్లో ఈ క్షిపణుల సరఫరాలో జాప్యం జరుగుతోందని యుక్రెయిన్ పేర్కొన్న నేపథ్యంలో అమెరికా నిర్ణయం వెలువడింది.
ఆధునిక పీఏసీ-3
ఇంటర్‌సెప్టర్ క్షిపణుల విలువ సుమారు 2.1 బిలియన్ డాలర్లు ఉంటుందని అమెరికా విదేశీ వ్యహహారాల శాఖ వెల్లడించింది. వీటి కొనుగోలు ఖర్చును ఐరోపాలోని యుక్రెయిన్ మిత్రదేశాలు,
కెనడా భరించనున్నాయనితెలిపింది.
పేట్రియాట్ క్షిపణుల సరఫరాను వేగవంతం చేయాలని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్ స్కీ పలుమార్లు అమెరికాను కోరారు. రష్యా ప్రయోగించే ప్రమాదకర బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకోవడానికి ఇవే సమర్థమైన ఆయుధాలని యుక్రెయిన్ భావిస్తోంది.
అమెరికా విదేశీ
వ్యహహారాల శాఖ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ కొనుగోలుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. 'జంప్‌స్టార్ట్' కార్యక్రమం ద్వారా కెనడా, జర్మనీ, నార్వే అందించే విరాళాలు, యూరోపియన్ యూనియన్
'యుక్రెయిన్ సపోర్ట్ లోన్' ద్వారా సమకూరే నిధులతో ఈ కొనుగోలుకు చెల్లింపులు చేయనున్నట్లు తెలిపింది.
ఈ ఒప్పందంలో ప్రధాన కాంట్రాక్టర్‌గా అమెరికాకు చెందిన లాక్‌హీడ్ మార్టిన్ వ్యవహరించనుంది. ఈ విక్రయంలో అమెరికా ప్రభుత్వ నిధులు ఏవీ వినియోగించడం లేదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
జీఎస్‌ఎల్‌వీ ద్వారా కక్ష్యలోకి చేరిన ఎన్‌వీఎస్-03 నావిగేషన్ ఉపగ్రహం
ఫొటో సోర్స్, ANI
ఫొటో క్యాప్షన్, తదుపరి తరం నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థలో ఎన్‌వీఎస్-03 మూడో ఉపగ్రహం.
శ్రీహరికోట నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్18
రాకెట్ ద్వారా ఎన్‌వీఎస్-03 నావిగేషన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు ఇస్రో ప్రకటించింది.
శుక్రవారం శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్18
రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.ఈ రాకెట్ ఎన్‌వీఎస్-03 ఉపగ్రహాన్ని విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి చేర్చింది.
జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్18/ఎన్‌వీఎస్-03 ప్రయోగం విజయవంతం కావడంతో శ్రీహరికోటలోనిసతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ఇస్రో శాస్త్రవేత్తలుఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు.
తదుపరి తరం నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థలో ఎన్‌వీఎస్-03
మూడో ఉపగ్రహం. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ సిరీస్ ద్వారా అందించే నావిగేషన్ సేవలను నిరంతరాయంగా కొనసాగించేందుకు దీన్ని రూపొందించారు.
దేశానికి స్థానం,
నావిగేషన్, సమయ నిర్ధరణ సేవలను స్వతంత్రంగా పొందే అవకాశం కల్పించే వ్యూహాత్మక ఉపగ్రహం ఇదని ఇస్రో చీఫ్ డాక్టర్ వి. నారాయణన్ అన్నారు.
నావిగేషన్ ఉపగ్రహాలను సాధారణ ప్రజలకు ఉపయోగపడే పనుల కోసం కూడా వినియోగిస్తారని ఆయన తెలిపారు. రైళ్లను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడంతో పాటు వాహనాలు,
సముద్ర నౌకల కదలికలను పర్యవేక్షించేందుకు ఇవి ఉపయోగపడతాయని చెప్పారు.
'వన్ నేషన్ వన్ టైమ్' ప్రాజెక్టులోనూ ఈ ఉపగ్రహం కీలక భాగమని వివరించారు.
'గగన్'
వ్యవస్థతో కలిసి నావిగేషన్ సేవలు అందించడం ద్వారా ప్రపంచ నావిగేషన్ వ్యవస్థలో భారత్ తన వంతు పాత్ర పోషిస్తోందని ఇస్రో చీఫ్ పేర్కొన్నారు.
మనీషా భన్వాలా: ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళ రికార్డు
ఫొటో సోర్స్, MANDEEP SAINI
ఫొటో క్యాప్షన్, ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన రెండో భారత రెజ్లర్‌గా మనీషా నిలిచారు.
ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో 59 కిలోల విభాగంలో స్వర్ణ పతకం గెలిచి,
ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా మనీషా భన్వాలా నిలిచారు.
కజకిస్థాన్ రాజధాని అస్తానాలో శుక్రవారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్‌లో అమెరికాకు చెందిన అబిగైల్ నెట్‌ను
8-6 తేడాతో ఓడించారు.
ఒలింపిక్స్‌లో లేని ఈ వెయిట్ కేటగిరీలో మనీషా తన పోరును ప్రీ క్వార్టర్ ఫైనల్‌తో ప్రారంభించారు. ఈ దశలో కెనడాకు చెందిన లారెన్స్ బ్యూత్రెగార్డ్‌ను విక్టరీ బై ఫాల్ పద్ధతిలో ఓడించారు.
క్వార్టర్ ఫైనల్‌లో మంగోలియాకు చెందిన బొలోర్తుయా ఖురెల్ఖూను
6-0 తేడాతో ఓడించారు. ఆ తర్వాత సెమీఫైనల్‌లో స్థానిక రెజ్లర్ అల్టిన్ షగయేవాను సాంకేతిక ఆధిక్యంతో ఓడించి ఫైనల్‌కు చేరుకున్నారు. దీంతో హరియాణాకు చెందిన మనీషా ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో స్వర్ణ పతకం సాధించారు.
ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన రెండో భారత రెజ్లర్‌గా మనీషా నిలిచారు. అంతకుముందు
2010లో మాస్కోలో జరిగిన పోటీల్లో సుశీల్ కుమార్ 66 కిలోల విభాగంలో బంగారు పతకం సాధించారు.
ప్రస్తుత చాంపియన్‌షిప్‌లో మహిళల విభాగంలో పతకాలు సాధించిన నాలుగో భారత రెజ్లర్ మనీషా. ఆమె కంటే ముందు నీలం సిరోహి
(50 కిలోలు), కాజల్ ధోచక్ (76 కిలోలు) రజత పతకాలు సాధించగా, తనూ శర్మ (72 కిలోలు) కాంస్య పతకం గెలుచుకున్నారు.
గుడ్ మార్నింగ్
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
నేను బీబీసీ ప్రతినిధి వద్ది ప్రభాకర్, మధ్యాహ్నం 2 గంటల వరకు ముఖ్యమైన వార్తలను మీకు అందిస్తాను.