'ఖూనీ దర్వాజ': భారత చరిత్రను మలుపు తిప్పిన ఈ దర్వాజ ప్రత్యేకత ఏంటి?

వీడియో క్యాప్షన్, భారత చరిత్రను ఎన్నో మలుపులు తిప్పిన 'ఖూనీ దర్వాజ'
'ఖూనీ దర్వాజ': భారత చరిత్రను మలుపు తిప్పిన ఈ దర్వాజ ప్రత్యేకత ఏంటి?
ప్రచురణ

దిల్లీలో ఎంతో చరిత్ర ఉన్న పురాతన కట్టడాల్లో ఈ ‘ఖూనీ దర్వాజా‘ ఒకటి.

ఒక్క ద్వారం, లెక్కలేనన్ని హత్యలు. ఆ ఒక్కో హత్యతో భారతదేశ చరిత్ర దిశ మారుతూ వచ్చింది.

దిల్లీ వీధుల్లో నడుస్తూ ఉంటే ఎన్నో ప్రాచీనకట్టడాలు కనిపిస్తుంటాయి.

ఐటీవో నుంచి జామా మసీదు వైపు బహదూర్ షా జాఫర్ రోడ్డులో వెళ్తుంటే మొఘలుల కాలానికి చెందిన ఓ ద్వారం కనిపిస్తుంటుంది. ఆ ద్వారం పేరే ‘ఖూనీ దర్వాజాఅంటే ‘కిల్లర్ గేట్’.

మొఘలుల కాలం నుంచి బ్రిటిష్ కాలం వరకు భారత చరిత్ర మార్చిన ఎన్నో హత్యలకు సాక్షిగా నిలిచిందీద్వారం.