You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘ఆస్కార్ అవార్డు ప్రజెంటర్లలో నేనూ ఉన్నా’- ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించిన దీపికా పదుకొణె
డ్వేన్ జాన్సన్, మైఖేల్ జోర్డాన్, రిజ్ అహ్మద్, ఎమిలీ బ్లంట్, గ్లెన్ క్లోజ్, ట్రాయ్ కోట్సర్, జెన్నిఫర్ కానెలీ, సామ్యూల్ జాక్సన్, మెలిసా మెకార్తీ, జో సల్దానా, డానీ యెన్, జొనాథన్ మేజర్స్ కూడా ఈ కార్యక్రమంలో ప్రజెంటర్లుగా వ్యవహరించనున్నారు
లైవ్ కవరేజీ
ఆసియా కప్ హాకీ: భారత అండర్-18 పురుషుల జట్టుకు స్వర్ణం.. మహిళల జట్టుకు కాంస్యం
జపాన్‌లో జరిగిన అండర్-18 ఆసియా కప్ 2026లో భారత పురుషుల హాకీ జట్టు స్వర్ణ పతకం సాధించగా, మహిళల హాకీ జట్టు కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.
మహిళల జట్టు దక్షిణ కొరియాను 3-0 తేడాతో ఓడించగా, పురుషుల జట్టు 4-1తో జపాన్‌పై విజయం సాధించింది.
భారత జట్ల ప్రదర్శనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
"కాంస్య పతకం గెలుచుకున్న భారత మహిళా అండర్-18 హాకీ జట్టుకు హృదయపూర్వక అభినందనలు. టోర్నమెంట్ అంతటా జట్టు అద్భుతమైన ప్రతిభను కనబరిచింది" అని మోదీ ఎక్స్ పోస్టులో తెలిపారు.
అలాగే స్వర్ణ పతకం సాధించిన పురుషుల జట్టుకు కూడా ప్రధాని మోదీ అభినందనలు తెలియజేశారు.
మీమ్ టు మూవ్‌మెంట్: జంతర్ మంతర్ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు.. శనివారం ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏం జరిగింది?
దిల్లీ అగ్ని ప్రమాదం: వైద్యం కోసం విదేశీయులు ఇండియాకు ఎందుకు వస్తున్నారు?
నార్వే చెస్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా ప్రజ్ఞానంద రికార్డు
భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద నార్వే చెస్ టైటిల్ సాధించాడు.
టోర్నమెంట్ చివరి రౌండ్‌లో జర్మనీకి చెందిన విన్సెంట్ కైమర్‌పై ప్రజ్ఞానంద విజయం సాధించాడు. మొత్తం 18 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుని టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. దీంతో నార్వే చెస్ టైటిల్ సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు.
ఈ టోర్నీలో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సన్‌ను ప్రజ్ఞానంద రెండుసార్లు ఓడించాడు.
చివరి నాలుగు రోజుల్లో అలీరెజా ఫిరౌజ్జా, కార్ల్‌సన్, ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ డి. గుకేష్‌లపై విజయాలు సాధించి టైటిల్ కైవసం చేసుకున్నాడు.
ప్రజ్ఞానందకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తదితరులు అభినందనలు తెలిపారు.
భారత జట్టులోకి వైభవ్ సూర్యవంశీ: సూర్యకుమార్‌కు దక్కని చోటు, కెప్టెన్‌గా శ్రేయస్
15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ భారత టీ20 జట్టుకు ఎంపికయ్యాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలతో పాటు ఏషియన్ గేమ్స్ 2026 కోసం శనివారం బీసీసీఐ ప్రకటించిన జట్టులో ఈ యువ ఆటగాడికి తొలిసారిగా చోటు దక్కింది.
సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్, బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా మీడియా సమావేశంలో ఈ జట్లను ప్రకటించారు. ఈ ఎంపికలో పలు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇటీవల భారత్‌కు టీ20 వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను జట్టు నుంచి తప్పించగా, అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. అలాగే, తిలక్ వర్మను వైస్ కెప్టెన్‌గా నియమించారు. మరోవైపు హార్దిక్ పాండ్యాకూ జట్టులో చోటు దక్కలేదు.
ఏషియన్ గేమ్స్ కోసం భారత జట్టు: శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ(వైస్ కెప్టెన్), రవి బిష్ణోయ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, శివమ్ దూబే, వరుణ్ చక్రవర్తి, వైభవ్ సూర్యవంశీ.
ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనల కోసం భారత జట్టు: శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ(వైస్ కెప్టెన్), రవి బిష్ణోయ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, మొహమ్మద్ సిరాజ్, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, శివమ్ దూబే, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ.
కాక్రోచ్ జనతా పార్టీ: అభిజిత్ దీప్కే, మోదీ ప్రభుత్వం గురించి ఏమన్నారు?
కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే, దిల్లీలోని జంతర్ మంతర్‌లో జరుగుతున్న నిరసనల్లో పాల్గొన్నారు.
ఆయన అమెరికా నుంచి శనివారం ఉదయం దిల్లీ చేరుకున్నారు.
‘సోషల్ మీడియాలో ఓ పేజీ నడపడం వల్ల ఏం వస్తుందని గత ఐదారు రోజులుగా చాలామంది నన్ను అడిగారు.
అలా అడిగిన వారికి ఈ కెమెరా తిప్పి చూపించండి. ఎంతమంది కాక్రోచ్‌లు ఈరోజు తమ ఇళ్ల నుంచి జంతర్ మంతర్ వద్ద నిరసనల్లో పాల్గొనడానికి వచ్చారో వారికి చూపించండి.
గత 10-12 ఏళ్లుగా వీళ్లంతా మనల్ని హిందూ-ముస్లిం రాజకీయాలకే పరిమితం చేశారు. ఆ రాజకీయాల వల్ల ఎవరికి ఏం ప్రయోజనం జరిగింది? హిందూ-ముస్లిం రాజకీయాలతో ఎవరికైనా ఉద్యోగాలు వచ్చాయా?’ అని వేదికపై నుంచి అభిజిత్ దీప్కే అన్నారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) డిమాండ్ చేస్తోంది. ఈ ఆందోళన ప్రదర్శనలను ప్రేమపూర్వకంగా, శాంతియుతంగా చేపట్టాలంటూ మద్దతుదారులకు సీజేపీ పిలుపునిచ్చింది.
జంతర్ మంతర్ వద్దకు చేరుకున్న అభిజిత్ దీప్కే
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలంటూ జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరసనలో వేల మంది పాల్గొన్నట్లు కాక్రోచ్ ఈజ్ బ్యాక్ హ్యాండిల్ ట్వీట్ చేసింది.
వేదిక వద్దకు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే చేరుకొని నిరసనల్లో పాల్గొన్నారు. వేదికపై నుంచి నినాదాలు చేశారు.
అక్కడ గుమిగూడిన నిరసనకారులంతా ‘ధర్మేంద్ర ప్రదాన్ గద్దె చోడ్’ అంటూ నినాదాలు చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో షేర్ అవుతున్న వీడియోల్లో కనిపిస్తోంది.
బీజేపీ మద్దతుదారుల నిరసనలు
అయితే, కాక్రోచ్ పార్టీ నిరసనలకు వ్యతిరేకంగా జంతర్ మంతర్ పరిసరాల్లోని బారికేడ్ల బయట బీజేపీ మద్దతుదారులు నిరసనలు మొదలుపెట్టినట్లు, వారిని పోలీసులు అక్కడి నుంచి బలవంతంగా పంపించినట్లు బీబీసీ ప్రతినిధి పవన్‌కాంత్ తెలిపారు.
సీఆర్‌పీఎస్ పోలీసులు బీబీసీకి వెల్లడించిన వివరాల ప్రకారం, జంతర్ మంతర్‌లో మొత్తం 700 మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బందిని మోహరించారు.
అమ్నియోసెంటెసిస్: 35 ఏళ్ల తరువాత గర్భం దాల్చిన మహిళలు ఈ ప్రత్యేక పరీక్ష చేయించుకోవాలా?
విమానం దిగగానే అభిజిత్ ఎలా కనిపించారు, ఏం చెప్పారు?
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకులు అభిజిత్ దీప్కే, దిల్లీ ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వస్తున్న వీడియోను వార్తా సంస్థ పీటీఐ ట్వీట్ చేసింది.
‘విద్యా శాఖ మంత్రి కచ్చితంగా రాజీనామా చేయాలి. అయిదుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు’ అని అభిజిత్ వ్యాఖ్యానించడం ఆ వీడియోలో చూడొచ్చు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ముఖచిత్రం ఉన్న పుస్తకాన్ని పట్టుకొని ఆయన ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వచ్చారు.
ఏఐ సాయంతో వ్యాక్సిన్ తయారీ, ఇకపై వైరస్ ‘వేషాల’కు చెక్ పెట్టొచ్చా?
సీజేపీ ధర్నా: ‘పూలు, పుస్తకాలు, జాతీయజెండా తీసుకురండి’’ అంటూ పిలుపు
జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ధర్నా చేయాలని మద్దతుదారులకు సీజేపీ ప్రతినిధులు పిలుపునిచ్చారు.
తమతో పాటు తిరంగా జెండా, పూలు, పుస్తకాలు తీసుకురావాలని కోరారు. ఎలాంటి హింసకు తావులేకుండా కేవలం శాంతిపూర్వకంగానే నిరసన చేపట్టి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాను సాధించుదామని ఎక్స్ వేదికగా ఒక వీడియోలో పేర్కొన్నారు.
మద్దతుదారులు తమతో పాటు తమ తల్లిదండ్రులను కూడా తీసుకురావాలని కోరారు.
ఎక్కడైనా హింసాత్మక ఘటనలు జరిగితే వెంటనే దిల్లీ పోలీస్‌కు రిపోర్ట్ చేయాలని, తమ ఫోన్లను ఆన్‌లో ఉంచుకోవాలని పిలుపునిచ్చారు.
ఇవే విషయాలను ప్రస్తావిస్తూ ధ్రువ్ రాఠీ కూడా ఎక్స్‌లో ఒక వీడియో పెట్టారు.
సోషల్ మీడియాలో పుట్టి నేడు తొలిసారి వీధుల్లోకి రానున్న కాక్రోచ్ జనతా పార్టీ
దేశ రాజధాని దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరనస తెలిపేందుకు అమెరికా నుంచి భారత్‌కు చేరుకున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసన తెలిపేందుకు సీజేపీ యోచిస్తోంది.
ఈ మేరకు జూన్ 5న ‘కాక్రోచ్ ఈజ్ బ్యాక్’ ఎక్స్ హ్యాండిల్ ఒక పోస్ట్ చేసింది. అందులో తమ ప్రణాళికను పంచుకుంది.
‘‘ఫెలో కాక్రోచెస్.. జూన్ 6న ఉదయం 9 గంటలకు కలుద్దాం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేలా నిరసన చేద్దాం. చిన్న తమాషాను ఉద్యమంగా మార్చే సమయం ఇదే. శాంతియుతంగా నిరసన తెలపడానికి దిల్లీ వీధుల్లోకి వచ్చేయండి. కానీ, అక్కడ ఏం చేయాలో? ఏం చేయకూడదో కూడా గుర్తుపెట్టుకోండి. అందరి కళ్లు మనమీదే’’ అని ఆ పోస్టులో పేర్కొన్నారు.
రాజేష్ ఎక్స్‌పోర్ట్స్: 15 లక్షల కోట్ల ‘నకిలీ ఆదాయం’ చూపిందని సెబీ ఆరోపిస్తున్న కంపెనీలో ఎల్ఐసీ భారీ పెట్టుబడులు ఎందుకు పెట్టింది?
అన్నామలై: ‘రజినీకాంత్ పిలిచినా వెళ్లలేదు.. అవసరమైతే బీజేపీతోనూ విభేదిస్తా’
రేంజ్ యాంగ్జైటీ: ‘చార్జింగ్ సరిపోతుందో లేదో’ - ఈ భయమే ఇండియాలో ఎలక్ట్రిక్ కార్ల కొనుగోళ్లకు అడ్డంకిగా ఉందా
నీట్ విద్యార్థిని ఆత్మహత్య : ‘‘అమ్మా నాన్నా నన్ను క్షమించండి.. మళ్లీ నీట్ పరీక్ష రాసే ధైర్యం లేదు, అంతా అయిపోయింది’’
సార్థక్,వేదాంత్, నిసర్గ్ : ఈ ముగ్గురు టీనేజర్లు ‘ఓఎస్ఎం వివాదం’పై ఏం చేశారు?
‘భయంకరమైన ఆర్థిక సునామీ రానుంది, ఏడాదిలోగా మోదీ దిగిపోతారు’అంటూ రాజకీయ దుమారం రేపిన రాహుల్‌గాంధీ
కాక్రోచ్ జనతా పార్టీకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి?